Brahmamudi April 1st సుభాష్ సంచలన నిర్ణయం.. రాజ్‌ను తప్పించి కావ్యకు కంపెనీ బాధ్యతలు!
నేటి బ్రహ్మముడి సీరియల్లో ఎపిసోడ్లో మార్కెట్ కు వెళ్లిన కనకం, మూర్తిలకు కావ్య ఎదురవుతుంది. బాబుకు బొమ్మలు తీసుకుని వెళ్తున్న కావ్యను చూసిన మూర్తి, కనకం చూసి.. నా కూతురి పరిస్థితి ఇలా అయిందని ఆవేదన చెందుతారు. నువ్వు ఇలాగే ఉంటే నిన్ను ఇంట్లో ఆయాను చేస్తారు.. మన ఇంటికి వెళ్దాం మీడియాకు ఈ విషయం చెప్పి దుగ్గిరాల కుటుంబాన్ని రోడ్డు మీదకు ఈడ్చుదాం.. సంఘంలో పెట్టి న్యాయం అడుగుదాం అంటుంది.
దీంతో కావ్య ఇంకా నా భర్త మాన మర్యాదలను మంట కలపడానికి ఇవి సరిపోతాయా? ఇంకా ఏమైనా మిగిలిపోయాయా? అని నిలదీస్తుంది. నిజమేనమ్మా మా ఆయనకి ఇలాంటి శిక్షలు వేయాల్సిందే? ఎందుకంటే ఆయన మీకు చాలా అన్యాయం చేశారని అంటుంది. నువ్వు ఇంటి కాగితాలు పెట్టి అప్పు చేస్తే.. ఆ అప్పు తీర్చినందుకు ఆయన్ను క్షమించకూడదు కదా అమ్మా అంటూ మాట్లాడుతుంది. ఆయన పతనం కళ్లారా చూసేదాకా మనం నిద్రపోకూడదని చెప్పుకువస్తుంది.

అంతా బాగున్నప్పుడు అల్లుడు దేవుడు. అటూ ఇటూ అయితే మోసగాడు కదా అంటూ ఫైర్ అవుతుంది. నిజమేనమ్మా అల్లుడు దేవుడే.. మనకు ఎంతో మేటు చేశాడు. కానీ చివరకు నీకు కీడు చేశాడు కదమ్మా అంటాడు మూర్తి. నాన్న ఇంట్లో ఆయన ఇప్పుడు ఒంటరివాడైపోయాడు. ఆయనకిప్పుడు కష్టమొచ్చింది. సుఖంలో తోడుగా ఉన్న నేను కష్టంలో కూడా తొడుంటాను నాన్న అంటూ కావ్య వెళ్లిపోతుంది. మరోవైపు ఇంట్లో అందరూ కూర్చుని ఉంటారు.
యుద్దానికి సిద్దంగా ఉన్నారు. కోటలు బీటలు వారే టైం వచ్చింది. సింహాసనం మీద సింహం కూర్చుంటుందో.. శునకం కూర్చుంటుందో. శునకం అంటే నా కొడుకే కదా అని రుద్రాణి మనసులో అనుకుంటుంది. ఇంతలో రాజ్ బాబును తీసుకుని వస్తాడు. నీతో మాట్లాడకూడదని ఒక శాసనం. కానీ మాట్లాడక తప్పని పరిస్థితని అపర్ణ అంటుంది. మాటలే కదా మమ్మీ పోయేదేముందని రాజ్ అంటాడు. పెద్దరికం పోయింది మా మాట పోయింది. ఈ ఇంటి పరువు భుజాన వేసుకుని ఆఫీసు వరకు వెళ్లావు. ఆ బరువు మొయ్యలేనంతగా పెరిగిందని అపర్ణ అంటుంది.
నేనే కదా మోయాల్సిందని రాజ్ అంటే... అందుకే ఆ బరువుని దింపుకోమని చెప్పానని అంటుంది అపర్ణ. ఈ బిడ్డను అనాథలా వదిలేసి వెళ్లలేక వెంట తీసుకెళ్లాల్సి వచ్చిందని రాజ్ అంటాడు. ఆ అవసరం పది మంది పది రకాలుగా మాట్లాడే అవకాశం ఇస్తుంది. ఇంట్లో వాళ్లంటే నీకు లెక్కలేదా అని అపర్ణ అంటుంది. నీకింకా అర్థం కాలేదా? వదిన రాజ్ స్పష్టంగా చెప్తున్నాడు. అయినా నువ్వింకా అమాయకంగా ప్రశ్నిస్తావేంటి? ఈ ఇంట్లో ఏ నిర్ణయం కొనసాగుతుంది. వారసత్వం వాకర్‌లో ఇల్లంతా తిరుగుతుంది. ఒకప్పుడు నా కొడుకు అమ్మాయిలతో తిరుగుతాడని ఆఫీసులో అడుగుపెట్టకుండా చేశారు. మరి నీ కొడుకు చేసిందేంటి వదిన. రాహుల్ కు కంపెనీ చూసుకునే అర్హత లేనప్పుడు. రాజ్ కు ఆ అర్హత ఎలా ఉంటుందని రుద్రాణి అంటుంది.

తప్పొప్పుల గురించి నువ్వు చెప్తున్నావా? రుద్రాణి. పులిలా ఉన్నోడివి ఇలా ఎందుకు మారిపోయావు రాజ్ అని ప్రకాశం అంటాడు. విన్నావా? ఎవరి మాటకైనా సమాధానం చెప్పే ధైర్యం నీకుందా? రుద్రాణి ఎప్పుడు మాట్లాడినా కండించే నేను ఈరోజు ఆవిడని ఆపలేకపోతున్నాను. మీ బాబాయ్ కూడా నిన్ను సమర్థించలేకపోతున్నాడు. ఈ ఇంట్లో నిన్ను ఎవరూ వెనకేసుకురాలేకపోతున్నారని అపర్ణ అంటుంది. ఏం చేయమంటావో నువ్వే చెప్పు మమ్మీ.. అని రాజ్ అంటాడు. పరిష్కారాలు రెండే ఉన్నాయి. ఒకటి పరిహారం చెల్లించక తప్పదు. ఇంకొకటి పశ్చాత్తాపం చెల్లించక తప్పదు. బిడ్డను వదిలేసి రావాలి. లేదంటే నువ్వు కంపెనీ బాధ్యతలు వదిలేసుకోక తప్పదని అపర్ణ అంటుంది.
సుభాష్ కోపంగా అపర్ణను తిడతాడు. అదంతా సులువు కాదు అంటాడు. ఇంతలో ధాన్యలక్ష్మీ కూడా అపర్ణ మాట్లాడింది తప్పేం కాదు అంటుంది. ఈ బిడ్డ కావ్యకే పుట్టి ఉంటే ఇంట్లో వారసత్వం ఇచ్చేవాళ్లం. కాబట్టి ఈ బిడ్డనైనా వదిలేసి రావాలి. కంపెనీ బాధ్యతల నుంచైనా తప్పుకోవాలని ధాన్యలక్ష్మి అంటుంది. చెప్పు రాజ్ ఈ కంపెనీ కావాలా? ఆ బిడ్డే కావాలా? తేల్చుకుని చెప్పు అని అపర్ణ అంటుంది. రాజ్ ఇందులో తేల్చుకోవడానికి ఏం లేదు. నేను కంపెనీ చూసుకోవడం మీకు ఇష్టం లేకపోతే సంతోషంగా కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని రాజ్ అంటాడు.
ఏ పాపం తెలియని ఈ బిడ్డను మాత్రం అనాథను చేయను అనడంతో అందరూ షాక్ అవుతారు. ఉండనిస్తే ఇంట్లో ఉంటానని రాజ్ అంటాడు. వెళ్లిపోమ్మంటే వెళ్లిపోతాను.. ఆ నిర్ణయం కూడా మీకే వదిలేస్తున్నాను అంటూ బాబును తీసుకుని పైకి వెళ్లిపోతాడు రాజ్. దీంతో ఇవాళ్టీ ఎసిసోడ్ అయిపోతుంది. ఇక తదపరి ఎపిసోడ్ లో అనామిక, స్వప్న ఆ స్థానంలో రాహుల్, కల్యాణ్ కూర్చోవాలని గొడవ పడుతుంటారు. ఇంతలో సుభాష్ వచ్చి ఆ స్థానంలో కూర్చోనే అర్హత కావ్యకు మాత్రమే ఉందని చెప్తాడు.


Click it and Unblock the Notifications










