Brahmamudi july 14th:కల్యాణ్‌ను అవమానించిన అప్పు.. ఆ డిజైన్స్ కావ్యవేనని రాజ్‌కు తెలిసిపోతుందా?
బ్రహ్మముడి ఈరోజు ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఇక ఈ ఎపిసోడ్‌లో కల్యాణ్ ఏదో సాయం చేద్దామని కనకం ఇంటికి వస్తే... అప్పుకి కోపం వచ్చి అవమానిస్తుంది. మరోవైపు పుట్టింటి అప్పు ఎలా తీర్చాలో తెలియక కావ్య సతమవుతూ ఉంటుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్‌లో ఏం జరిగిందో పూర్తి వివరాల్లోకి వెళితే...
పుట్టిళ్లు ఇళ్లు తాకట్టులో ఉందని సేట్ మాటలతో తెలుసుకుంటుంది కావ్య. తనకు తెలియకుండా తల్లిదండ్రులు డబ్బు కోసం ఎన్నో కష్టాలు పడుతున్నారని అర్థం చేసుకుంటుంది. పుట్టింటి కష్టాలను స్వప్నకు చెప్పాలని కోపంగా ఆమె రూమ్‌కు వస్తుంది కావ్య. కానీ స్వప్న మాత్రం కావ్యతో గొడవకు దిగుతుంది. దానికి తగ్గట్లుగానే కావ్య కూడా క్లాస్ ఇస్తుంది. నువ్వు చేసిన మోసం బయటపడితే ఈ ఇంట్లో ఉండనిస్తారా? నీపై రెండు కుటుంబాల వారు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, నిజం బయటపడితే నీ కాపురానికే ప్రమాదమని స్వప్నను హెచ్చరిస్తుంది కావ్య.

కల్యాణ్ ను అవమానించిన అప్పు: ఇంటి దగ్గర అమ్మనాన్న నువ్వు కడుపుతో ఉన్నావని చీర, సారె తీసుకురావడం కోసం ఎంత కష్టపడుతున్నారో తెలుసా.. అని కావ్య అనగా... వాళ్ళు తెచ్చే చీప్ చీరలు కట్టుకోనని చెప్పమని పొగరుగా సమాధానం ఇస్తుంది. చెంప పగిలిద్ది ఇంకోసారి ఆ మాట అంటే అని కావ్య వార్నింగ్ ఇస్తుంది. తన విషయంలో జోక్యం చేసుకోవద్దని స్వప్న హెచ్చరిస్తుంది.
సీన్ కట్ చేస్తే... కళ్యాణ్ కూరగాయలు తీసుకుని అప్పు ఇంటికి వస్తాడు. వాటిని చూసి ఇంట్లో వాళ్ళు అందరూ ఆశ్చర్యపోతారు. సరుకులు తీసుకొచ్చాను ఇక నుంచి మీరు దేనికి ఇబ్బంది పడాల్సిన పని లేదని అన్ని తాను చూసుకుంటానని కళ్యాణ్ అంటాడు. అప్పు మాత్రం కళ్యాణ్ ని తిడుతుంది.

బాధపడ్డ కల్యాణ్: ఏమనుకుంటున్నావ్ మా గురించి అడుక్కుని తినే వాళ్ళం అనుకుంటున్నావా? అసలు ఎవరు చెప్పారు? పరాయి వాళ్ళ దయతో బతుకుతున్నామని ఎవరు చెప్పారని నిలదీస్తుంది. తానేమీ పరాయి వాడిని కాదు కదా అంటాడు. కానీ అప్పు మాత్రం నోటికొచ్చినట్టు వాగుతుంది.
తిండికి లేకపోతే మంచినీళ్లు తాగైన బతుకుతాము కానీ ఇలాంటివి తీసుకోమని చీదరింపుగా మాట్లాడుతుంది. సోరి తెలియక మిమ్మల్ని హర్ట్ చేశానని కళ్యాణ్ బాధపడతాడు. సరుకులు తీసుకుపోయి లేనివాళ్ళకి ఇవ్వమని రూడ్ గా మాట్లాడుతుంది.

కరెక్ట్ కాదన్న కనకం: సాయం చేసిన మనసుని గాయం చేసి పంపించావు కరెక్ట్ కాదని ఇంట్లో వాళ్ళు అప్పుని తిడతారు. డబ్బు పెడితే అన్ని దొరుకుతాయి కానీ మనుషులు మాత్రం దొరకరని కనకం చెప్తుంది. కావ్య తన పుట్టింటికి ఎలా సాయం చేయాలా అని ఆలోచిస్తుంది. రాజ్ వర్క్ చేసుకుంటూ ఉండగా పనిమనిషి కాంతం వచ్చి స్కూల్ ఫీజు డబ్బులు ఇవ్వమని అడుగుతుంది. కావ్యని పిలిచి డబ్బులు ఇవ్వమని చెప్తాడు. ఇక నుంచి డబ్బు ఏదైనా అవసరమయితే కావ్యనే ఇస్తుందని కాంతంకి చెప్తాడు.

రాజ్ మంచి మనసు: ఇంట్లో పని చేసే పిల్లల ఖర్చు అంతా రాజ్ సర్ చూసుకుంటారని కాంతమ్మ చెప్తుంది. టను వెళ్లిపోయాక రాజ్ వచ్చి ఏంటి ఆలోచిస్తున్నావని అడుగుతాడు. కావ్య ఆలోచనలో ఉండి సరిగా వినిపించుకోదు. ఇన్ హేలర్స్ తెప్పించి మిగిలిన చిల్లర కూడా రాజ్ కి ఇచ్చేస్తుంది. కళ్యాణ్ అప్పు అన్న మాటలు తలుచుకుంటూ ఉంటాడు. కావ్య డల్ గా ఉండటం చూసి ఏమైందని అడుగుతాడు. పుట్టింటి గురించి పట్టించుకోలేకపోతున్నానని ఇన్ డైరెక్ట్ గా చెప్తుంది.
పార్శిల్ ఓపెన్: స్వప్న ఇంటి గుమ్మం దగ్గర నిలబడి వెయిట్ చేస్తుంటే రాహుల్ వచ్చి ఏంటని అడుగుతాడు. డ్రెస్ ఆర్డర్ ఇచ్చానని వాడికోసం వెయిట్ చేస్తున్నానని పొగరుగా సమాధానం చెప్తుంది. ఇంత పొట్టి డ్రెస్ వేసుకుంటే ఇంట్లో వార్ జరుగుతుంది, దీని గొయ్యి ఇదే తొవ్వుకుంటుందని రాహుల్ మనసులో సంబరపడతాడు. స్వప్న లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ధాన్యలక్ష్మి వస్తుంది. కొరియర్ బాయ్ వచ్చి పార్సిల్ ధాన్యలక్ష్మి చేతికి ఇస్తాడు. అది ఓపెన్ చేస్తుంటే స్వప్న ఫీల్ అవుతుందని రాహుల్ అంటాడు.

కావ్య డిజైన్స్: ఇంకొకరికి వచ్చినవి తాను చూడనని ధాన్యలక్ష్మి తిరిగి ఇస్తుంటే.. ఈవిడకి అనుమానం రాకూడదంటే చూడనివ్వాలని అనుకుని చూడమని చెప్తాడు. సరిగ్గా ఓపెన్ చేసే టైమ్ కి అది కిందపడిపోతుంది. స్వప్న వచ్చి దాన్ని తీసుకుని వెళ్ళిపోతుంది. కావ్య వెంటనే శృతికి ఫోన్ చేస్తుంది. ఇక తరువాయి భాగంలో కావ్యతో శ్రుతి ఇలా అంటుంది.
మీరు కోటీశ్వరుల ఇంటికి కోడలు కదా.. మీకు డబ్బు అవసరమేంటి.. అని శ్రుతి అడుగుతుంది. మా అమ్మ వాళ్లకి ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయాలని నేను అనుకుంటున్నాను.. ఈరోజు రాత్రి డిజైన్స్ వేసి అవి నేను మీకు పంపిస్తాను.. అని కావ్య మాట ఇస్తుంది. ఇంతలో గదిలో కావ్య లేకపోవడంతో రాజ్ ఇల్లంతా చూస్తాడు. బయటకి వచ్చి చూసేసరికి కావ్య డిజైన్స్ వేస్తూ కనిపిస్తుంది. ఇదీ నేటి బ్రహ్మముడి సంగతి.. మళ్లీ రేపటి ఎపిసోడ్‌తో కలుద్దాం.


Click it and Unblock the Notifications











