Brahmamudi September 16th: రాజ్ చేసిన పనికి ముక్కలు కానున్న దుగ్గిరాల కుటుంబం... అపర్ణ వేరు కాపురం

రుద్రాణి పెట్టిన చిచ్చుతో అపర్ణ తనకు తానే వెలి వేసుకుంటుంది. ఇక నుంచి ఇంటి నుంచి అడుగు బయట పెట్టను. ఎవరినీ ఏం అనను. జడ పదార్థంలా ఉండిపోతాను అని అపర్ణ అంటుంది. మమ్మీ అలా అనకు అని రాజ్ చెప్పినా... నువ్ నాతో మాట్లాడకు రాజ్ అని గట్టిగా అరుస్తుంది అపర్ణ. ఇవాళ నీ తల్లిని విమర్శించినప్పుడే మన తల్లీ కొడుకుల బంధం అబాసుపాలైంది.

నీ భార్యను ఇంటి మహారాణిగా ప్రకటించావు. తనకు కిరీటం పెట్టు. మర్యాదలు చేయు అని రాజ్‍పై కోప్పడుతుంది అపర్ణ. ఇక ఇంట్లో వాళ్లంతా కావ్యదే కరెక్ట్ అంటూ నన్ను తప్పుపట్టారు అంటూ బాధగా, కోపంగా పైకి గదిలోకి వెళ్లిపోతుంది. మరోవైపు కూతురు స్వప్నకు కనకం కాల్ చేస్తుంటే కలవదు. అక్కడ సిగ్నల్ సరిగా లేదేమో అని కృష్ణమూర్తి అంటాడు. మరోవైపు కోపంగా ఉన్న అపర్ణ దగ్గరికి రుద్రాణి వెళ్తుంది. నేను అనుకున్నదానికంటే ఎక్కువే జరిగింది. ఇది ఇలాగే కొనసాగాలంటే ఇంకాస్తా రెచ్చగొట్టాలి అని మనసులో అనుకుంటుంది.

Aparna Shocking Decision in September 16th 2023 Episode number 203 in Brahmamudi Telugu Serial

నిన్ను అందరూ అలా అంటుంటే నాకో కోపం వచ్చింది. ఇంకా నీకు ఎలా ఉంటుందో చెప్పలేను. అయినా రాజ్ ఏంటీ వదినా.. వచ్చి ఆ కావ్యను లెఫ్ట్ రైట్ ఇస్తాడనుకున్నా. మా అమ్మ మాటకు ఎదురుచెబుతావా అని నిలదీస్తానుకుంటే.. తనకు సపోర్ట్ చేశాడు. నీకు పదవి, డబ్బు అవసరం లేదు. కానీ, ఆ కావ్యకు మాత్రం అవే కావాలి. రాజ్‍ను కావ్య తనవైపు తిప్పుకోవడం కాదు. పూర్తిగా తన గుప్పిట్లో పెట్టుకున్నట్లు ఉంది. ఇంట్లో వాళ్లు కూడా నీకంటే కావ్యనే నమ్ముతున్నారు. ఇలాగే కొనసాగితే కావ్యే అనుకుంది జరుగుతుంది. ఇక నీకే కష్టం అని చెప్పి వెళ్లిపోతుంది రుద్రాణి.

తల్లి అపర్ణ అన్న ప్రతి ఒక్క మాట తలుచుకుంటాడు రాజ్. వెంటనే తల్లి దగ్గరికి వెళ్తాడు. రాజ్‍ను చూసి వెళ్లిపోతుంది అపర్ణ. మమ్మీ అని పిలిస్తే.. ఎవరూ.. అంటూ కోప్పడుతుంది అపర్ణ. నా మాట వినవా అని రాజ్ అంటే.. విన్నది చాలు.. చూసింది చాలు. నీ భార్య మంచితనాన్ని, ఔన్యత్యాన్ని అర్థం చేసుకోవడం మొదలు పెట్టావ్ కదా. చాలు. హాయిగా కాపురం చేసుకోండి. ఈ ఇంట్లో నిన్ను అడిగేవారు ఎవర్రా అని అపర్ణ అంటుంది. ఈ ఇంట్లో నీకంటే నాకు ఎవరూ ఎక్కువ కాదు అని రాజ్ అంటాడు. ఎవరికీ చెబుతున్నావ్ ఆ మాట. అక్కడ చెప్పాల్సింది ఇక్కడ చెబుతున్నావ్ ఏంటీ అని అపర్ణ అంటుంది.

ఒక్కాగానొక్క కొడుకువి అని నిన్ను గొప్పగా చూడాలనుకున్నాను. నీకు నచ్చినట్లే పెళ్లి చేద్దామనుకున్నాను. కానీ, పెళ్లిలో దగా పడ్డావని వాళ్లపై కోపం పెంచుకున్నాను. నువ్వేం చేశావ్. ఆ కుటుంబాన్నే నెత్తిన పెట్టుకున్నావ్. నీ జీవితం ఇలా మారిపోయిందని నేను బాధపడుతుంటే.. ఆ మనిషి కోసం ఈరోజు నీ కన్నతల్లిని ఎదిరించే స్థాయికి వెళ్లిపోయావ్ అని అపర్ణ అంటుంది. ఈరోజు ఇంటిల్లిపాది నీ భార్య స్థాపించిన సంఘంలో చేరారు. నేను ఒంటరిని అయ్యాను. దీనికే ఇలా ఎమోషనల్ అయింది. ఇంకా తాతయ్య గురించి చెబితే అని అనుకున్న రాజ్.. నాకు ఈ ప్రపంచంలో నీ తర్వాతే ఎవరైనా అదొక్కటి అర్థం చేసుకో మమ్మీ అని వెళ్లిపోతాడు రాజ్.

మరోవైపు కల్యాణ్ అనామిక ఇంటికి వచ్చిందని అప్పుకు చెప్తాడు. దీంతో అప్పు సెటైర్స్ వేస్తుంది. ఇంట్లో తన వంట తనే చేసుకుందామని కూరగాయాలు కట్ చేస్తుంది అపర్ణ. అది చూసి ధాన్యలక్ష్మి, కావ్య షాక్ అవుతారు. ఇంట్లో వేరు కాపురం పెట్టిందా అని ధాన్యలక్ష్మీ అంటే.. అవును అన్నట్లుగా రుద్రాణి అంటుంది. కావ్య దగ్గరికి వెళ్లిన రుద్రాణి.. ఏంటీ ఇంత పనిచేశావ్. నువ్ చేసిన పనికి తల్లీకొడుకులు దూరం అయ్యారు. ఆ పాపం నీదే. ఇద్దరిని విడదీసిన పాపం నెత్తినవేసుకున్నావ్ అని రుద్రాణి అంటుంది.

గదలో అపర్ణ దగ్గరికి కావ్య వెళ్తుంది. అత్తయ్య గారు అని పిలిచి గదిలోకి వెళ్లడానికి అడుగు పెట్టబోతుంటే అపర్ణ కోపంగా చూస్తుంది. దీంతో అడుగు వెనక్కి వేస్తుంది కావ్య. ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. లోపలికి రావొచ్చా. నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు అని కావ్య అంటుంది. దీంతో లేచి వచ్చిన అపర్ణ కావ్య మొహంపై తలుపులు వేస్తుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది. వచ్చే ఎపిసోడ్ లో అపర్ణ తన వంట తాను చేసుకుని తింటూ ఉంటుంది. దీనితో ఇందిరాదేవి వచ్చి ఆస్తి పంచుకుని ఎవరికి వాళ్లు బతకండని చెబుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X