Guppedantha Manasu April 4th: ఇంట్లోంచి వెళ్లిపోయిన అనుపమ.. వసు, మహేంద్ర, మనులు ఏం చేశారంటే?
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో మహేంద్ర .. అనుపమపై కోప్పడతాడు. మను తండ్రి ఎవరో కచ్చితంగా చెప్పాలని అంటాడు. మను అంతగా బాధ పడుతుంటే నువ్వు మాత్రం ఎందుకిలా ఉంటున్నావని అడుగుతాడు. నాకు సమాధానం కావాలని.. మను సమస్యకు కచ్చితంగా పరిష్కారం కావాలని.. మీరెందుకు దూరం అయ్యారు, అతనెక్కడ ఉంటే అక్కడకు వెళ్తానంటూ చెప్పుకొస్తాడు. కానీ అనుపమ మాత్రం నోరు విప్పదు. ఇదంతా చూసిన మహేంద్ర.. ఇప్పటికైనా నిజం చెప్పు, ఇంకా మనును ఇబ్బంది పెట్టకు అంటూ ఫైర్ అవుతాడు. మహేంద్ర ఎంత అడిగినా అనుపమ మాత్రం అస్సలే చెప్పనని అంటుంది.
అంతలోనే వసు కల్గజేసుకుని ఆమె చెప్పకపోయినా.. త్వరలోనే నిజాలు బయట పడతాయని అంటుంది. మహేంద్ర మాత్రం అలా కాదని.. లోపం మనులో కాదు అనుపమలోనే ఉందని మహేంద్ర ఫైర్ అవుతాడు. ఆవిడ సమాధానం చెప్పకపోవడం వల్ల కదా ఈ సమస్యలు అంటూ.. జగతి విషయంలో మనుల్ని ఎంతగా తిట్టింది, ఎంతగా వేదించిందో గుర్తుందా అంటూ అనేక విషయాలు గుర్తు చేస్తాడు. ఆ తర్వాత ఆయన వెళ్లిపోగా.. వసు అలా చూస్తూ ఉండిపోతుంది. ఇక ఆ తర్వాత దేవయాని.. శైలేంద్ర, రాజీవ్ లతో మాట్లాడుతూ కనిపిస్తుంది. ముగ్గురం కలిసి ఎన్ని ప్లాన్ లు వేసినా ఫెయిల్ అవుతున్నాయి కదా.. అందుకే సెపరేట్ గా ప్లాన్ చేసుకుందామని అంటుంది.

శైలేంద్ర మను సంగతి చూసుకుంటాడని, నేను అనుపమ సంగతి చూసుకుంటానని అలాగే రాజీవ్ వసు విషయం చూసుకుంటాడని అంటుంది. ఇలా మనం ఒక్కొక్కరినీ ఒక్కొక్కరు ఫోకస్ చేస్తే.. మనం కచ్చితంగా సక్సెస్ అవుతామంటూ వివరిస్తుంది. అలాగే తమ ఆపరేషన్ కు డీఆర్ఎస్ అని పేరు పెట్టాననగా.. అది మార్చాలని శైలేంద్ర అంటాడు. బాలేదని చెప్పగా.. రాజీవ్ మాత్రం అదేం లేదు నా పేరు ముందు వచ్చిందని.. తన పేరు ముందు పెట్టమంటున్నాడని వివరిస్తాడు. దీనికి దేవయాని పేరుతో ఏముంది నాన్నా.. మనకు పని ముఖ్యం అంటుంది. ఇంతలోనే రాజీవ్ నువ్వేం విలన్ వి, ఒక్కసారైనా జైలుకు వెళ్లావా.. ఇంత చిన్న దానికే టెన్షన్ పడుతున్నావంటూ అంటాడు.
ఇక ఆ తర్వాత వసు ఇంట్లో.. అనుపమ గురించి వెతుకుతుంది. ఎంతకీ కనిపించకపోవడంతో.. మహేంద్ర వచ్చి పిలుస్తాడు. అయినా అలికిడి లేకపోయేసరికి ఇద్దరూ ఇల్లంతా వెతుకుతారు. ఇక అప్పుడే వసుకు ఓ లెటర్ కనిపించగా అది చూస్తుంది. అందులో "నన్ను క్షమించు మహేంద్ర.. మీకు సమస్యలు ఉన్నాయని తెలిసే వచ్చాను.. కానీ నేనే సమస్యగా మారాను.. అందుకే వెళ్లిపోతున్నాను.. నన్ను వెతకొద్దు" అంటూ రాసి పెట్టి వెళ్లిపోతుంది. ఆ తర్వాత వసు అనుపమకు ఫోన్ చేయమని చెప్పగా.. కలవట్లేదనని అంటాడు. స్విచ్ఛాఫ్ వస్తుందని చెబుతాడు. ఇంత మొండితనం ఏంటని మహేంద్ర అనగా.. మీరు అన్న మాటలకు హర్ట్ అయి వెళ్లిపోయినట్లున్నారని వసు అంటుంది.

ఇక ఆ తర్వాత వసు, మహేంద్రలు కలిసి మను వద్దకు వెళ్తారు. అనుపమ కనిపించట్లేదని, ఎక్కడికి వెళ్లిపోయిందో అంటూ చెబుతారు. ఆమె రాసిన ఉత్తరం చూపిస్తారు. అప్పుడే అనుపమ పెద్దమ్మ వచ్చి మళ్లీ వెళ్లిపోయిందా అని అంటుంది. అవునని మను చెప్పగా.. సమస్య రాగానే ఒంటరిగా ఉండిపోయిందని.. అందుకే ప్రేమను పొందలేకపోయింది, అందుకే ప్రేమను పంచలేకపోయిందని అంటుంది. తనిప్పుడు ఎక్కడికి వెళ్లిందని అనగా... నాకు తెలీదని అంటుంది. అలాగే తన కోపం చూపించడానికి నువ్వు ఉన్నావని.... తను ఎక్కడికి వెళ్లిందో నీకు బాగా తెలుసు, నన్ను వదులుకున్నా.. నీకు తను టచ్ లోనే ఉంటుందని అంటాడు.
అప్పుడే వసు తనకు ఆరోగ్యం బాగాలేదని, తను కనీసం మెడిసిన్స్ కూడా తీసుకోకుండా వెళ్లిందని అంటారు. అంతలోనే మను వచ్చి ఒట్టు వేయించుకోగా.. అనుపమ పెద్దమ్మ అసలు విషయం చెప్పేస్తుంది. అనుపమ ఎక్కడకు వెళ్తుందో వివరిస్తుంది. వియం తెలుసుకున్న వసు, మహేంద్రలు ఆమె వద్దకు బయలు దేరుతుండగా.. మను కూడా తానొస్తానంటూ వెంట వచ్చేస్తాడు. అప్పుడే అనుపమను చూపిస్తారు. ఆమె వస్తున్న టాక్సీ అడ్డుగా దేవయాని ఉంటుంది. అప్పుడే ఆపగా.. వచ్చి మాట్లాడతుంటుంది. ఇంతటితో ఈరోజుటి సీరియల్ అయిపోతుంది.


Click it and Unblock the Notifications











