Karthika Deepam April 3rd: భర్త నర్సింహను కలుసుకున్న దీప.. కానీ ఎవరూ ఊహించని ట్విస్ట్!

Karthika Deepam 2 Serial April 3rd Episode: నేటి కార్తీక దీపం సీరియల్లో తన భర్త నరసింహ కోసం దీప శౌర్యని తీసుకొని హైదరాబాద్‌ వస్తుంది. తన భర్త డ్రైవర్‌ కావడంతో డ్రైవర్లను దీప తన భర్త గురించి అడుగుతుంది. దీంతో ఓ డ్రైవర్ తన యూనియన్‌లో అడిగి తెలుసుకుంటానని ఫోన్ చేయగా.. ఇద్దరు నర్సింహలు ఉన్నట్లు చెప్తాడు. ఇక మణికొండలో ఒకరు, జూబ్లీహిల్స్‌లో ఒకరు నరసింహా అనే పేరుతో ఉన్నారని దీపకు చెప్పడంతో దీప పరుగులు తీస్తుంది.

సుమిత్ర అడ్డుతొలగించుకునేందుకు...
మరోవైపు జ్యోత్స్నకి తన తల్లి సుమిత్ర తినిపిస్తుంది. ఇక పారిజాతం అక్కడికి వచ్చి... సుమిత్ర జ్యోత్స్నపై తన నీడ కూడా పడకుండా చేస్తుందని రగిలిపోతుంది. జ్యోత్స్న తన కన్న కొడుకు దాసు కూతురని మురిసిపోతుంది. త్వరలోనే సుమత్రి అడ్డు తొలగించుకుంటాను అని అనుకుంటుంది. మరోవైపు దీప ఆటోలో తిరుగుతూ భర్త కోసం వెతుకుతుంది. ఇక సుమిత్ర తన భర్తతో మొక్కు ఉందని గుడిలో 101 కొబ్బరి కాయలు కొట్లాలి అని రమ్మంటుంది. దాంతో దశరథ రాను అనేస్తాడు. '

April 3rd 2024 Episode Number 9 in Karthika Deepam idi Nava Vasantham Telugu Serial

పూలు కోసిన శోర్య...
పారిజాతం వస్తాను అంటే సుమిత్ర వద్దు అంటుంది. దీంతో రగిలిపోయిన పారిజాతం ఈ ఇంటి లెక్కల్లో నువ్వు లేకుండా చేస్తా అని అనుకుంటుంది. దీప ఇంటింటికి తిరుగుతూ భర్త కోసం జాలిస్తుంది. ఇక ఒకరి ఇంటికి వెళ్తుంది ఆయనని చూసి అతను తన భర్త కాదు అని అనుకుంటుంది. దీపతో పాటు శౌర్య కూడా బాధ పడుతుంది. దీప తన భర్త కోసం మరో చోట అందర్ని అడుగుతూ ఉంటుంది. ఇంతలో శౌర్య గులాబి పువ్వులను చూసి అక్కడికి వెళ్తుంది. తన తల్లికి ఇస్తానని పూలు కోస్తుంది.

కొట్టడానికి వచ్చిన శోభ
ఇంతలో శోభ అనే ఇంటి ఆమె వచ్చి సౌర్య మీద అరుస్తుంది. కర్రతో కొట్టడానికి వస్తే శౌర్య తల్లి దగ్గరకు పరుగులు తీస్తుంది. దీప ఆమె దగ్గరకు గులాబీలు పట్టుకొని వెళ్తుంది. శౌర్యను రమ్మంటే భయపడి దూరంగా నిల్చొంటుంది. దీంతో ఆమె దీపని ఇష్టం వచ్చినట్లు తిడుతుంది. ఇంతలో శోభ ఏంటే ఆ గొడవ అని నరసింహా వాయిస్ వినపడంతో దీప సంతోషంతో వెనక్కి తిరిగి చూస్తుంది. ఎదురుగా నరసింహా ఎన్నాళ్లు అవుతుంది అయ్యా నిన్ను చూసి అంటుంది దీప.

April 3rd 2024 Episode Number 9 in Karthika Deepam idi Nava Vasantham Telugu Serial

నర్సింహను కలుసుకున్న దీప...
ఎన్నాళ్లు అవుతుందా.. అని శోభ ఆశ్చర్యపోతుంది. నువ్వు ముందు లోపలికి రా చెప్తానని శోభను నర్సింహ తీసుకుపోతాడు. నిన్ను వెతుక్కుంటూ నేను వస్తే పలకరించకుండా వెళ్లిపోతున్నావ్ ఏంటి అయ్యా అని దీప అంటుంది. దీంతో శోభా ఎవరు ఈమె అంటూ అరుస్తుంది. నేను నర్సింహ భార్యను అని చెప్తుంది దీప. మరి నేను ఎవర్ని అని అంటుంది శోభ. నీకు ముందే పెళ్లయిందా అని శోభ అడుగుతుంది. దీంతో నేను తర్వాత చెప్తాను అంటూ శోభను లోపలికి తీసుకువెళ్తాడు.

కానీ ఊహించని ట్విస్ట్...
ఇన్నాళ్లు నువ్వు ఎందుకు రాలేదో నాకు ఇప్పుడు అర్థమైంది. నన్ను వదిలేసి ఇంకో దాన్ని కట్టుకున్నవ్.. ఏ రోజు ఒక్క రూపాయి కూడా సంపాదించకపోయినా నేను ఏం అనలేదు. నా మొగుడే కదా అర్థం చేసుకుంటావని భరించాను. నా బిడ్డకు, నాకు ఎందుకు అన్యాయం చేశావ్ అంటూ దీప ఆవేదన చెందుతుంది. నీకు నేను ఏం అన్యాయం చేశాను. మా అమ్మ టార్చర్ భరించలేక నేను నీకు తాళి కట్టాను. పెళ్లి అయి నెల తప్పుతున్నా కోడలు నెల తప్పలేదు అంటే నీకు బిడ్డను ఇచ్చాను. ఆ దిక్కుమాలిన ఊరిలో ప్రతీ దానికి మీ దగ్గర చేయి చాచడం ఇష్టం లేక నా దారి నేను చూసుకున్నానని నర్సింహ చెప్తాడు.

April 3rd 2024 Episode Number 9 in Karthika Deepam idi Nava Vasantham Telugu Serial

చెప్పుతో కొట్టేదాన్ని అంటూ దీప ఫైర్..
ఆ అప్పులతో సంబంధం లేదని అంటాడు నర్సింహ. నీ పెళ్లాన్ని కాబట్టి నాకు సంబంధం ఉందని దీప అనగా.. అయితే నువ్వే తీర్చుకో అంటాడు. ఊరువెల్దాం పదా అని అంటే.. నేను అక్కడికి రానని అంటాడు. మరి నా పరిస్థితి నా బిడ్డ పరిస్థితి ఏంటని అంటుంది దీప. నువ్వు బుద్ధిగా ఇంటికి వెళ్లిపో. అప్పులోల మీద కేసు పెట్టు. నేను అప్పుడప్పుడు వస్తాను. నాకు నీ మీద మోజు పుడితే రాత్రి వచ్చి వెళ్తా అని చెప్తాడు నర్సింహ. పగలు వచ్చే వాడిని మొగుడు అంటారు. రాత్రి వచ్చే వాడిని ఏమంటారో తెలుసా అని దీప అంటుంది. పోనీ నేను వాడినే అనుకో.. అని నర్సింహ అంటాడు. ఈ మాట తాళి కట్టిన భర్త అన్నాడు కాబట్టి వదిలేశా అదే ఇంకొడు అయితే చెప్పుతో కొట్టి మాట్లాడేదాన్ని అని దీప అంటుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X