Brahmamudi September 19th: కావ్య సూపర్ ప్లాన్... రాజ్ ఫుల్ హ్యాపీ... ఎట్టకేలకు అత్తను మార్చేసిందిగా...!
బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఆసక్తి కలిగిస్తోంది. ఇక తనకు ఇంట్లో విలువ లేదని... అందరూ కావ్యనే సపోర్ట్ చేస్తున్నారని అపర్ణ అనుకుంటుంది. దీనితో కొడుకు రాజ్ తో కూడా మాట్లాడదు. కావ్య వంటను తినకుండా తానే స్వయంగా వేరుగా వంట చేసుకుంటుంది. ఫ్యామిలీ మెంబర్స్‌తో కలిసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తినడానికి అపర్ణ ఇష్టపడదు. అపర్ణకు సర్ధిచెప్పాలని ఇందిరాదేవి ప్రయత్నిస్తుంది. కానీ అత్తయ్య మాటల్ని కూడా అపర్ణ పట్టించుకోదు.ఆస్తులు పంచుకొని ఎవరికి వారు విడిపొమ్మనికోపంగా అపర్ణతో చెప్పి వెళ్లిపోతుంది ఇందిరాదేవి.
అపర్ణ చేసిన పని వల్ల ఇంట్లో ఎవరూ భోజనం చేయకుండా పస్తులు ఉండిపోతారు. తల్లి కోపం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అని రాజ్ భయపడిపోతాడు. తన వల్ల రాజ్, అపర్ణకు మధ్య దూరం పెరగడం కావ్య తట్టుకోలేకపోతుంది. తల్లీకొడుకుల్ని కలపాలని ఫిక్స్ అవుతుంది. అపర్ణకు వాస్తవాల్ని వివరించి ఆమెలోని కోపాన్ని పోగోట్టడానికి ప్రయత్నిస్తుంది కావ్య. కానీ కావ్య మాటల్ని పట్టించుకోదు అపర్ణ. మంచిమాటలతో కాకుండా రివర్స్ స్ట్రాటజీలో కొత్త నాటకం మొదలుపెట్టి అపర్ణ మనసు మార్చేస్తుంది కావ్య.

మీరు మీ కుటుంబానికి దూరంగా వేరు కుంపటి పెడితే మీకు నష్టం అంటూ అపర్ణ మనసులో కొత్త అనుమానాల్ని రేకెత్తిస్తుంది. దుగ్గిరాల ఫ్యామిలీ దగ్గర నుంచి నాకు కావాల్సినంత సానుభూతి దొరుకుతుంది. తానే ఇంటికి మహారాణి అయిపోతానని చెబుతుంది.
మీ అబ్బాయి నా తప్పు లేదు అని సమర్ధించారు. అర్థం చేసుకున్నారు కాబట్టి రాజ్ నాకే దగ్గరైపోతాడు. ఇక ఎప్పటికీ మీ కొడుకు మీ మాట వినడని అపర్ణతో అంటుంది కావ్య. కోడలి మాటలు విని అపర్ణ భయపడిపోతుంది. తాను వేరు కుంపటి పెడితే ఇంటికి శాశ్వతంగా దూరమవ్వాల్సివస్తుందని అనుకుంటుంది. ఇక్కడి ఉండి కావ్యపై ఆధిపత్యం చెలాయించాలని నిశ్చయించుకుంటుంది.
రాత్రి ఇంట్లో ఎవరికి భోజనం లేకుండా చేసి కావ్యపై ఎగిరిపడిన అపర్ణ తర్వాత రోజు ఉదయమే మనసు మార్చేకుంటుంది. కావ్యను పిలిచి కాఫీ ఇవ్వమని అడుగుతుంది. తనతో పాటు ఇంట్లో అందరికి కాఫీ ఇవ్వమని ఆర్డర్‌వ ఏస్తుంది. అపర్ణ మనసు మారిపోవడంతో దుగ్గిరా ఫ్యామిలీ హ్యాపీగా ఫీలవుతుంది. నానమ్మ ఇందిరాదేవి అపర్ణ మనసును మార్చేసిందని రాజ్ అనుకున్నాడు. కానీ కావ్యనే అమ్మతో మాట్లాడి ఆమె కోపాన్ని తగ్గించిందని తెలిసి రాజ్ ఎలా ఫీయ్యాడన్నది ఈరోజు ఎపిసోడ్ లో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











