Brahmamudi April 4th వెన్నెలను పట్టుకున్న కళావతి.. అప్పు కోసం కల్యాణ్ ఫైటింగ్
బ్రహ్మముడి నేటి ఎపిసోడులో కావ్య.. రాజ్ బిడ్డ తల్లి పేరు తెలుసుకుంటుంది. దీంతో కల్యాణ్ దగ్గరకు వచ్చి సాయం చేస్తారా అని వెన్నెల గురించి అడుగుతుంది. మీ అన్నయ్య జీవితంలో వెన్నెల అనే ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా అని కల్యాణ్ ను అడుగుతుంది. దీంతో కల్యాణ్ ఆలోచనలో పడి... చివరకు టెన్త్ క్లాస్ లో ఓ అమ్మాయి వెన్నెల ఉందని చెప్తాడు. ఆమె అన్నయ్యను చాలా ప్రేమించేది. కానీ, తర్వాత ఏమైందో తెలియదు అని కల్యాణ్ అంటాడు.
అప్పు ఏడుస్తూ...:ఆ స్కూల్ పేరు అడిగి తెలుసుకున్న కావ్య.. అక్కడికి వెళ్తుంది. మరోవైపు పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో బ్రోకర్ అన్న మాటలు తలుచుకుంటూ గదిలో పడుకుని ఏడుస్తూ కూర్చుంటుంది అప్పు. తల్లి వచ్చి తలుపు కొట్టిన తీయదు. తలనొస్తుందని అని కన్నీళ్లతో చెప్పి పడుకుంటుంది. ఇంతలో కల్యాణ్ వస్తాడు. అది చూసి కనకం షాక్ అవుతుంది. మీరు ఇలా వస్తే.. మీ ఇంట్లో గొడవ అవుతుందని చెప్తుంది. అవన్నీ నేను చూసుకుంటా అని చెప్తాడు కల్యాణ్.

కల్యాణ్ ఎంట్రీ...:కల్యాణ్ తలుపు కొట్టడంతో అప్పు వచ్చి తలుపు తీస్తుంది. అప్పు ఏడవడం చూసి అంతా షాక్ అవుతారు. నువ్ ఏడవడం ఏంటీ బ్రో అని కల్యాణ్ అంటే.. బాధగా కల్యాణ్ చేతిను హగ్ చేసుకుంటుంది. అది చూసి షాక్ అయిన కనకం అప్పు.. అని గట్టిగా అరిచి మందలిస్తుంది. తర్వాత బ్రోకర్ అన్న మాటలు, జరిగిందంతా చెబుతుంది. వాడు అంతలా అవమానిస్తే.. ఇలా ఏడుస్తూ కూర్చుంటావా.. వాడు ఎవడు. పద వాడి పని చెబుదాం అని అప్పు చేయి పట్టుకుని తీసుకెళ్లిపోతాడు కల్యాణ్.
వెన్నెలను పట్టుకున్న కావ్య..:మరోవైపు కల్యాణ్ చెప్పిన స్కూల్‌కు వెళ్లి తనను తాను పరిచయం చేసుకున్న కావ్య.. రాజ్ టెన్త్ క్లాస్ మేట్ వెన్నెల గురించి ఆరా తీస్తుంది. అప్పటి అడ్మిషన్ రిజిస్టర్లో వెన్నెల పేరు చూసి అడ్రస్ తెలుసుకుంది. దీంతో బాబుకు తల్లి దొరికేసింది. వెన్నెల వచ్చేస్తున్నాను అని కావ్య అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మరోవైపు రాజ్ కొడుకును ఆడిస్తుంటే.. అంతరాత్మ బయటకు వచ్చి నా జీవితంలో ఏకైక లక్ష్యం శోభనం లేకుండా చేశావు కదరా అని అంటాడు.
రాజ్ అంతరాత్మ...:కనీసం ఆ అమ్మాయి ఎవరో చెప్పు... మన కళావతిలా అందంగా ఉంటుందా అని అడిగితే రాజ్ సమాధానం చెప్పడు. ఆ వెన్నెల ఎవరు.. ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పమని అడిగితే రాజ్ చెప్పకుండా మౌనంగా ఉండిపోతాడు. నాకు చెప్పకపోయినా.. మన పెళ్లం మాత్రం ఊరుకోదు. ఆ వెన్నెలను ఏ మబ్బుల వెనకు దాచిపెట్టినా పట్టుకొచ్చి బయటకు తీసుకొస్తుంది. అందరిముందు బయటపెడుతుంది అని రాజ్ అంతరాత్మ అంటాడు. .
కావ్య గొడవ...:స్కూల్‌లో చూసిన అడ్రస్‌కు వెళ్తుంది కావ్య. అక్కడ ఓ మహిళ డోర్ తీస్తుంది. మీకోసమే వచ్చాను అని చెప్పిన కావ్య.. ఇంకా ఎన్నాళ్లు ఇలా దాక్కుంటారు. వచ్చి మా ఇంట్లో నిజం చెప్పండి. మా ఆయనతో ఉన్న సంబంధం గురించి ఇంట్లో అందరికీ చెప్పండి అని గొడవ పెట్టుకుంటుంది కావ్య. దాంతో ఆ మహిళ తన భర్తను పిలుస్తుంది. భర్త ఉండి కూడా మా ఆయనతో సంబంధం పెట్టుకున్నావా అని కావ్య అంటుంది. దాంతో వాళ్ల భర్త ఏంటిది అని అడుగుతాడు.

వెన్నెల కాదు... సావిత్రి:నా కాపురంలో చిచ్చు పెట్టకు. అసలు నువ్ ఎవరికోసం వచ్చావో క్లియర్‌గా తెలుసుకో అని ఆమె అంటుంది. నేను అన్ని సరిగ్గా తెలుసుకునే వచ్చాను వెన్నెల అని కావ్య అంటుంది. వెన్నెల.. ఆమె ఎవరు. నా పేరు సావిత్రి అని ఆమె చెబుతుంది. దాంతో షాక్ అయిన కావ్య.. సారీ అండి చిన్న తప్పు జరిగింది. వెన్నెల గురించి అడిగితే ఈ అడ్రెస్ ఇచ్చారు. మీరు ఇక్కడికి వచ్చి ఎన్నాళ్లు అయింది అని కావ్య అంటుంది. పదేళ్లు అవుతుంది. అంతకుముందు ఇంటి ఓనర్స్ అనుకుంటా. వాళ్ల అడ్రస్ కూడా తెలియదు. ఇది మా నాన్న కొన్నారు. ఆయన కూడా లాస్ట్ ఇయర్ చనిపోయారు అని సావిత్ర భర్త చెబుతాడు.
బ్రోకర్ చెంపలు వాయించిన కల్యాణ్:దాంతో సారీ అండి అని మరోసారి చెప్పి వెళ్లిపోతుంది కావ్య. మరోవైపు అనామికను పొగుడుతుంది ధాన్యలక్ష్మీ. నేను చేయలేనిది నువ్ చేశావ్ అని ధాన్యలక్ష్మీ అంటుంది. అలా ఎలా వదిలేస్తాను. ఇన్ని రోజులు అనుకుంది అదే కదా అని అనామిక అంటుంది. మరోవైపు పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన కల్యాణ్ బ్రోకర్ చెంపలు వాయిస్తాడు. వెంటనే బయటే ఉన్న పోలీసుల ముందుకు, మీడియా ముందుకు లాక్కొచ్చి.. మరి కొడతాడు. అది చూసిన పోలీసులు అడ్డుకుంటారు.
మోసం చేశాడని...:మీరే ఇలా చేతిల్లోకి లా తీసుకుంటే ఎలా అని పోలీస్ అంటే.. మీరు చేయట్లేదని నేను చేస్తున్నాని మళ్లీ బ్రోకర్ చెంపలు వాయిస్తాడు కల్యాణ్. అది చూసిన మీడియా ప్రశ్నలు వేస్తుంది. పోలీసుల ముందే ఎందుకు అలా కొడుతున్నారు అని అడుగుతారు. వీడు పోలీస్ డిపార్ట్‌మెంట్‌నే మోసం చేశాడు. నా ఫ్రెండ్ లైఫ్‌తో ఆడాకోవాలని చూశాడు. నా ఫ్రెండ్ పోలీస్ ట్రైనింగ్ అవుతోంది. దానికి అడుగడుగునా అడ్డుపడుతున్నాడు. ఇవాళ ఏకంగా గెస్ట్ హౌజ్‌కు రమ్మన్నాడు అని కల్యాణ్ చెబుతాడు. దాంతో అంతా షాక్ అవుతారు.
తర్వాతి ఎపిసోడ్‌లో..:నా కొడుకుతో అప్పు ఎందుకు బరితెగించి తిరుగుతుంది అని కనకంపై ఫైర్ అవుతుంది ధాన్యలక్ష్మీ. ఇంటితో సంబంధం తెంచుకోవాలి. తర్వాత అప్పు వల్లే నువ్ చెడిపోతున్నావ్ అని కల్యాణ్‌ను తిడుతుంది. ఇక నుంచి ఇలా జరగకూడదంటే.. ఈ ఇంటితో ఈ కనకం కుటుంబం శాశ్వతంగా సంబంధం తెంచుకోవాలి. జీవితంలో ఈ ఇంటి గడప తొక్కకూడదు అని ధాన్యలక్ష్మీ అంటుంది. దానికి చిన్నత్తయ్య అని కావ్య అరుస్తుంది.


Click it and Unblock the Notifications











