Guppedantha Manasu April 6th: తాత చెంతకు చేరిన మను.. కానీ ఓ కండీషన్.. అనుపమ భర్త ఎవరో తెలిసినట్టేనా?

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో ఏంజెల్ తన తాతయ్యకు మనుయే అనుపమ కొడుకు అని చెబుతుంది. అసుల అనుపమకు పెళ్లే కాలేదుగా కొడుకు ఎలా ఉంటాడాంటూ ప్రశ్నించాడు. ఏమో ఇప్పటి వరకు తను మన దగ్గర లేదు కదా అని ఏంజెల్ అనగా.. మనకు తెలియకుండా పెళ్లి చేసుకుని, కొడుకును కూడా కనిందంటే నాకు అనుమానంగా ఉందని అంటాడు. కానీ తను మనకు చెప్పి ఉంటే బాగుండని.. ఇప్పటికీ తనకు ఓ కొడుకు ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉందని అంటూనే.. మనవడు ఎలా ఉంటాడో అని అడగ్గా.. ఏంజెల్ తెలుగు సినిమా హీరోలా ఉంటాడని చెబుతాడు.

మనవడిని చూడాలని ఉందని విశ్వనాథం చెబుతాడు. ఆ తర్వాత నా మనవడు నాకు సపోర్టింగ్ గా ఉంటాడని చెప్పగా.. ఏంజెల్ ఎంతైనా అమ్మాయిలు.. అమ్మాయిలే, అబ్బాయిలు.. అబ్బాయిలే అంటూ చెబుతుంది. అదంతా విన్న విశ్వం.. నాకు మాత్రం కాదమ్మా.. అందరికంటే నువ్వే నాకు ఎక్కువ అంటూ వివరిస్తాడు. ఆ తర్వాత ఏంజెల్ త్వరలోనే మనును ఎలాగోలా ఇంటికి తీసుకు వస్తానని చెబుతుంది. ఆ తర్వాత ఏంజెల్ మనుకు ఫోన్ చేస్తుంది. ముందుగా అతడితో కామెడీ చేసిన ఈమె ఆ తర్వాత మీతో ఓ పని పడిందని అంటుంది.

Anupama Coming to mahendra s Home on Guppedantha Manasu April 6th 2024 Episode 1041

సరే విషయం ఏంటో చెప్పమనగా... మీతో మాట్లాడాలని అంటుంది. ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది.. రండి అంటూ పిలవగా.. మను మాత్రం నాకు ఐస్ క్రీం తినే ఉద్దేశం లేదని అంటాడు. వెంటనే ఫోన్ పెట్టేస్తాడు. తాతయ్య వద్దకు తన బావను ఎలా తీసుకు రావాలని చాలా అడుగుతుంది. ఆ తర్వాత వసుకు ఫోన్ చేసి చెబితే మను వింటాడని.. వెంటనే వసుధారకు ఫోన్ చేస్తుంది. తన తాతయ్యకు అసలు విషయం చెప్పానని.. విశ్వం తన మనవడిని చూడాలని అడుగుతున్నాడని అంటుంది. మనుకు చెప్పకుండా ఓ ప్లేస్ కు రమ్మంటే తను రానంటున్నాడని.. అందుకే నీకు ఫోన్ చేశానని అంటుంది. చెప్పకుండానే తీసుకు రా.. ఇక్కడకు వచ్చాకా విశ్వం చూసుకుంటాడని అంటుంది.

ఏదో ఒకటి చేసి వసు.. మనును తీసుకు వస్తానని అంటుంది. ఆ తర్వాత నేరుగా వసు మనును తీసుకుని వెళ్తుంది. ఎక్కడికెళ్తున్నామో చెప్పొచ్చు కదా అని అనగా.. సర్ ప్రైజ్ ఉండదుగా అంటాడు. ఏంజెల్ రమ్మంటే వెళ్లలేదని.. మీరేదో ముఖ్యమైన విషయం రమ్మన్నారు కాబట్టి వచ్చానని అంటాడు. అలా వసు, మనులు ఇద్దరూ కలిసి ఇంట్లోకి రాగానే.. విశ్వం మనవడిని చూసుకుని తెగ మురిసిపోతాడు. మను మను అంటూ కౌగిలించుకుంటాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఎక్కడకు ఏంజెల్ కూడా వస్తుంది. వారిద్దరినీ చూసి నవ్వుతుంది.

Anupama Coming to mahendra s Home on Guppedantha Manasu April 6th 2024 Episode 1041

ఆ తర్వాత విశ్వం.. మను నువ్వే ఈ ఇంటికి వారసుడివి అంటూ చెప్పుకొస్తాడు. నీవు ఇక్కడే ఉండే రాకుమారుడిలా పెంచుకునే వాడినని విశ్వం అంటాడు. ఏంజెల్ తన వారసురాలు అని, మను తన వారసుడు అని అంటాడు. ఒక్కసారి తాత్య అని పులువు మను అనగా.. నేను పిలవను, పిలవలేను అంటాడు. అదేంటి నాన్నా ఏమైంది అనగా... నేను మీ అమ్మ వాళ్ల నాన్నను అని విశ్వం చెబుతాడు. నువ్వు నా మనవడిని, ఒక్కసారి తాతయ్య అని పిలువు అంటూ అడగ్గా.. నాకిప్పుడు కొత్తగా ఏ బంధాలు వద్దు అనుకుంటున్నాను, నాకేం అవసరం లేదని అంటాడు. దీనికి విశ్వం నువ్వు పుట్టినప్పుడే వచ్చిన బంధాలు బాబు ఇవి అని వివరిస్తాడు.

మరి ఇంత కాలం ఈ బంధాలు ఏమైపోయాయని అడగ్గా.. ఈ ప్రపంచంలో కొన్ని కొన్ని సంఘటనలు వాటంతట అవే జరిగిపోతాయని అంటాడు. నాకు నిజం తెలియక దూరంగా ఉన్నానని.. అనుపమకు పెళ్లైన విషయం, తనకు ఓ కొడుకు ఉన్నాడని కూడా తెలీదంటే.. ఇప్పుడు కూడా అలాగే ఉండండి అంటూ మను చెబుతాడు. ఎందుకిలా చేస్తున్నారని వసు మనును అడగ్గా.. నాకిప్పటి వరకు ఇలాంటి బంధం చూడలేదు, అనుపమే నన్ను కొడుకుగా చూడట్లేదని.. అలాంటిది మిమ్మల్ని తాతయ్య అని ఎలా పిలవాలి అంటాడు. నాకు ఆవిడ లేకుండా మీరు లేరు కదా.. ఆవిడ దూరం అయ్యాకా మీరెలా దగ్గర అవుతారంటూ ప్రశ్నిస్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X