Brahmamudi April 2nd బాబు కోసం అనాథలా రాజ్.. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఎండీగా కావ్య!

బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకుంటానని రాజ్ చెప్పడంతో ఇందిరాదేవి అదే తలుచుకుంటూ ఉంటుంది. కావ్య ఇందిరాదేవి దగ్గరకు వచ్చి ఏమైందని అడుగుతుంది. దీంతో ఇంట్లో జరిగిన గొడవ గురించి చెప్తుంది ఇందిరాదేవి. ఈ విషయం శ్వేతకు కూడా చెప్పలేదని చెప్తుంది కావ్య. ఏదో ఒకటి చేసి బాబు తల్లి ఎవరో తెలుసుకోవాలి అని చెప్తుంది. నేను తెలుసుకుంటాను.. ఆ తల్లి ఎవరో కనిపెడుతానని కావ్య ఇందిరాదేవికి చెప్తుంది.

సుభాష్ వద్దకు రాజ్...
మరోవైపు సుభాష్‌ దగ్గరకు రాజ్‌ వెళ్తాడు. డాడ్‌ మిమ్మల్ని అడక్కుండా ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నందుకు కోపం వచ్చిందా? అని అంటాడు. నాకు తెలుసు డాడ్‌ మీరు బాబాయ్‌ ఈ కంపెనీని ఎంత కష్టపడి పైకి తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు... నా మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఈరోజు మీ నమ్మకాన్ని బ్రేక్‌ చేశాను. కానీ ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నాకు ఏ దారి కనిపించలేదని చెప్పుకువస్తాడు రాజ్. ప్రతి గమ్యానికి రెండు దారులుంటాయి రాజ్‌. మనం ఏ దారి ఎంచుకున్నామన్నదే ముఖ్యమని సుభాష్ అంటాడు. కానీ నాకు ఆ అవకాశం లేదు డాడ్‌ అని రాజ్ అంటాడు.

April 2nd 2024 Episode number 373 in Brahmamudi Telugu Serial

కావ్యను ఎండీగా చేయమని...
ఉంది కానీ నువ్వు ఆ దారిని వద్దనుకుంటున్నావని సుభాష్ అని ఇద్దరూ మాట్లాడుకుంటూ కంపెనీ ఎండీగా కావ్యను చేయాలని డిసైడ్‌ అవుతారు. ఈ పరిస్థితుల్లో కావ్యనే ఎండీగా చేయడం బెటర్‌ అని రాజ్‌ చెప్తాడు. తనకు అన్ని అర్హతలు ఉన్నాయి అని చెప్పి వెళ్లిపోతాడు. మరోవైపు రూంలో కావ్య బాబును ఆడిస్తుంది. నువ్వొచ్చి నా జీవితాన్ని తలకిందులు చేశావు కదరా? ఏమీ తెలియని నువ్వు, అన్నీ తెలిసిన ఆ దేవుడు నన్ను బొమ్మను చేసి ఆడుకుంటున్నారు అంటుండగానే రాజ్‌ ఎంటర్ అవుతాడు.

కళావతికే కంపెనీ బాధ్యతలు...
ఏం జరుగుతుందో మీకు తెలుస్తూనే ఉంది. భార్య దగ్గర నమ్మకం పోగొట్టుకున్నారు. కన్నతల్లి దగ్గర ప్రేమ పొగొట్టుకున్నారు. ఇంటి సబ్యుల దగ్గర మర్యాద పోగొట్టుకున్నారు. ఇప్పుడు కంపెనీ బాధ్యతలు కూడా పొగొట్టుకున్నారు. ఇన్నీ పొగొట్టుకుని మీరు ఏం సాధిస్తున్నారని నిలదీసి కావ్య వెళ్లిపోతుంది. ఇన్ని తెలిసిన సమర్థులు ఈ ఇంట్లో ఇంకెవరున్నారు కళావతి. నీకు చెప్పకుండా కంపెనీ బాధ్యతలు నీకే అప్పజెప్పబోతున్నాం. అని మనసులో అనుకుంటాడు రాజ్‌. తర్వాత అనామిక, రుద్రాణి, రాహుల్ కలిసి గార్డెన్‌ లో మాట్లాడుకుంటుంటారు.

April 2nd 2024 Episode number 373 in Brahmamudi Telugu Serial

అనామిక రెచ్చగొట్టిన రుద్రాణి...
ఇదే సరైన సమయం రాజ్‌ తనంతట తానే కంపెనీ బాధ్యతల నుంచి తప్పుకునేలా చేశానని రుద్రాణి అంటుంది. ఇక చేయాల్సింది అంతా నువ్వే అనామిక అంటుంది. బావగారు తప్పుకోవడం నాకు ఆనందంగానే ఉంది. కానీ ఇప్పుడు నేను ఎం చేయనని అంటుంది అనామిక. నువ్వు అడిగింది అడిగినట్లు చేశాక కూడా ఇంకా నేనేం చేయాలి అంటావేంటి అనామిక. రాజ్‌ను కంపెనీ బాధ్యతల నుంచి దింపేలా చేసింది నీ కోసమేగా అని రుద్రాణి అంటుంది.

స్వప్నను రెచ్చగొట్టి...
ఇప్పుడు వెళ్లి మా వదినను అడుగు కళ్యాణ్‌ను కంపెనీకి ఎండీని చెయ్యమని ఒప్పించు అని రెచ్చగొట్టి పంపిస్తుంది. దీంతో రాహుల్‌ నన్ను చైర్మన్‌ను చేస్తానని ఆ కళ్యాణ్‌ను చేస్తానంటావా? అని అడగడంతో ఇదంతా కావాలని చేస్తున్నాను. ముందు దాన్ని రెచ్చగొట్టి తర్వాత నిన్ను ఎండీ చేయమని అడిగిద్దాం అనగానే ఈ ఇంట్లో నాకు సపోర్టు చేసేవాళ్లు ఎవరు మమ్మీ అంటాడు రాహుల్‌. నీ పెళ్లాం చేస్తుంది. పద వెళ్లి స్వప్నకు చెబుదాం అంటూ లోపలికి వెళ్తారు.

April 2nd 2024 Episode number 373 in Brahmamudi Telugu Serial

అనామిక, స్వప్న గొడవ
స్వప్న వినేటట్టు నిన్ను కూడా ఎండీని చేయమని మా వదినను అడిగేదెవరు? కళ్యాణ్‌ కోసం అనామిక వెళ్లింది మరి నీకోసం ఎవరు వెళ్తారు అని మాట్లాడుకోవడంతో స్వప్న కూడా కిందకు వెళ్లిపోతుంది. ఇంతలో అనామిక వెళ్లి అందరిని కళ్యాణ్‌ను ఎండీగా చేయమని అడుగుతుంది. దీంతో ఇంకా ఈ విషయంలో ఏ డిసీజన్‌ తీసుకోలేదని చెప్తారు. ఇంతలో స్వప్న వెళ్లి కళ్యాణ్‌కు బిజినెస్‌ మీద ఇంట్రెస్ట్‌ లేదని ఎండీగా రాహుల్‌కు మాత్రమే ఆ అర్హత ఉందని స్వప్న చెప్తుంది. దీంతో అందరూ షాక్‌ అవుతారు.

ఇక తర్వాతి ఎపిసోడ్ లో
అనామిక, స్వప్న ఎండీ సీటులో రాహుల్, కల్యాణ్ కూర్చొవాలని ఒకరిపై ఒకరు గొడవపడుతుంటే.. అప్పుడే సుభాష్ వచ్చి ఈ ఇంట్లో రాజ్ స్థానంలో కూర్చవడానికి సరైన అర్హత ఒక్కరికే ఉందని చెప్తాడు. ఆ ఒక్కరు ఎవరో కాదు.. నా కోడలు కావ్య అని సుభాష్ చెప్తాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X