Brahmamudi August 25th: షాకింగ్ డెసిషన్ తీసుకున్న అపర్ణ.. కావ్య ఏం చేయనుంది?

బ్రహ్మముడి సీరియల్ లో కావ్య‌తో ఇంట్లో ఎవ‌రూ మాట్లాడ‌వ‌ద్ద‌ని అప‌ర్ణ తీర్పు ఇస్తుంది. ఆమెపై జాలి, ద‌య లాంటివి చూపించ‌వ‌ద్ద‌ని ఇంట్లో వాళ్లందరికీ వార్నింగ్ ఇస్తుంది. ముఖ్యంగా ధాన్యలక్ష్మికి అపర్ణ చెబుతుంది. అయితే కావ్యను ఇంట్లో వాళ్లు దూరం పెట్టారా.. రాజ్ ఏం చేశాడు.. వంటి వివరాలు ఈ ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

కావ్య ఇంట్లో అంద‌రిని ఒప్పించి అవ‌స‌ర‌మైతే ఎదురించి మ‌రి తాను అనుకున్న‌వ‌న్నీ సాధిస్తుండ‌టం త‌ట్టుకోలేక‌పోతుంది రుద్రాణి. త‌న‌కు త‌ల‌నొప్పిగా కావ్య త‌యారు కావ‌డంతో ఏం చేయాలో పాలుపోవ‌డం లేద‌ని కొడుకు రాహుల్‌ తో అంటుంది. నీ వ‌ల్లే కావ్య ఈ ఇంటికి వ‌చ్చింద‌ని త‌ల్లికి నీతులు చెబుతాడు రాహుల్‌. కొడుకుపై ఫైర్ అవుతుంది రుద్రాణి. ఇర‌గ‌దీస్తాను. రాజ్‌ కు షాకిస్తాన‌ని బోర్లా ప‌డ్డ నువ్వు నాకు నీతులు చెబుతున్నావా అంటూ కొడుకుపై సెటైర్స్ వేస్తుంది రుద్రాణి.

Aparna Shocking Decision about Kavya in August 25th 2023 Episode number 184 in Brahmamudi Telugu Serial

ఇక నీ కోసం కోటీశ్వ‌రుల సంబంధం తీసుకొస్తే... నువ్వేమో బికారీదానిని భార్య‌గా ఇంటికి తీసుకొచ్చావ‌ని అంటుంది రుద్రాణి. స్వ‌ప్న‌ను ఎలాగైనా త‌న లైఫ్‌ లో నుంచి పంపించేయ‌మ‌ని త‌ల్లిని బ‌తిమిలాడుతాడు రాహుల్‌. స్వ‌ప్న‌ను ఇంటి నుంచి పంపించాలంటే ముందు కావ్య‌ను ఇంట్లో దోషిగా చేస్తే స‌రిపోతుంద‌ని కొడుకుతో అంటుంది రుద్రాణి.

Aparna Shocking Decision about Kavya in August 25th 2023 Episode number 184 in Brahmamudi Telugu Serial

మరోవైపు కావ్య ద్వారా వ‌చ్చిన మిడిల్ క్లాస్ కాంట్రాక్ట్ లో డౌట్స్ ఉన్నాయ‌ని కంపెనీ వాళ్లు కాల్ చేస్తారు. కావ్య త‌న ద‌గ్గ‌ర ప‌నిమానేయ‌డంతో రాజ్ టెన్ష‌న్ ప‌డ‌తాడు. త‌న ఆఫీస్‌లోని మ‌రో డిజైన‌ర్‌కు ఆ ప‌ని అప్ప‌గిస్తాడు. కావ్య వేసిన డిజైన్స్ లో క‌రెక్ష‌న్స్‌ చేయ‌మ‌ని చెబుతాడు. కానీ ఆ ప‌ని త‌న వ‌ల్ల కాద‌ని ఎంప్లాయ్ అన‌డంతో ఆమెపై తిట్ల దండ‌కం మొద‌లుపెడ‌తాడు రాజ్‌. ఈ రాజ్‌కు ఏ క‌ళావ‌తి క‌ళ అవ‌స‌రం లేద‌ని, ఇక‌పై తానే స్వ‌యంగా డిజైన్స్ వేయ‌డం మొద‌లుపెట్టి త‌నలోని క‌ళ బ‌య‌ట‌పెట్టాల‌ని రాజ్ ఫిక్స్ అవుతాడు.

Aparna Shocking Decision about Kavya in August 25th 2023 Episode number 184 in Brahmamudi Telugu Serial

ఇంట్లో ఎవ‌రితో మాట్లాడ‌కుండా ఇందిరాదేవి సీరియ‌స్‌ గా ఉంటుంది. అప‌ర్ణ‌, ధాన్య‌ల‌క్ష్మితో మిగిలిన కుటుంబ స‌భ్యులు ఆమెతో మాట్లాడించాల‌ని ప్ర‌య‌త్నించిన ఇందిరాదేవి మాత్రం మౌనం వీడ‌దు. మ‌ధ్య‌లోకి రుద్రాణి ఎంట‌ర్ అయ్యి అప‌ర్ణ‌పై సెటైర్స్ వేస్తుంది. ఇది మా అత్తాకోడ‌ళ్ల విష‌యం నువ్వు త‌ల‌దూర్చ‌కుండా ఉంటే బాగుంటుంద‌ని రుద్రాణికి వార్నింగ్ ఇస్తుంది అప‌ర్ణ‌.

Aparna Shocking Decision about Kavya in August 25th 2023 Episode number 184 in Brahmamudi Telugu Serial

నువ్వు కూడా మా అత్తాకోడ‌ళ్ల మ‌ధ్య‌లో త‌ల‌దూర్చి, త‌గ‌వు తీర్చి. ఆ మ‌హాత‌ల్లిని గొప్పింటిదానిలా చేశావ‌ని స్వ‌ప్న‌ను చూపిస్తూ క‌ఠువుగా అప‌ర్ణ‌తో అంటుంది రుద్రాణి. నీకు నేను గౌర‌వం ఇవ్వ‌డ‌మే కాకుండా క‌డుపుతో ఉన్న నీ కొడ‌లిని ఇంకా ఇంట్లో ఉండ‌నిస్తున్నాను. అందుకు సంతోషించు. ఇంకో మాట ఎక్కువ మాట్లాడితే ఇద్ద‌రు ఇంట్లో ఉండ‌ర‌ని రుద్రాణిపై ఫైర్ అవుతుంది అప‌ర్ణ. అంద‌రిని ఇంట్లో నుంచి పంపించి నువ్వు ఒక్క‌దానివే ఏలుకో ఈ సామ్రాజ్యాన్ని అంటూ అప‌ర్ణ‌పై సెటైర్స్ వేస్తుంది రుద్రాణి.

Aparna Shocking Decision about Kavya in August 25th 2023 Episode number 184 in Brahmamudi Telugu Serial

అత్త‌య్య ఎవ‌రితో మాట్లాడ‌టం లేద‌ని అంద‌రం బాధ‌ప‌డుతుంటే మ‌ధ్య‌లో నీ పంచాయ‌తీ ఏంది అంటూ రుద్రాణిపై కోపాన్ని ప్ర‌ద‌ర్శిస్తుంది ధాన్య‌ల‌క్ష్మి. జ‌రిగిన త‌ప్పుల‌కు త‌న‌ను ఒక్క‌దానినే బాధ్య‌రాలిని చేసి ఇలా మౌనంతో శిక్ష వేయ‌డం క‌రెక్ట్ కాద‌ని ఇందిరాదేవితో అంటుంది అప‌ర్ణ‌.కావ్య‌పై జాలి, ద‌యా లాంటివి చూపించ‌వ‌ద్ద‌ని ధాన్య ల‌క్ష్మిపై ఫైర్ అవుతుంది.

తండ్రికి బొమ్మ‌ల పెయింటింగ్ వ‌ర్క్‌లో స‌హాయం చేసి ఇంటికి వ‌స్తుంది కావ్య‌. ఫ్యామిలీ మెంబ‌ర్స్ అంద‌రికి టీ రెడీ ఇస్తుంది. కానీ ఎవ‌రూ ఆమె ఇచ్చిన టీ తీసుకోరు. క‌నీసం ఆమెతో మాట్లాడ‌రు. త‌న‌తో ఎవ‌రూ మాట్ల‌డ‌కూడ‌ద‌ని అత్త‌య్య తీర్పు ఇచ్చార‌ని కావ్య అర్థం చేసుకుంటుంది. అప‌ర్ణ తీర్పుపై కావ్య ఎలా స్పందించింది. రాజ్ తనకు కావాల్సిన డిజైన్స్ ఎలా వేయించుకుంటాడు.. అనేది తెలియాలంటే... ఈరోజు ఎపిసోడ్ చూడాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X