బిగ్ బాస్‌కు కొత్త హోస్ట్: నాగార్జున స్థానంలో టాప్ హీరోయిన్.. వచ్చే వారమే గ్రాండ్ ఎంట్రీ.!

By Manoj

తెలుగులో ఇప్పటి వరకు రాని సరికొత్త రూపకల్పనలతో ప్రసారం అవుతూ టాప్ షోగా నిలుస్తోంది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. బుల్లితెరపై ఈ షో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. మొదటి సీజన్ నుంచే మరే షోకూ సాధ్యం కాని ఎన్నో రికార్డులకు క్రియేట్ చేస్తూ విజయవంతంగా ప్రసారం అవుతోంది. ఇక, అక్కినేని నాగార్జున సారథ్యంలో ఇటీవలే నాలుగో సీజన్‌ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ప్రేక్షకుల స్పందనను అందుకుంటోన్న ఈ షోలో భారీ మార్పు జరగబోతుంది. దీనికి హోస్ట్ చేస్తున్న నాగ్ స్థానంలో ఓ హీరోయిన్ ఎంట్రీ ఇస్తుంది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి.!

Recommended Video

Bigg Boss Telugu 4 : Bigg Boss హోస్ట్ గా టాప్ హీరోయిన్.. గ్రాండ్ ఎంట్రీ ఆ రోజే!
భారీ రెస్పాన్స్..... బుల్లితెరపై కొత్త చరిత్ర

భారీ రెస్పాన్స్..... బుల్లితెరపై కొత్త చరిత్ర


ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ సీజన్ 4 సెప్టెంబర్ ఆరున ప్రారంభమైంది. అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేస్తున్న ఈ షో ప్రీమియర్ ఎపిసోడ్‌కు మంచి స్పందన వచ్చింది. ఫలితంగా భారతదేశంలోనే బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్ సాధించిన తొలి షోగా ఇది నిలిచింది. అంతేకాదు, దాదాపు ఐదు కోట్లకు పైగానే ఓట్లు నమోదు చేస్తూ సరికొత్త చరిత్రను సృష్టిస్తోంది.

మొదటి స్టెప్ ఫెయిల్..... మరిన్ని ప్లాన్లు

మొదటి స్టెప్ ఫెయిల్..... మరిన్ని ప్లాన్లు

ఈ సీజన్ ప్రారంభానికి ముందే బిగ్ బాస్ యూనిట్ ఎన్నో రకాలు ప్రచారాలు చేసింది. గత సీజన్లతో పోలిస్తే ఇందులో రెట్టించిన వినోదాన్ని పంచబోతున్నామని ప్రకటించింది. అందుకు అనుగుణంగానే సరికొత్త వ్యూహాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ, అవేమీ సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలో మరిన్ని ప్లాన్లు రెడీ చేస్తూ ముందుకెళ్తోందీ రియాలిటీ షో యూనిట్.

ఇద్దరి ఎంట్రీ... మరో భామ కూడా రెడీగా

ఇద్దరి ఎంట్రీ... మరో భామ కూడా రెడీగా

ఇప్పటికే బిగ్ బాస్ హౌస్‌లోకి ఇద్దరు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చారు. అందులో ఒకరు కమెడియన్ కుమార్ సాయి కాగా, మరొకరు జబర్ధస్త్ ఫేం ముక్కు అవినాష్. వీళ్లిద్దరితో పాటు రేపో మాపో స్వాతీ దీక్షిత్ అనే హీరోయిన్ కూడా లోపలికి వెళ్లబోతుందని జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఇప్పటికే ఈ సీజన్ నుంచి ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేషన్ ద్వారా వెళ్లిపోయారు.

బిగ్ బాస్ సీజన్ 4కు కొత్త హోస్ట్ ఎంట్రీ

బిగ్ బాస్ సీజన్ 4కు కొత్త హోస్ట్ ఎంట్రీ

వారానికో విధమైన స్పందనను అందుకుంటూ నడుస్తోంది బిగ్ బాస్ సీజన్ 4. సరికొత్త టాస్కులు, లవ్ ట్రాకులు, వైల్డ్ కార్డ్ ఎంట్రీలు, కంటెస్టెంట్ల మధ్య గొడవలు, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్‌లు... ఇలా కొత్త కొత్త ప్లాన్లతో షోపై ఆసక్తిని పెంచే ప్రయత్నం చేస్తోంది యూనిట్. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్‌ షోకు కొత్త హోస్ట్‌ను తీసుకురాబోతుందని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

నాగార్జున స్థానంలో టాప్ హీరోయిన్ రాక

నాగార్జున స్థానంలో టాప్ హీరోయిన్ రాక


పదేళ్లుగా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుని స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోన్న అనుష్క శెట్టి.. బిగ్ బాస్ సీజన్ 4 హోస్ట్‌గా ఎంట్రీ ఇవ్వబోతుందట. ఇప్పటికే హోస్ట్‌గా ఉన్న నాగార్జున స్థానాన్ని ఆమె భర్తీ చేయబోతుందట. ఈ శనివారమో.. ఆదివారమో స్వీటీ షోలోకి గ్రాండ్‌గా ఎంటర్ అవబోతున్నట్లు ఓ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

హోస్ట్ మారడం వెనుక అసలు కథ ఇదే

హోస్ట్ మారడం వెనుక అసలు కథ ఇదే

నాగార్జున స్థానంలో అనుష్క రావడం వెనుక అసలు కథ ఏమిటంటే.. స్వీటీ ‘నిశ్శబ్ధం' అనే సినిమాలో నటించింది. అది అక్టోబర్ 2న అమెజాన్‌లో విడుదల కాబోతుంది. దీని ప్రమోషన్‌లో భాగంగానే ఆమె బిగ్ బాస్‌లోకి వస్తుందని సమాచారం. ఈ ఎపిసోడ్‌ను నాగ్ కాకుండా అనుష్క ఓపెన్ చేసి సర్‌ప్రైజ్ చేయబోతుందని అంటున్నారు. దీంతో బిగ్ బాస్‌పై ఆసక్తి పెరిగిపోతోంది.

అప్పుడు ఆ హీరోయిన్ సర్‌ప్రైజ్ చేసింది

అప్పుడు ఆ హీరోయిన్ సర్‌ప్రైజ్ చేసింది


గత సీజన్‌లో హోస్టింగ్ చేసిన అక్కినేని నాగార్జున... తన పుట్టినరోజు వేడుకల కోసం కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లాడు. ఆ సమయంలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ బిగ్ బాస్ హోస్ట్‌గా వ్యవహరించారు. చేసింది రెండు ఎపిసోడ్సే అయినా ఆమె ఎంతగానో ఆకట్టుకున్నారు. అంతేకాదు, ఆమె వచ్చిన ఈ ఎపిసోడ్స్‌కు భారీ స్థాయిలో రేటింగ్ కూడా వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X