పవన్ జనసేన వైపు హైపర్ ఆది.. రోజా వైపు ఆ జబర్దస్త్ కమెడియన్ ఫిక్స్ అయినట్లేనా?
టెలివిజన్ రంగంలో కూడా ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా రియాలిటీ షోలలో కనిపించే సెలబ్రిటీలు కూడా ఊహించని స్థాయిలో రెస్పాన్స్ అందుకుంటున్నారు. ఇంకా జబర్దస్త్ కమెడియన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అందులో ఎక్కువగా పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది ఒకరు. ఇటీవల అతను జనసేన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిన విధానం హైలెట్ గా నిలిచింది. అయితే రోజా అతనికి కౌంటర్ గా మరొక జబర్దస్త్ కమెడియన్ ను రంగంలోకి దింపుతున్నట్లుగా ఇదివరకే ఒక టాక్ వినిపించింది. ఇక ఆ కమెడియన్ ఎవరు అనే విషయంలో కూడా ఒక పేరు అయితే వైరల్ గా మారింది. ఆ వివరాలలోకి వెళితే..

టీవీ షోలతో బిజీగా..
జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు అందుకున్న హైపర్ ఆది ఆ తర్వాత సినిమాల్లో కూడా ఎంట్రీ ఇచ్చాడు. అతను ప్రస్తుతం చాలా బిజీగా కొనసాగుతున్నాడు. ఎక్కువగా అయితే రియాల్టీ షోలలో కనిపించడం లేదు. కేవలం ఢీ షోలో మాత్రమే తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ అందించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక మరోవైపు చిన్న సినిమాలో పెద్ద సినిమాకు అని తేడా లేకుండా ప్రతిరోజు బిజీగానే కనిపిస్తున్నాడు.

ఆ గాసిప్స్ ఎన్ని వచ్చినా..
అయితే హైపర్ ఆది జబర్దస్త్ కు గ్యాప్ ఇచ్చి చాలా కాలమయ్యింది. కొన్ని విభేదాలు వలన ఈ కామెడీ షో కు దూరమైనట్లు ఆమధ్య కథనాలు కూడా వచ్చాయి. ముఖ్యంగా రోజా హైపర్ ఆది మధ్యలో కూడా విబేధాలు వచ్చాయి అని సోషల్ మీడియాలో ఒక టాక్ అయితే వినిపించింది. అయితే ఆ తరహా గాసిప్స్ ఎన్ని వస్తున్నా కూడా ఎప్పుడు హైపర్ ఆది వాటిపై క్లారిటీ ఇవ్వలేదు.

పవన్ కళ్యాణ్ కు మద్దతుగా..
ఇక హైపర్ ఆది మెల్లగా రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నాడు అనే విధంగా ఇప్పుడు ఒక చర్చ నడుస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఎంతగానో అభిమానిస్తూ వస్తున్న హైపర్ ఆది అతను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మరింత సపోర్ట్ చేస్తూ వస్తున్నాడు. ఎలాంటి సందర్భాల్లో అయినా సరే తాను పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ఉంటాను అని చాలా ఓపెన్ గా ప్రకటన కూడా ఇచ్చాడు.

వైసీపీపై ఆది కౌంటర్లు
ముఖ్యంగా ఇటీవల హైపర్ ఆది జనసేనకు సంబంధించిన ఒక మీటింగ్లో మాట్లాడిన విధానం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. అందులో ప్రత్యర్థి రాజకీయ నాయకులకు పై కూడా హైపర్ ఆది చురకలు అంటించే కౌంటర్లు ఇచ్చాడు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మంత్రులు పవన్ కళ్యాణ్ ను కావాలని టార్గెట్ చేస్తున్నారు అని వారికి శాఖల గురించి పెద్దగా ఏమీ తెలియదు అని కామెంట్ చేయడం రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.

రోజా ఘాటైన సమాధానం
అయితే హైపర్ ఆది ఆ విధంగా కామెంట్స్ చేయడంతో వైసిపి మంత్రి రోజా కూడా ఘాటుగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. జబర్దస్త్ లో ఉన్నప్పుడు హైపర్ ఆదిని ఎంతగానో మెచ్చుకున్న రోజా ఇప్పుడు మాత్రం పవన్ కళ్యాణ్ కోసం అతను అలా మాట్లాడడంతో ఆమె ఊహించని విధంగా కౌంటర్ ఇచ్చింది. అతనికి డైపర్ వేయాల్సిన సమయం వచ్చింది అని అనవసరంగా మెగా హీరోలకు భయపడే అతను అలా మాట్లాడాడు అని ఆమె సమాధానం ఇచ్చారు.

రోజా వైపు ఆ జబర్దస్త్ కమెడియన్?
అయితే హైపర్ ఆదికి పోటీగా రోజా కొంతమంది జబర్దస్త్ కమెడియన్స్ ను వైసిపి పార్టీలోకి తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇదివరకే ఒక టాక్ వినిపించింది. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న మరొక టాక్ ప్రకారం ఆమెకు ఇంతకాలం ఫ్యాన్ గా ఉన్న సుడిగాలి సుదీర్ ని వైసిపి పార్టీలోకి ఆహ్వానించబోతున్నట్లు తెలుస్తోంది. గతంలో సుధీర్ మూడు పెళ్లిళ్లు అంటూ ఒక స్కిట్ కూడా చేశాడు దానికి రోజా తీవ్రస్థాయిలో ప్రశంసలు కురిపించింది. ఇక సుదీర్ ను వైసిపి పార్టీ తరఫున రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లుగా ఒక టాక్ అయితే వినిపిస్తుంది. మరి ఇది ఇంతవరకు నిజం అవుతుందో చూడాలి.


Click it and Unblock the Notifications











