పగిలిపోద్దంటూ బుల్లెట్ భాస్కర్‌కు వార్నింగ్..స్టేజ్ మీదే చొక్కా విప్పి అప్పారావు హల్చల్
జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ షోకు వచ్చిన పాపులార్టీతో ఎక్స్‌ట్రా జబర్దస్త్‌ను కూడా ప్రారంభించారు. ఈ రెండు షోలకు వచ్చిన క్రేజ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎంతో మంది ఈ వేదికపై నుంచి ఎదిగారు. బుల్లితెర నుంచి వెండితెరకు వెళ్లి అక్కడ రాణిస్తున్నారు. అయితే ఈ జబర్దస్త్ కార్యక్రమం నిత్యం ఏదో ఒక వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటుంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో మరింత వివాదంగా మారేట్టు కనిపిస్తోంది.

వల్గారిటీ అంటూ..
జబర్దస్త్, ఎక్స్‌ట్రా జబర్దస్త్ షోలో వల్గారిటీ పెరిగిపోతోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అయితే డబుల్ మీనింగ్ డైలాగ్‌లతో చేసే స్కిట్స్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతుంటాయి. యూట్యూబ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తుంటాయి. దాదాపుగా ఏడేళ్ల నుంచి టాప్ రేటింగ్‌తో దూసుకుపోతోంది.

కంటెస్టెంట్ల మధ్య గొడవలు...
జబర్దస్త్ స్టేజ్‌పై ఆర్టిస్ట్‌ల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరిగినట్టుగా ప్రోమోలు కట్ చేస్తుంటారు. స్కిట్స్‌లో భాగంగా కొట్టుకోవడం, గాయాలు కావడం, కిందపడటం జరుగుతూ ఉంటుంది. అయితే వీటిని ఒక్కోసారి ప్రోమోల వరకే పరిమితం చేస్తుంటారు.

బుల్లెట్ భాస్కర్ స్కిట్ వైరల్..
వచ్చే వారం ప్రసారమయ్యే ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయింది. ఈ ప్రోమోలో బుల్లెట్ భాస్కర్, అప్పారావ్ మధ్య పెద్ద గొడవ జరిగినట్టు తెలుస్తోంది. బెత్తం దెబ్బలతో చేసిన ఈ స్కిట్ ప్రస్తుతం హల్చల్ చేస్తోంది.
Recommended Video

షర్ట్ విప్పి.. దెబ్బలు చూపిస్తూ..
బుల్లెట్ భాస్కర్ స్కిట్‌లో భాగంగా పర్ఫామ్ చేస్తూ.. అప్పారావ్‌ను బెత్తంతో కొడుతూనే ఉన్నాడు. సహనం కోల్పోయిన అప్పారావ్.. అసభ్య పదజాలంతో విరుచుకపడ్డాడు.చొక్కా విప్పి పడ్డ వాతలను చూపిస్తూ స్టేజ్ మీది నుంచి వెళ్లిపోయాడు.అయితే మరి ఇది కూడా స్కిట్‌లో భాగమేనా? సీరియస్ ఇష్యూనా? అనేది తెలియాలంటే వచ్చే వారం వరకు ఆగాలి.


Click it and Unblock the Notifications











