Brahmamudi April 3rd బాబు తల్లి పేరు చెప్పేసిన రాజ్... వెన్నెల కోసం కావ్య వేట!
నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ లో రాజ్ ఎండీ పదవి నుంచి తప్పుకోవడంతో.. ఆ కూర్చీలో ఎవరు కూర్చొవాలనే విషయంపై దుగ్గిరాల ఫ్యామిలీలో రచ్చ మొదలవుతుంది. తన భర్త కళ్యాణ్ ఎండీ కావాలని అనామిక అంటుంది. ధాన్యలక్ష్మి కూడా తన కొడుకునే సపోర్ట్ చేస్తుంది. కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తున్నట్లుగా నాటకం ఆడిన రుద్రాణి...చివరి నిమిషంలో ప్లేట్ ఫిరాయించి.. స్వప్నను రెచ్చగొట్టి రాహుల్ కు ఇవ్వాలని గొడవకు దిగుతుంది.
రాహుల్ దుగ్గిరాల వారసుడే కాదు....
నీ కొడుకు రాహుల్ కు అమ్మాయిలతో తిరగడం తప్ప బిజినెస్ చూసుకోవడం తెలుసా అని రుద్రాణిపై ధాన్యలక్ష్మి ఫైర్ అవుతుంది. ఇంట్లో ఎవరూ సక్రమంగా లేరని రుద్రాణి బదులిస్తుంది. అనామికను పెళ్లి చేసుకున్న కల్యాణ్ అప్పుతో తిరుగుతున్నాడు. కావ్య ఉండగానే రాజ్.. మరో అమ్మాయితో సంబంధం పెట్టుకుని బిడ్డను తెచ్చాడు. తన కొడుకును మాత్రమే చెడ్డవాడిగా చిత్రీకరించడం కరెక్ట్ కాదని అంటుంది. దీంతో అనామిక.. రాహుల్ అసలు దుగ్గిరాల వారసుడే కాదని చెప్తుంది.

లీగల్‌గా కళ్యాణ్ మాత్రమే వారసుడు
రాజ్ స్థానంలో ఎండీ కావాలంటే వారసత్వం ఉండాలని అంటుంది అనామిక. కళ్యాణ్ మాత్రమే ఆ స్థానానికి అర్హుడని చెప్పుకువస్తుంది. స్వప్న అందుకు ఒప్పుకోదు. మా అత్తయ్య పెంపకంలో రాహుల్ జులాయిగా తిరిగినా ఇప్పుడు మారిపోయాడని చెప్తుంది. ఎక్స్‌పీరియన్స్ ఉన్నా రాహుల్‌ను కాదని కళ్యాణ్‌ను కంపెనీకి ఎండీని ఎలా చేస్తారని అనామికకు మాటకు మాట సమాధానమిస్తుంది. లీగల్‌గా కళ్యాణ్ మాత్రమే వారసుడు, ఎవరూ పోటీకి వచ్చిన ఊరుకునేది లేదని అంటుంది.
గొడవ మధ్యలో సుభాష్ ఎంట్రీ
ఎండీ పదవి చేపట్టడం తనకు ఇష్టం లేదని కళ్యాణ్ వచ్చి చెబుతాడు. అన్నయ్య స్థానంలో తాను కూర్చోనని అంటాడు. ఓ సమస్య వచ్చిందని అన్నయ్యను ఆ పదవి నుంచి దించడమే బాగాలేదని అందరికి కళ్యాణ్ చెప్పుకువస్తాడు. కళ్యాణ్‌కు ఇష్టం లేని బాధ్యతల్ని అతడికి ఎలా అప్పగిస్తారని స్వప్న అంటుంది. దీంతో రాహుల్‌కే ఎండీ సీట్ అప్పగించాలని అంటుంది. అప్పుడే అక్కడికి సుభాష్ వస్తాడు. మీ గొడవ ఆపితే తాను మాట్లాడుతానని అంటాడు. రాజ్ ఇంకా ఎండీ పదవి నుంచి పూర్తిగా దిగిపోలేదని అంటాడు.

నా కోడలు కావ్యకే ఆ అర్హత ఉంది...
ఆ పదవిలో కూర్చోవడానికి హక్కుతో పాటు అర్హత ఉండాలని చెప్పుకువస్తాడు. ఈ ఇంట్లో ఆ అర్హత ఒక్కరికే ఉందని ఆ ఒక్కరు మరెవరో కాదు నా కోడలు కావ్య అని అంటాడు. కావ్య షాక్ అవుతుంది. రాజ్ భార్యవి అని కాకుండా నీలోని సమయస్ఫూర్తి, నైపుణ్యం చూసే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుభాష్ అంటాడు. సుభాష్ నిర్ణయాన్ని కళ్యాణ్ అంగీకరిస్తాడు. గొప్ప నిర్ణయం తీసుకున్నారని పెదనాన్నతో చెబుతాడు. తన భర్తకు ఎండీ సీట్ ఇవ్వాలని అప్పటివరకు గొడవ పడిన స్వప్న...కావ్య పేరు చెప్పగానే సంబరపడుతుంది.
కావ్య మాత్రం షాకిచ్చిందిగా..
అందరూ అంగీకరించిన తాను మాత్రం ఎండీ సీట్‌లో కూర్చొనని చెప్పి షాకిస్తుంది కావ్య. నా భర్త నిజంగా తప్పు చేశాడని రుజువు కాలేదని, అలాంటప్పుడు ఆయన్ని ఎండీ పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో నేను కూర్చుంటే మీతో పాటు రాజ్‌ను నేను కించపరిచినట్లే అవుతుందని కావ్య చెప్పుకువస్తుంది. ఇంట్లో కోడలిగా నా స్థానం ఉంటుందో, లేదో అన్నదే తెలియడం లేదని, ఇంట్లో నా స్థానం ఏమిటో తెలిసిన తర్వాతే బయట నేనంటే ఏమిటో నిరూపించుకుంటానని అంటుంది. కళ్యాణ్‌ను ఎండీని చేయాలని తన నిర్ణయాన్ని వెల్లడిస్తుంది.కానీ కళ్యాణ్ కూడా ఎండీ సీట్‌లో కూర్చోవడానికి అంగీకరించడు.
రాజ్ కు క్లాస్ ఇచ్చిన కావ్య
అన్నయ్య తప్పు చేశాడని తేలే వరకు తాను ఆ సీట్‌లో కూర్చునేది లేదని అంటాడు. అప్పటివరకు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్‌గా మాత్రమే కొనసాగుతానని తన నిర్ణయాన్ని వెల్లడిస్తాడు. కొడుకును ఎండీ సీట్‌లో కూర్చోబెట్టాలని తన ప్లాన్ రివర్స్ కావడంతో రుద్రాణి డిసపాయింట్ అవుతుంది. గొడవ ముగియగానే రూమ్‌లోకి వచ్చిన రాజ్‌కు క్లాస్ ఇస్తుంది కావ్య. మీరు ఏమైపోతే నాకేంటి అనుకోవాలి. మీరు దేనికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉంటే నేను ఇవన్నీ ఎందుకు పట్టించుకోవాలని రాజ్‌కు క్లాస్ ఇస్తుంది కావ్య.
పేరు చెప్పేసిన రాజ్...
బిడ్డ ఆకలి అర్థం చేసుకున్నావు. నీ భర్తకు అవమానం జరిగినా తట్టుకోలేకపోయాయి. నా స్థానాన్ని తీసుకోమంటే తీసుకోనని అన్నావు. అలాంటి నీవు ఇప్పుడు నాకేంటి అని అంటున్నావు..అసలు నిన్ను ఎలా అర్థం చేసుకోవాలని కావ్యతో అంటాడు రాజ్. కావ్య ఆ బిడ్డకు తల్లి ఎవరో చెప్పమని అడుగుతుంది. పట్టు బడుతుంది. పేరు చెప్తే చాలు అని అంటుంది. దీంతో తన బిడ్డ కన్నతల్లి పేరు వెన్నెల అని చెబుతాడు రాజ్. ఆమె ఎక్కడుంటుంది ఏం చేస్తుందని రాజ్‌ను అడుగుతుంది కావ్య. పేరు మాత్రమే కావాలని అన్నావు. అందుకే అదొక్కటే మాత్రమే నీకు చెప్పానని అంటూ రాజ్ టాపిక్ డైవర్ట్ చేస్తాడు.

ఏంటో ప్రూవ్ చేసుకోవాలి..
అప్పుకు ఫోన్ చేస్తాడు కళ్యాణ్. కానీ ఆమె ఫోన్ కట్ చేస్తుంది. అప్పు గురించిన ఆలోచనల్లో కళ్యాణ్ ఉండగా అక్కడికి కావ్య వస్తుంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఎంపికైన కళ్యాణ్‌కు కంగ్రాట్స్ చెబుతుంది. తనకు ఇష్టంలేని పనిని అంటగట్టి ఇరికించేశారని కావ్యపై చిర్రుబుర్రులాడుతాడు కళ్యాణ్. మిమ్మల్ని డబ్బు సంపాదించడం రాని చేతకానివాడిగా అందరూ జమకడుతున్నారని, వారికి మీరంటే ఏమిటో ప్రూవ్ చేసుకోవాలని కళ్యాణ్‌కు చెబుతుంది కావ్య.
బిజినెస్ మీద ఫోకస్...
మీ బిజినెస్ టాలెంట్‌ను నిరూపించుకున్న తర్వాతే మీ ఇష్టాలను అందరూ గౌరవిస్తారని కళ్యాణ్‌తో అంటుంది కావ్య. కొన్ని బంధాల కోసం కష్టపడక తప్పుదు. కుటుంబసభ్యులు మీపై పెట్టుకున్న నమ్మకానికి, ప్రేమకు సమాధానం చెప్పి తీరాలని అంటుంది. కావ్య మాటలకు కళ్యాణ్ తన ఆలోచనను మార్చుకుంటాడు. బిజినెస్‌పై ఫోకస్ పెట్టాలంటే కావ్య సహయం కావాలని కోరుతాడు రాజ్. వదినలా కాదు అమ్మలా మీకు సపోర్ట్‌గా ఉంటానని కళ్యాణ్‌కు మాటిస్తుంది కావ్య.
తర్వాతి ఎపిసోడులో.. రాజ్ అంతరాత్మ వచ్చి నాకు తెలియకుండా ఎప్పుడు బిడ్డను కన్నావు రా అంటూ ఫైర్ అవుతాడు. ఆ వెన్నెల ఏ మబ్బుల్లో ఉన్నా మన పెళ్లాం బయటకు తీసుకువస్తుంది. అప్పుడు చెప్తా అంటాడు. మరోవైపు వెన్నెల కోసం వేట మొదలుపెడుతుంది. అడ్రస్ దొరకడంతో ఓ ఇంటికి వెళ్తుంది. మరి అక్కడ ఏం జరిగిందో తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాలి.


Click it and Unblock the Notifications











