Guppedantha Manasu April 5th: మరోసారి కొడుకు కాలర్ పట్టుకున్న అనుపమ.. ఏమైనా సమస్య అక్కడకే!
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈ రోజుటి ఎపిసోడ్ లో ఇంట్లోంచి బయటకు వచ్చేసిన అనుపమ ఎక్కడికో వెళ్లిపోతుంది. ఈక్రమంలోనే ఆమెను ఫాలో అవుతూ దేవయాని అడ్డుగా వస్తుంది. ఎక్కడికి పారిపోతున్నావు.. పైకా అంటూ అడుగుతుంది. ఎందుకు పారిపోతున్నావు, మను తండ్రి ఎవరు అంటూ గుచ్చిగుచ్చి అడుగుతుంది. నిజంగానే మను నీ కన్నబిడ్డేనా, పెంచుకున్న బిడ్డా అంటూ ప్రశ్నిస్తుంది. నువ్వు ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకే పారిపోతున్నావా అంటూ ఫైర్ అవుతుంది. అయినా జగతిలా నీది మంచి క్యారెక్టర్ అనుకున్నా.. కానీ నువ్విలా చేయడం ఏంటి అనుపమ అంటూ ఒకటే మాట్లాడుతుంది. అంతలోనే అక్కడకు మహేంద్ర వస్తాడు.
వదినగారు అంటూ గట్టిగా ఫైర్ అవుతాడు. మీరు ఇంకొక్క మాట జారితే ఊరుకోనంటూ చెబుతాడు. మీరు కాబట్టే అరిచి చెప్పాను.. అదే స్థానంలో వేరే ఎవరైనా ఉంటే చంపేసేవాడినంటూ ఫైర్ అవుతాడు. మీరెందుకు ఈ విషయంలో కల్గజేసుకుంటున్నారు అనగా.. సాటి మనిషిగా సాయం చేసేందుకు వచ్చానంటూ వివరిస్తుంది. మనుకు సాయం చేసేందుకే ఇక్కడకు వచ్చానని.. తన తండ్రి ఎరో తెలుసుకుని సమస్య తీర్చాలని వచ్చానంటూ చెప్పుకొస్తుంది. అప్పుడే మను నా గురించి మీకు అనవసరం, మీరు నాకేం సాయం చేయాల్సిన అవసరం లేదంటూ చెబుతాడు. ఆ తర్వాత వసు కూడా మాట్లాడుతూ దేవయానిని బెదిరిస్తుంది.

మీరు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా వెళ్తే బాగుంటుందని అనగా నేను వెళ్లనంటూ చెబుతుంది. అయితే ఫణీంద్ర మామయ్యకు ఫోన్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని చెబుతానంటుంది. దీంతో దేవయాని వెళ్లిపోతుంది. ఆ తర్వాత మహేంద్ర ఏంటి.. అనుపమ ఇలా లెటర్ రాసి పెట్టి వెళ్లిపోవడం అంటూ అడుగుతాడు. గాయం తగ్గకముందే ఇలా తిరిగితే.. అది మళ్లీ తిరగబెడుతుందని అంటాడు. మీరు సమస్యల్లో ఉన్నారని మీ దగ్గరకు వచ్చాను.. కానీ మీ సమస్యలకు నేనే కారణం అవుతున్నానని తెలిసి వెళ్లిపోతున్నావా అనగా.. అవునంటుంది. అయినా మా సమస్యలకు కారణం నువ్వేనని నేను చెప్పానా అనగానే.. అనపమ నాకే అర్థం అవుతుందంటూ వివరిస్తుంది.
ఆ తర్వాత తప్పు చేసిన వాళ్లు మాత్రమే పారిపోవాలి, కానీ నువ్వు ఇప్పుడు వెళ్లిపోతే నువ్వే తప్పు చేశావని అనుకుంటారు. ఇలా వెళ్లకూడదు అంటూ మహేంద్ర వివరిస్తాడు. వసు ఇంటికి రమ్మంటూ కోరుతుంది. కానీ అనుపమ మాత్రం నేను వెళ్తానంటుంది. సిట్యువేషన్ అర్థం చేసుకో అనుపమ అంటూ మహేంద్ర అంటాడు. అలాగే మను నువ్వే మీ అమ్మను ఉండమను.. ఆ హక్కు నీకే ఉందంటూ వివరిస్తాడు. కానీ మను మాత్రం నాకేమీ హక్కు లేదు సార్.. సమస్యలు తప్ప అంటూ చెబుతాడు. ఆ తర్వాత మహేంద్ర.. నువ్వెళ్తే ఆ ఒక్క సమస్యతో పాటు మరో వంద సమస్యలు వస్తాయని అంటాడు. తనను ఇంకా బాధ పెట్టకు, అవమాన పరచకు అంటూ చెప్పుకొస్తాడు.

ఆ తర్వాత అనుపమ వెళ్లి.. మను కాలర్ పట్టుకుంటుంది. ఎందుకొచ్చావంటూ నిలదీస్తుంది. దీంతో మహేంద్ర చప్పట్లు కొడుతూ.. సూపర్ అనుపమ అంటాడు. చాలా బాగుందంటూ వెటకారంగా మాట్లాడతాడు. అయినా కొడుకును తల్లి వద్దకు రావొద్దని చెప్పడానికి నువ్వెవరు అంటాడు. నీ వల్లే తనకు ఇన్ని సమస్యలు వచ్చాయని చెబుతాడు. అంతలోనే వసుధార.. మీరు ఎక్కడికి వెళ్లినా మరిన్ని సమస్యలు ఎక్కువ అవుతాయని.. వెళ్లొద్దని అంటుంది. మీరు సమాధానం చెప్పకపోవడం మీ తప్పు కాదని... కానీ మీరు ఇప్పుడు వెళ్తే మరిన్ని సమస్యలు ఎదురవుతాయంటూ.. ఇంటికెళ్దామంటుంది. అలా అంతా కలిసి ఇంటకి బయలు దేరుతారు.
ఆ తర్వాత శైలేంద్ర.. దేవయానిని చూసి ఎందుకిలా ఉన్నావనగా.. ప్లాన్ ఫెయిల్ అయిందని అంటుంది. వారు మాట్లాడుకుంటూ ఉండగా.. ధరణి వస్తుంది. డీఆర్ఎస్ యే బాగుంటుందని అంటుంది. అదేంటని దేవయాని అడగ్గా.. శైలేంద్ర బిక్కమొహం వేస్తాడు. ప్లాన్ లో చేసేది ఏం లేదు కానీ.. ఈ పిచ్చి టైటిల్ కోసం ఇంత అవసరమా అంటూ అనగా.. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ రోజు నా ప్రతాపం చూపిస్తానంటూ వివరిస్తాడు.


Click it and Unblock the Notifications











