Punch Prasad: జబర్దస్త్ కమెడియన్‌కు సీరియస్.. అండగా సీఎం జగన్.. అసలు ఏమైందంటే?
జబర్దస్త్ నుంచి ఎంతోమంది కమెడియన్స్ మంచి జీవితాన్ని అందుకున్నారు. ఎక్కడి నుంచో వచ్చి తమ టాలెంట్ తో బుల్లితెరపై సెటిల్ అయిపోయారు. ఒక్కొక్కరు వివిధ రకాలుగా తమైదన శైలీలో నవ్విస్తూ సత్తా చాటుతున్నారు.
అందులో నాన్ స్టాప్ పంచ్ లకు పెట్టింది పేరుగా ప్రసాద్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే పంచ్ ప్రసాద్ అని పేరు తెచ్చుకున్నాడు. జబర్దస్త్ తోపాటు వివిధ టీవీ షోలలో, ప్రోగ్రామ్స్ లలో తన పంచులతో అలరించే పంచ్ ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందని తెలిసిందే. తాజాగా ఆయనకు అండగా ఏపీ సర్కారు నిలవడం చర్చనీయాంశమైంది.

దాదాపు 80 శాతం: జబర్దస్త్ షో చూసేవారికి పంచ్ ప్రసాద్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. వెంకీ మంకీస్ టీమ్ లో తనదైన శైలీలో పంచ్ డైలాగ్ లు వేసి నవ్విస్తుంటాడు పంచ్ ప్రసాద్. అప్పట్లో వరుసగా కనిపించిన ప్రసాద్ తర్వాత కొన్ని రోజులపాటు స్క్రీన్ పై కనిపించలేదు. అందుకు కారణం ఆయన రెండు కిడ్నీలు దాదాపుగా 80 శాతం పాడైపోయాయి. అతను డయాలిసిస్ చేయించుకుంటున్నాడు.

కోలుకుని మళ్లీ: అప్పుడప్పుడు షోలలో తన సమస్యలపై జోకులు వేస్తూ ప్రేక్షకులను నవ్వించే పంచ్ ప్రసాద్ ను ఇటీవల మరో సమస్య వేధించింది. ప్రస్తుతం పంచ్ ప్రసాద్ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ విషయాన్ని అప్పట్లో నూకరాజు ఓ వీడియోను యూట్యూబ్ వీడియో ద్వారా తెలిసింది. తర్వాత కోలుకుని టీవీ షోలో పాల్గొని మళ్లీ తన పంచులతో ప్రసాద్ నవ్వించాడు.

బ్యాంక్ వివరాలతో పోస్ట్: ఇప్పుడు ప్రసాద్ హెల్త్ కండీషన్ సీరియస్ గా ఉందని జబర్దస్త్ ఇమ్మాన్యూయెల్ పోస్ట్ ద్వారా తెలిసింది. "అన్నకు సీరియస్ గా ఉంది. డాక్టర్లు ఆపరేషన్ చేయాలని చెప్పారు. దానికి చాలా ఖర్చు అవుతుంది. మేం అంతా చాలా ట్రై చేస్తున్నాం. మీరు కూడా హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను" అని ఆ పోస్టులోబ్యాంక్ అకౌంట్ వివరాలు ఇచ్చాడు. ఈ పోస్ట్ ను గెటప్ శ్రీను, కెవ్వు కార్తీక్ సహా పలువురు కమెడియన్స్ షేర్ చేశారు.

ఏపీ సీఎంవో: కుర్చీలో ఆక్సీజన్ మాస్క్ పెట్టుకుని ఉన్న పంచ్ ప్రసాద్ ఫొటో గల ఈ పోస్టుపై తాజాగా ఏపీ సర్కారు స్పందించింది. ప్రసాద్ చికిత్సకు సీఎం సహాయ నిధి నుంచి ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించింది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పెషల్ సెక్రటరీ డాక్టర్ హరికృష్ణ ట్విటర్ వేదికగా ఈ ప్రకటన చేశారు.
ఎల్వోసీ మంజూరు: "మా టీమ్ ప్రసాద్ కుటుంబ సభ్యులతో చర్చించింది. ఎల్వోసీ ప్రక్రియ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. డ్యాక్యుమెంట్స్ ధృవీకరణను పూర్తి చేసిన వెంటనే మూత్రపిండ మార్పిడి కోసం CMRF (సీఎం రిలీఫ్ ఫండ్) కింద ఎల్వోసీ (LOC) మంజూరు చేస్తాం" అని డాక్టర్ హరికృష్ణ వెల్లడించారు. కాగా ప్రసాద్ కు గతేడాది నవంబర్ లో తొలిసారిగా సీరియస్ అయింది. అప్పుడే నడవలేని స్థితికి చేరుకున్నాడు.


Click it and Unblock the Notifications











