Guppedantha Manasu April 23rd: మను కన్నతండ్రి అతడేనట.. షాక్‌లో వసు, దత్తత జరిగేనా!

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రోజురోజుకూ అద్భుతంగా సాగుతోంది. ముఖ్యంగా ఈరోజుటి ఎపిసోడ్ లో వసుధార, అనుపమలు మాట్లాడుకుంటూ కనిపిస్తారు. ముఖ్యంగా వసు మీరు చాలా మొండిగా ప్రవర్తిస్తున్నారు మేడమ్ అంటూనే, మను తండ్రి చనిపోయి ఉంటారా అంటుంది. అందుకు అనుపమ అలా మాట్లాడొద్దు అనగా.. వసు మను తండ్రి చనిపోయారని అంటుంది. పదే పదే అనగా.. అనుపమ ఫైర్ అవుతుంది. కానీ వసుధార మాత్రం అస్సలే ఆపదు. అంతలోనే అనుపమ పెద్దమ్మ అక్కడకు వస్తుంది. మను తండ్రి బతికే ఉన్నాడని చెబుతుంది. ఇదంతా చూసిన వాళ్లు షాక్ అవుతారు. కానీ ఆమె మాత్రం మను తండ్రి చనిపోలేదని, ఇంకా బతికే ఉన్నారని చెప్పుకొచ్చింది. అప్పుడే అనుపమ ఆగమని చెప్పగా... ఆగనంటుంది.

మను తండ్రి ఎవరో మీరు ఎందుకు చెప్పట్లేదు అనగా.. ఆ కారణం ఏంటో చెప్పమని వసు అంటుంది. మను తండ్రి స్థానంలోకి బయటి వారెవరో తండ్రిగా వస్తున్నారని ఇప్పుడైనా మీరు చెప్పాలని అంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పకపోతే ఏం అనుకోవాలని అంటుంది. కానీ అప్పుడే అనుపమ పెద్దమ్మ అసలు విషయం చెప్పేస్తుంది. మహేంద్రే మను తండ్రి అని వివరిస్తుంది. నిజమైన తండ్రే అతడి స్థానంలోకి వస్తున్నాడని చెబుతుంది. మను మహేంద్ర రక్తం పంచుకుని పుట్టిన బిడ్డ అని కావాలంటే నీవు డీఎన్ఏ టెస్ట్ కూడా చేయింకో అంటుంది. అలాగే అనుపమ ఎలాంటి తప్పు చేయలేదని.. చెప్పగా.. వసు నిజంగానే ఇది నిజమా అంటుంది. అవునని అనుపమ పెద్దమ్మ చెప్పగా.. అప్పుడు మహేంద్ర వస్తాడు. ఏంటా నిజం అంటూ అడుగుతాడు.

Anupama Peddamma said that Manu s father was Mahendra on Guppedantha Manasu April 23rd 2024 Episode 1057

ఏంటో నిజం అని మాట్లాడుకుంటుున్నారు కదా.. ఏంటని అడుగుతాడు. మను తండ్రి ఎవరో కాదంట మామయ్యా.. మీరేనట అని వసు అనగా.. అతను షాక్ అవుతాడు. నేను మను తండ్రినని వాళ్లు చెప్పడం ఏంటమ్మా.. కాలేజీలో నేనే చెప్పాను కదా అంటాడు. అది నిజం చేయాలనే కదా ఇదంతా నిజం చేయబోతున్నానంటాడు. అప్పుడే అనుపమ వద్దని వసుకు సైగ చేస్తుంది. ఎలా అయితే ఏంటి దత్తతకు ఒప్పుకున్నట్లేగా.. రేపు రండి అని చెప్పి మహేంద్ర వెళ్లిపోతాడు. ఆ తర్వాత శైలేంద్ర, ఫణీంద్ర, దేవయాని, ధరణిలను చూపిస్తారు. అసలు మహేంద్రకు బుద్ధి లేదని, మనును దత్తత తీసుకోవాల్సిన అవసరం ఏంటని అడుగుతుంది.

ఎప్పుడూ తప్పుగా మాట్లాడడమేనా.. అందులో ఏదైనా పాజిటివ్ మాటర్ కూడా ఉందేమో అని ఫణీంద్ర అంటాడు. నువ్వు ఇంకోసారి ఇలా మాట్లాడకు అని ఫణీంద్ర వివరిస్తాడు. మహేంద్ర చేసిన దాంట్లో తప్పు లేదని నాకనిపిస్తోందని.. మీరు కూడా ఈ విషయం అర్థం చేసుకుంటే బాగుంటుందని అంటుంది. కన్నబిడ్డను వదిలేసి మనును దత్తత తీసుకోవడం ఏంటని అంటుంది. అప్పుడే ఫణీంద్ర అసలు రిషి గురించి మర్చిపోయాడని నువ్వెలా అంటావని అనగానే.. దేవయాని రిషి వస్తే ఇదంతా చూసి ఎంత బాధ పడతాడో కదా అంటుంది. దత్తత ఆపమని చెప్పండంటూ వివరిస్తుంది. అప్పుడే ధరణి అత్తయ్య రానంటుందిగా మనం వెళ్దామా అంటుంది.

Anupama Peddamma said that Manu s father was Mahendra on Guppedantha Manasu April 23rd 2024 Episode 1057

ఏంటి వెళ్లేది అంటూ దేవయాని అనగా.. ఫణీంద్ర గట్టిగా వెళ్లాల్సిందే అని చెబుతాడు. ఆ తర్వాత దేవయాని కోడలుపై ఫైర్ అవుతుంది. అప్పుడే శైలేంద్ర మహేంద్రకు ఫోన్ చేస్తాడు. మీతో పని ఉందని.. నేరుగా వచ్చి మాట్లాడాలని చెబుతాడు. నేను చెప్పే విషయం మీకు మేలు చేసే విషయం అని నేను చెప్పేది వినాలని అంటాడు. అయితే నువ్వు ఏదో కీడు చేయబోతున్నావని అనగా.. లేదు అది మీకు మంచి చేస్తుందని అంటుంది. మహేంద్ర కూడా మాట్లాడేందుకు ఓకే చెబుతాడు. ఆ తర్వాత వసు అనుపమ పెద్దమ్మను అడిగి అసలు విషయం తెలుసుకోవాలని చూస్తుంటుంది. అప్పుడే ఏంజెల్ వసుకు ఫోన్ చేయగా.. నిజంగానే మహేంద్ర సార్ మనును దత్తత తీసుకోబోతున్నారా అని అడుగుతుంది. అసలు నాకేం అర్థం కావట్లేదు.. ఈ దత్తత ఏంటని చెబుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X