Brahmamudi August 24th: కావ్యను ఇంట్లో ఉండనివ్వొద్దని అపర్ణ నిర్ణయం.. భార్యతో కలిసి ఇంటికి రాజ్

కావ్యను ఇంట్లోంచి గెంటేసిన కావ్యను... సుభాష్ ఇంట్లోకి తీసుకువస్తాడు. ఇక ఇంట్లో వాళ్లని ప్రశ్నిస్తాడు. రాజ్ అండ్ అపర్ణలకు మీరెవరు నా కోడలిని ఇంట్లోంచి పంపించాడనికి అని కడిగిపారేస్తాడు. ఇక ఆ తర్వాత కావ్య ఇంట్లోకి వచ్చాక రాజ్ ఆమెను యాక్సెప్ట్ చేశాడా... అపర్ణ కావ్యను ఏమంటుంది... కావ్య తన నాన్నకు ఇచ్చిన మాట ప్రకారం మళ్లీ ఇంటికి వెళ్లి పని చేస్తుందా.. కావ్య ఎలాంటి నిర్ణయం తీసుకుంది అనే వివరాలను ఈరోజు ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

బ్రహ్మముడి సీరియల్ లో అపర్ణ గది వద్దకు కావ్య రాగా.. ఆమెను లోపలికి రానివ్వదు. గుమ్మం ముందే నిలబెట్టి కావ్యను నానా మాటలు అంటుంది. ఎప్పటికీ నిన్ను క్షమించలేను... నిన్న నా ఇంట్లో సభ్యురాలిగా చేర్చుకోను.. నా కొడుక్కి భార్యవి ఎప్పటికీ కాలేవు అని చెబుతుంది. కావ్య.. సహనంగా వింటూ కామ్ ఉండిపోతుంది. ఈ ఇంట్లో నన్ను కోడలిగా ఒప్పుకోకపోయినా.. మిమ్మల్ని ఎప్పుడూ నేను అత్తగారిలా గౌరవిస్తానని చెబుతుంది కావ్య. ఈ ఇంటి కోడలిగా నాకు ఉన్న విలువ ఏంటి, నువ్ నన్నే ఎదిరించి మాట్లాడుతావా.. నా ముందు నిలబడే హక్కులేని నువ్వు.. నా ముందే నిల్చుంటావా అని ప్రశ్నల వర్షం కురిపిస్తోంది.

Aparna Shocking Decision about Kavya in August 24th 2023 Episode number 183 in Brahmamudi Telugu Serial

నువ్ గడ్డిపరకలాంటిదానివి అని అపర్ణ కావ్యను అంటుంది. అత్తయ్య.. గడ్డి పరక కూడా ఒక్కసారి నాటుకుందంటే.. పెను తుపాను వచ్చినా.. వరద బిభత్సం సృష్టించినా.. ఆ గడ్డిపరక అటు ఇటు ఊగుతుందే తప్పా.. అది నాటుకున్న స్థానంలోనే నిల్చుంటుందని కావ్య చెబుతుంది. ఇల్లు గడ్డిపరకను గుర్తించదు అని, నేను ఎప్పటికీ నిన్ను కోడలిగా గుర్తించను అని క్లారిటీ ఇస్తుంది. అ తర్వాత కావ్య ఇంట్లోని కృష్ణుడి విగ్రహం దగ్గరకు వెళ్లి... తన బాధను చెప్పుకుంటుంది.

సీన్ కట్ చేస్తే... ఉదయం కాగానే రాజ్ లేస్తాడు. చేతికి ఉన్న కట్టు చూసి.. తీసేస్తాడు. కావ్య.. తన ఇంటికి వెళ్తానని రాజ్ ను అడుగుతుంది. రాజ్ సైలెంట్ గా ఉంటాడు. అప్పుడే రాజ్ కు కాల్ వస్తుంది. ఆఫీసుకు రెడీ అవుతున్నాను అని.. వెళ్లిపోతాడు. హాలులో అందరూ ఉంటారు. బ్యాగు వేసుకుని.. అప్పుడే వస్తుంది కావ్య. నేను అమ్మ వాళ్ల ఇంటికి వెళ్తాను అంటే.. ఎలాంటి తిరుగుబాటు మెుదలవుతుందోనని భయపడుతు వస్తుంది.

Aparna Shocking Decision about Kavya in August 24th 2023 Episode number 183 in Brahmamudi Telugu Serial

వినాయక చవితి దగ్గర పడుతుందని, నేను అయితే సరిగా రంగులు వేయగలుగుతానని, కాంట్రాక్ట్ ఇచ్చారని సీతారామయ్యకు వివరిస్తుంది. ఇప్పుడు మధ్యలో వదిలేస్తే కాంట్రాక్ట్ పోతుంది తాతయ్య అంటుంది. మీరు అనుమతిస్తే.. వెళ్తాను అని చెబుతుంది. అప్పుడే స్వప్న వచ్చి.. ఏంటే నీకు పిచ్చి పట్టిందా.. నీకు రూపాయి ఆదాయం లేకున్నా.. వెళ్తాను అంటావేంటని ప్రశ్నిస్తుంది. నీలా స్వార్థంగా నేను ఉండలేను అక్క అని కావ్య సమాధానమిస్తుంది.

Aparna Shocking Decision about Kavya in August 24th 2023 Episode number 183 in Brahmamudi Telugu Serial

నా వంశానికి పెద్ద నా భర్త అని చెబుతుంది. ఈ ఇంటి వారసుడి భార్యను అర్ధరాత్రి బయటకు పంపారని, అడుగుదామనుకుంటే మాకు అధికారం లేకుండా చేశావని అపర్ణను అంటుంది ఇందిరాదేవి. అది చేసింది రాజ్ కాదా అత్తయ్య అని అపర్ణ అనగా.. రాజ్ ఎవరు నీ కొడుకు కాదా అని ప్రశ్నిస్తుంది ఇందిరాదేవి. వాడు ఆవేశంలో ఉంటే.. నీకు ఆలోచన, మానవత్వం లేదా అని అడుగుతుంది. నా తండ్రి, తాతలు స్వాతంత్య్రం కోసం పోరాడారు అని, ఇప్పుడు ఈ ఇంటి ఆడపిల్లకు స్వాతంత్య్రం లేదని అంటాడు సీతారామయ్య. దీంతో అందరూ షాక్ అవుతారు.

Aparna Shocking Decision about Kavya in August 24th 2023 Episode number 183 in Brahmamudi Telugu Serial

మీ అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను అని, ఒక స్త్రీకి తనకు నచ్చిన పని, తనకు వచ్చిన పని, తన కుటుంబానికి సాయం చేసే పని చేస్తే తప్పేనా అని అడుగుతాడు. దీంతో ఎవరూ నోరు మెదపరు. అంటే కావ్య వెళ్లేందుకు మీ అందరికీ ఇష్టమే కదా అని ప్రశ్నిస్తాడు. ఎవరూ మాట్లాడరు. నువ్ వెళ్లమ్మ కావ్య అని చెబుతాడు. ధైర్యంగా వెళ్లమని ఇందిరాదేవి అంటుంది.

Aparna Shocking Decision about Kavya in August 24th 2023 Episode number 183 in Brahmamudi Telugu Serial

రాజ్ కు శరత్ కాల్ చేస్తాడు. మీరు మిడిల్ క్లాసు వాళ్ల కోసం చేసిన డిజైన్స్ బాగున్నాయని, అందులో మూడు డిజైన్స్ లో కొన్ని మార్పులు చేయాలని అంటాడు శరత్. మీ డిజైనర్ కావ్యకు ఏదైనా డౌట్ వస్తే.. మమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెబుతాడు. దీంతో రాజ్ కు కోపం వస్తుంది. తర్వాత ఎపిసోడ్లో మరోసారి ఇంట్లో పంచాయితీ పెడుతుంది అపర్ణ.

Aparna Shocking Decision about Kavya in August 24th 2023 Episode number 183 in Brahmamudi Telugu Serial

పుట్టింటికి వెళ్లొద్దు అంటే వెళ్లిందని, ఇంటి పరువు తీయెుద్దు అంటే తీస్తుంది అని, అందుకే కావ్యకు శిక్ష వేస్తున్నాను అని, ఈ క్షణం నుంచి ఆ కావ్యతో ఎవరూ మాట్లాడేందుకు వీలు లేదని చెబుతుంది. అప్పుడే కావ్యను తీసుకుని వస్తాడు రాజ్. ఇది చూసి షాక్ అవుతుంది అపర్ణ. రాజ్ చేతిలో కావ్య బ్యాగు ఉంటుంది. ఇక ఏం జరగనుందో ఈరోజు ఎపిసోడ్ లో తేలనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X