Brahmamudi November 21st: సూసైడ్ చేసుకున్న అప్పు.. స్వప్న బండారం బయటపెట్టిన రాహుల్.. ఉత్కంఠగా ఎపిసోడ్!

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో (నవంబర్ 21వ తేదీ) స్వప్నకు అరుణ్ కాల్ చేస్తూ ఉంటాడు. ఇక ఫోన్ ఎత్తి.. అరుణ్ ను స్వప్న బెదిరిస్తుంది.. నీకు నాకు ఏం సంబంధం అని స్వప్న అంటుంది. దానికి అరుణ్.. అక్రమ సంబంధం అని చెప్తాడు. దీనికి స్వప్న షాక్ అవుతుంది. అరుణ్ ను తిడుతుంది. నువ్వు నేను చెప్పేది వినడం లేదని అలా చెప్పాను అని అరుణ్ అంటాడు. మరి ఎందుకు వెంట పడుతున్నావ్... అని స్వప్న అడుగుతుంది. నువ్వు పెద్ద మిస్ యూనివర్స్ పెళ్లైనా కూడా వెంట పడటానికి అని అరుణ్ సెటైర్ వేస్తాడు.

మరి నైట్ ఇంటికి ఎందుకు వచ్చావ్ అని స్వప్న అడుగుతుంది. దానికి నీకు భయం ఎలా ఉంటుందో చూపించాలని వచ్చాను అని అరుణ్ అంటాడు. దీంతో స్వప్న షాక్ అవుతుంది. ఏం కావాలి రా నీకు అని స్వప్న అంటుంది. ఏం లేదు... ఆసుపత్రి కట్టుకోవడానికి చాలా కష్టపడుతున్నా... ఓ పది లక్షలు కావాలి అని అడుగుతాడు. నీకు నాకు ఏం సంబంధం... వచ్చి ఇంట్లో మాట్లాడుకో నాకేం భయం లేదని స్వప్న అంటుంది. దానికి నేను ఎందుకు వస్తాను.. కోరియర్లో ఫోటోలు వచ్చినట్లు... మనం హోటల్లో గడిపినట్లు మార్ఫింగ్ ఫోటోలు వస్తాయని బెదిరిస్తాడు.

Appu Attempt Suicide and Big Twist in November 21st 2023 Episode number 259 in Brahmamudi Telugu Serial

ఎలాగూ అత్తింట్లో నీ మీద నమ్మకం లేదు.. పుట్టింట్లో విలువ లేదు.. అని చెప్తాడు అరుణ్. దీనికి స్వప్న షాక్ అవుతుంది. ఎలాగైన రేపటిలోగా 10లక్షలు తీసుకురావాలి అని స్వప్న అనుకుంటుంది. ఉన్నది ఒక్కటే దారి నగలు తాకట్టు పెట్టడం అని స్వప్న అనుకుంటుంది. మరోవైపు వామ్మో.. అవి తాకట్టు పెడితే.. ఇంట్లో వాళ్ల ముందు బుక్ అవుతాను.. ఇంకో దారి వెతకాలి అనుకుంటుంది. మరోవైపు అప్పు డల్ గా కూర్చొని ఉంటుంది. బయట చాలా మంది పరిగెడుతూ ఉంటారు. ఏమైంది అని కనకం వెళ్లి అడుగుతుంది. వాళ్లు ఎవరో అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్తారు.

ఎందుకు అని కనకం అడుగుతుంది. దానికి ప్రేమించిన అబ్బాయికి వేరే పెళ్లి అయిందని ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుందని చెప్తారు. ఆ అమ్మాయి దుఖంలో ఉంటే.. తల్లి కూడా నానా మాటలు అనడంతో.. ఈ పని చేసిందని అనుకుంటారు. ఇక కనకం.. ఆలోచనలో పడిపోతుంది. అప్పును జాగ్రత్తగా చూసుకోవాలి అనుకుంటుంది. క్షణం కూడా విడిచి పెట్టకూడదు అనుకుంటుంది. మరోవైపు రాజ్ కు పోలీసు కాల్ చేసి.. అరుణ్ గురించి చెప్తాడు. అరుణ్ స్వప్న క్లోజ్ ఫ్రెండ్స్ అని రాజ్ కు చెప్తాడు పోలీసు.

గదిలోకి కావ్య వస్తుంది.. మళ్లీ టామ్ అండ్ జెర్రీలా గొడవపడుతాడు. నేను వస్తే కనీసం కాఫీ కూడా ఇవ్వలేదని..రాజ్ అంటాడు. మొన్న మీరు కనీసం నా చెత్తో మంచినీళ్లు కూడా తాగను అన్నారు.. అని అంటుంది కావ్య. ఇప్పుడు కూడా తాగను.. నువ్వు తీసుకురావడం నీ బాధ్యత.. నేను వద్దు అనడం మొగుడి పొగరు అంటూ మాట్లాడుకుంటారు. ఆ తర్వాత కావ్య వెళ్లిపోతుంది.

మరోవైపు అప్పు ఇంట్లో పనులు చేస్తూ కూడా కల్యాణ్ గురించి ఆలోచిస్తుంది. కనకం గుర్తించి.. కల్యాణ్ ఆలోచనల నుంచి బయట పడాలి అంటే.. ఇంట్లో పనులు చెప్పాలి అని అనుకుంటుంది. కూరగాయాలు కట్ చేయమని అప్పుకు చెప్తుంది. అప్పు కూరగాయాలు కట్ చేస్తుంది. ఆ తర్వాత వెళ్లిపోతుంటే.. బట్టలు ఉతకమని చెప్తుంది. సరే అని అప్పు వెళ్తుంది. ఇక అన్నపూర్ణ వచ్చి.. ఎందకు దానికి పనులు చెప్తున్నావ్ అని అడుగుతుంది.

ఆ పక్కింటి సిరిలాగే అప్పు చేసుకుంటుందని భయపడుతున్నావా అని అడుగుతుంది. దానికి కనకం.. ఏం చేయను తల్లిని కదా.. నువ్వు కూడా దాని మీద కన్నేసి ఉంచు.. వీలైతే మనసు మార్చు అని చెప్తుంది. మరోవైపు స్వప్న పది లక్షలు ఎలా తీసుకురావాలి అనేది దానిపై ఆలోచిస్తూ ఉంటుంది. ఇక రాహుల్ వచ్చి.. ఏమైంది స్వప్న అని అడుగుతాడు. ఎందుకు టెన్షన్ పడుతున్నావ్ ఏమైంది అని స్వప్నను అడుగుతాడు. ఏమైనా హెల్ప్ చేయాలా అంటాడు రాహుల్.

నేను ఎప్పుడు తప్పు చేస్తానా అని చూసే నువ్వు హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది స్వప్న. తాతాయ్య ఆరోగ్యం కుదటపడేవరకు గొడవలు ఎందుకు అని రాహుల్ కవర్ చేస్తాడు. రాహుల్ నిజంగానే హెల్ప్ చేస్తాడా అని స్వప్న అనుకుంటుంది. వద్దులే మళ్లీ ఎందుకు ఏమిటి అని ప్రశ్నలు వేస్తాడు అని సైలెంట్ అయిపోతుంది. మరోవైపు రాజ్, కావ్య మళ్లీ టామ్ అండ్ జెర్రీలా గొడవపడుతారు. రాజ్ కు డోర్ దెబ్బ తాకుతుంది.

ఇక కనకం అప్పు రూమ్ కు వెళ్లి చూసే సరికి చేయి కట్ చేసుకుని కనిపిస్తుంది.. సుసైడ్ చేసుకుందని కనకం అనుకుంటుంది. ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక తదుపరి ఎపిసోడ్ లో స్వప్న ను నిలదీస్తాడు రాహుల్.. అరుణ్ ఫోటోలు తీసి అందరికీ చూపిస్తాడు.. జస్ట్ ఫ్రెండ్ అని స్వప్న చెప్తుంది.. అప్పుడు ఇందిరాదేవి.. ఎవరు అని ఇతను నిన్ను అడిగినప్పుడు తెలియదు అని ఎందుకు చెప్పావ్ అని అడుగుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X