Guppedantha Manasu April 25th: రాజీవ్, మనుల గొడవ.. ఎవరినెవరు కాల్చారంటే, దత్తత జరిగేనా?
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో మహేంద్రను మను కాల్చేసినట్లు కళ కన్న అనుపమ ఉలిక్కిపడుతుంది. ఆమె అరుపు విన్న వసుధార వెంటనే ఆమ వద్దకు వెళ్లగా అసలు విషయం చెబుతుంది. మనుకు అసలు విషయం తెలియనివ్వొద్దని, తెలిస్తే మహేంద్రను చంపేస్తాడని అంటుంది. కళలో జరిగిందని, వాస్తవంలో కూడా అదే జరుగుతుందని అనుకుంటే ఎలా అని వసు అంటుంది. చెప్పను కానీ ఆలోపే మీరో పని చేయాలని అంటుంది. అది చెప్పకముందే మనును చూపిస్తారు. మను ఆలోచిస్తూ కూర్చోగా ఎవరో ఫన్ చేసి మీ నాన్న గురించి తెలుసు నేను చెప్పిన ప్లేస్ కు రావాలని సూచిస్తాడు. శైలేంద్ర నువ్వు నాతో ఆటలు ఆడకు అంటూ మను అనగా.. అతడెవరో నాకు తెలీదు మీరు వెంటనే వస్తే మీకు నిజం చెబుతానంటూ చెబుతాడు.
ఆ తర్వాత వెంటనే మను అక్కడకు వస్తాడు. అయితే అక్కడికి రాజీవ్ మహేంద్ర మాస్క్ వేసుకుని వస్తాడు. ఈయనే నీ తండ్రి అని, ఎలాగూ దత్తత తీసుకోబోతున్నాడు కదా తండ్రి అయిపోతాడంటూ చెప్పుకొస్తాడు. నాకు తెలుసురా ఇలా ఫోన్ చేసింది మీరేనని అంటూ మను అంటాడు. ఆ తర్వాత రాజీవ్ వసు గురించి, ఆమెపై తనకు ఉన్న ప్రేమ గురించి వివరిస్తాడు. అలాంటి వసును నాకు దక్కకుండా చేస్తున్నావంటూ మనుపై ఫైర్ అవుతాడు. చీచీ ఏం బతుకురా నీది... బురదలో పందీ బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావంటూ మను రివర్స్ మాట్లాడతాడు. నీలాంటి వరస్ట్ క్యాండిడేట్ ను నేనిప్పడి వరకు చూడలేదని.. మళ్లీ ఫోన్ చేస్తే బాగుండదని అంటాడు.

కానీ అంతలోపే రాజీవ్ గన్ తీసి నిన్ను చంపాలనే ఇక్కడకు రప్పించానంటూ గన్ తీసి గురి పెడతాడు. ఈక్రమంలోనే మను రాజీవ్ ను పడేసి తన జేబులోంచి గన్ తీస్తాడు. దాన్ని రాజీవ్ పై ఎక్కు పెడుతాడు. కాల్చరా చూస్తానంటూ ఫైర్ అవుతాడు. నేను నీకంటే పెద్ద రాక్షసుడిని నన్ను నిద్రలేపావు అంటూ మరింత కోప్పడతాడు. ఆ తర్వాత కాల్చేస్తాడు. ఎవరిని కాల్చాడనేది మాత్రం చూపించరు. ఆ తర్వాత వసు, అనుపమలు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ఏం జరిగిందో చెప్పండి అంటూ వసు అడగ్గా.. అనుపమ చెప్పనంటుంది. లేదు కచ్చితంగా చెప్పాల్సిందే అనగా.. దత్తత కార్యక్రమం అయిపోయాకా.. నీకు అన్ని విషయాలు చెబుతానంటుంది అనుపమ.
వసు ఫోన్ నుంచి మనుకు ఫోన్ చేస్తే అస్సలే లిప్ట్ చేయడు. ఆ తర్వాత అనుపమ ఫోన్ నుంచి చేస్తుంది. లేపగానే.. మీ తండ్రి గురించి రేపు తెలుస్తుందని అంటుంది. దత్తత కార్యక్రమం కాగానే మీ తండ్రి ఎవరో తేలిపోతుందని అనగా.. మను మాత్రం అది తెలిసే అవకాశమే లేదని అంటాడు. తనలోని బాధను మరోసారి చెబుతాడు. వసుధార మాత్రం రేపు మీరు దత్తత కార్యక్రమానికి రావాలని.. అది జరిగితే అన్ని విషయాలు తేలిపోతాయని అందరికీ మంచి జరుగుతుందని అంటుంది. కానీ అతడు మాత్రం నేను రానంటూ మొండికేస్తాడు. ఆ తర్వాత ఫోన్ పెట్టేయగా.. ఫణీంద్రను చూపిస్తారు. ఆయన దేవయాని, శైలేంద్రలను పిలుస్తూ కిందకు వస్తాడు. దేవయాని, శైలేంద్రలు రెడీ కాకపోయి ఉండేసరికి ఏంటని అడుగుతాడు. దత్తత కార్యక్రమానికి మనం వెళ్లాల్సిందేనని అంటాడు.

దత్తత వల్ల మనకు కీడు జరుగుతుందని దేవయాని అనగా.. ఏ ఆపు.. పదండి వెళ్దామంటూ ఫణీంద్ర ఫైర్ అవుతాడు. మనం వెళ్లకపోతే మహేంద్ర ఫీల్ అవుతాడని ఫణీంద్ర అంటాడు. అలాగే మీరు వస్తారా రారా అని చివరగా అడుగుతున్నట్లు చెబుతాడు. ఆలోపే శైలేంద్ర లేదు డాడీ నేను వస్తానంటాడు. బాబాయి దత్తత తీసుకోబోతుంటే మనం వెళ్లకపోతే ఎలా అని అంటాడు. మీరెళ్లండి అమ్మ, నేను వస్తామని అంటాడు. భార్య అడిగినా అదే చెబుతా నువ్వెళ్లు మేమొస్తామంటాడు.


Click it and Unblock the Notifications











