జబర్దస్త్ లో ఘోరంగా అవమానించారు.. బుల్లెట్ భాస్కర్ అలా చేశాడు.. ఎమోషనల్ అయిన అప్పారావు

తెలుగు టెలివిజన్ చరిత్రలో జబర్దస్త్ ప్రోగ్రాం సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు సుమారు పదేళ్ల క్రితం ప్రారంభమైన ఈ షో ఇప్పటికీ నిరాటంకంగా సాగుతూనే ఉంది. మధ్యలో ఎంతో మంది కంటెస్టెంట్ లు జడ్జిలు మారుతూ ఉంటారు కానీ షో మాత్రం నడుస్తూనే ఉంది. అయితే ఈ షో ద్వారా అనేకమంది వెలుగులోకి వచ్చారు. అలా వెలుగులోకి వచ్చిన వారిలో అప్పారావు కూడా ఒకరు అంతకుముందు కొన్ని సినిమాల్లో నటించిన అప్పారావు జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడు అయ్యాడు.. అయితే తాజాగా జబర్దస్త్ నుంచి తప్పుకున్న ఆయన స్టార్ మాలో ప్రసారం అవుతున్న కామెడీ స్టార్స్ అనే షోలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా జబర్దస్త్ నుంచి ఎలాంటి పరిస్థితుల్లో బయటకు వచ్చాను అన్న విషయం మీద ఆయన ఎమోషనల్ గా స్పందించారు. ఆ వివరాల్లోకి వెళితే..

సంచలన ఆరోపణలు

సంచలన ఆరోపణలు


తెలుగు బుల్లితెర చరిత్రలోనే అత్యంత భారీ స్థాయిలో ప్రజాదరణ పొందిన షోలలో జబర్దస్త్ కామెడీ షో మొదటి స్థానంలో ఉంది. 2013లో ప్రారంభమైన ఈ షో.. అప్పటి నుంచి విజయవంతంగా ప్రదర్శితమవుతూనే ఉంది. అదే సమయంలో ఎన్నో టీఆర్పీ, యూట్యూబ్ రికార్డులను సైతం ఈ కామెడీ షో క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఎంతో మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఇండస్ట్రీకి పరిచయం చేసింది. అలా పరిచయం అయిన వారిలో అప్పారావు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత జబర్దస్త్ అప్పారావు షో లో కనిపించడం మానేసాడు. గతంలో అప్పారావు బుల్లెట్ భాస్కర్ ఇద్దరూ కలిసి ఒక టీంకి లీడర్లుగా ఉండేవారు. అయితే జబర్దస్త్ నుంచి తాను దూరమైన విషయం మీద అప్పారావు సంచలన ఆరోపణలు చేశారు.

షూటింగ్ కి వెళ్ళ లేదని

షూటింగ్ కి వెళ్ళ లేదని


తాను కావాలని జబర్దస్త్ షో కి దూరం కాలేదని జబర్దస్త్ షో వాళ్లు కావాలని దూరం చేశారని చెప్పుకొచ్చారు. తాను బిగ్ బాస్ హౌస్ కి వెళ్లిపోతున్నానని సినిమాల్లోకి వెళుతున్నానని రకరకాల పుకార్లు పుట్టించారు అని బహుశా అందువల్ల తనను మల్లెమాల టీమ్ దూరం పెట్టి ఉండవచ్చు అని ఆయన అభిప్రాయపడ్డారు.సెకండ్ లాక్ డౌన్ తర్వాత కరోనా ఉధృతం గా ఉందని చెబుతూ ఎక్కువ వయస్సు ఉన్న వాళ్ళని షూటింగ్ కి రావద్దు అని చెప్పారని అప్పటి నుంచి నేను జబర్దస్త్ కి వెళ్ళ లేదని ఆయన అన్నారు. వాళ్లు కూడా హోల్డ్ లో పెట్టారు అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతానికి రావద్దు అని భాస్కర్ చెప్పాడని తన కో టీం లీడర్ చెప్పడంతో అది నిజమే అనుకొని తాను కూడా షూటింగ్ కి వెళ్ళ లేదని ఆయన చెప్పుకొచ్చారు.

ఎనిమిదేళ్ల పాటు

ఎనిమిదేళ్ల పాటు


ఆ తర్వాత కూడా తను అనేక ప్రయత్నాలు చేశాం అని అయినా సరే వాళ్ల నుంచి సరైన స్పందన లేకపోవడంతో నన్ను తప్పించమని అడిగానని ఆయన చెప్పుకొచ్చారు. తాను సుమారు ఎనిమిదేళ్ల పాటు జబర్దస్త్ షోలో చేశానని అయినా వాళ్ళు అసలు మీకు వచ్చిన కష్టం ఏంటి అని కూడా అడగలేదు అని, అలా తనకు అక్కడ అవమానంగా అనిపించిందని అన్నారు. ఇక్కడ మోసే వాళ్ళు, కూసే వాళ్ళు, చాలా మంది ఉంటారు అని చెప్పుకొచ్చిన ఆయన చెప్పుడు మాటలు వినడం చాలా ప్రమాదకరమని చెప్పుకొచ్చారు. ఇది గ్లామర్ ఇండస్ట్రీ కావడంతో రూమర్లకు ఎక్కువగా అవకాశం ఉండేదని కానీ తాను ఏ రోజు కూడా షూటింగ్ కి లేట్ గా వెళ్లడం కానీ రిహార్సల్స్ ఎగనామం పెట్టడానికి దాని చూడలేదని చెప్పుకొచ్చారు.

 రావద్దు అని

రావద్దు అని


తాను ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డాను, ఇలా కొన్ని ఛానళ్లకి ఇంటర్వ్యూ ఇస్తున్నాను అంటే దానికి కారణం జబర్దస్త్ అని ఆయన చెప్పుకొచ్చారు. దానికోసం మల్లెమాల సంస్థకు ఇప్పటికీ కృతజ్ఞతలు అని ఆయన చెప్పుకొచ్చారు. ఇదే విషయం మీద అప్పారావు శ్రీమతి లక్ష్మీ మాట్లాడుతూ చాలా కాలంగా ఆయన జబర్దస్త్ చేస్తూ వస్తున్నారని ఆ షో చేయడం వల్లే ఆయనకు మంచి పేరు వచ్చి బయట ఈవెంట్లు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి అని చెప్పుకొచ్చారు. ఆయన కారణంగా నాకు నటన మీద ఉన్న ఆసక్తితో కొన్ని స్కిట్స్ లో కూడా కనిపించానని అయితే సెకండ్ వేవ్ తరువాత మీ ఏజ్ గ్రూప్ వాళ్ళని రావద్దు అని మేనేజ్మెంట్ చెప్పినట్లు బుల్లెట్ భాస్కర్ చెప్పారని లక్ష్మి వెల్లడించారు.

డబుల్ పేమెంట్

డబుల్ పేమెంట్


భాస్కర్ చెప్పినా మేనేజ్మెంట్ చెప్పినా ఒకటే అనుకున్నాము కానీ ఆ తర్వాత అసలు మాతో ఒక్క మాట కూడా ఎందుకు ఈ విషయం గురించి మాట్లాడలేదు అని మేనేజ్మెంట్ వాళ్ళు అడిగారని ఆమె చెప్పుకొచ్చారు. అయితే నిజానికి నేను ప్రతి ఎపిసోడ్ షూటింగ్ సమయంలో న్ చేసి పరిస్థితి ఏమిటి అని వాకబు చేస్తూనే వచ్చానని కానీ ఆరు నెలల పాటు చేసిన తర్వాత ఇక వాళ్లకు తీసుకుని ఉద్దేశం లేదని అర్థం అయిందని చెప్పుకొచ్చారు. అయితే వాళ్లు తీసేశారు బట్టి ఈ రోజు కాస్త మంచి పొజిషన్ లో ఉన్నాము అని, ప్రస్తుతానికి ఓంకార్ గారి సారధ్యంలో నడుస్తున్న కామెడీ స్టార్స్ ప్రోగ్రాం లో మాకు జబర్దస్త్ కంటే డబుల్ పేమెంట్ దొరుకుతుందని వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X