Brahmamudi April 5th నేటి బ్రహ్మముడి సీరియల్.. ఎపిసోడ్ హైలెట్స్ ఇవే!
బ్రహ్మముడి సీరియల్ ఈ రోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. పోలీస్ ట్రైనింగ్కు సిద్ధమవుతున్న అప్పును ఓ బ్రోకర్ గెస్ట్ హౌజ్‌కు రావాలంటూ వేధిస్తాడు. ఈ విషయం తెలుసుకున్న కల్యాణ్ బ్రోకర్‌ను పోలీసులు, మీడియా ముందు చితక్కొట్టి అతడిని అరెస్ట్ చేయిస్తాడు. ఇలాంటి వాళ్ల వల్లే నాలుగు అడుగులు ముందుకు వేసి బయటకు వస్తున్న అమ్మాయిలు అలాగే వెనుకబడిపోతున్నారని అంటాడు. ఇతర అమ్మాయిలు ఆ బ్రోకర్ వల్ల ఎంతో నరకం చూశారని, మరో అమ్మాయికి ఇలా జరగకూడదనే తాను ముందుకు వచ్చి ధైర్యంగా చెబుతున్నానంటూ అప్పు కూడా పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి మీడియా ముందు చెప్పుకొస్తుంది. తనలాంటి వాళ్ల అవసరం అమ్మాయిలకు ఉండకూడదని, ఎలాంటి తోడు లేకుండా వాళ్లు ధైర్యంగా ముందడుగు వేయాలని చెప్తాడు కల్యాణ్. దీంతో చుట్టూ పక్కన్న ఉన్నవాళ్లంతా చప్పట్లు కొడుతూ కల్యాణ్ను అభినందిస్తారు.
అయితే ఇదంతా న్యూస్‌లో చూసిన రుద్రాణి కవితలే మాత్రమే కాదు బాగానే ఫైట్ చేస్తున్నాడ, అంతా అప్పు వల్లే అంటూ ధాన్యలక్ష్మీని రెచ్చగొడుతుంది. దీంతో అప్పు తల్లి కనకాన్ని కడిగేస్తా, దుమ్ము దులిపేస్తేనా, నేనేంటో చూపిస్తా అంటూ ధాన్యలక్ష్మీ - కనకంకు కాల్ చేసి అప్పుని తీసుకుని ఇంటికి రమ్మని చెబుతుంది. దీంతో కనకం కాల్ చేసి ధాన్యలక్ష్మీ రమ్మన్నారు అంటూ అప్పుకు చెబుతుంది. దీంతో కల్యాణ్, అప్పు గొడవ గురించి తెలిసి ఉంటుందని అని డౌట్ పడతారు.

నా కొడుకును వీధి రౌడీని చేసి ఇతరులను కొట్టేలా చేసింది అంటూ ధాన్యలక్ష్మీ అంటుండగా కనకం, కృష్ణమూర్తి ఎంట్రీ ఇస్తారు. జరిగిందంతా కనకంకు చెప్పి మండిపడుతుంది. అప్పుడు కావ్య ఎంట్రీ ఇచ్చి చిన్నత్తయ్యా కొంచెం సంస్కారంతో మాట్లాడండి అంటూ చురకలు పెడుతుంది. దీనికి స్వప్న బదులిస్తూ విరుచుకుపడటానికి ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే కల్యాణ్ ఎంట్రీ ఇచ్చి జరిగింది చెప్పేందుకు ప్రయత్నిస్తాడు.
ఇంతలో ఆపు కల్యాణ్ అంటూ వచ్చిన అనామిక.. సిగ్గు లేకుండా నీతో అప్పు తిరుగుతుంది. మీ బాగోతానికి ఫ్రెండ్షిప్ అని పేరు పెడుతోంది అని చెబుతూ అప్పుపై విరుచుకుపడుతుంది. షటప్ అనామిక అప్పును ఏమైనా అంటే మర్యాదగా ఉండదు అని కల్యాణ్ తిరిగి వార్నింగ్ ఇస్తాడు.ఇది కాస్త కల్యాణ్ - అనామిక భార్య భర్త గొడవగా మారిపోతుంది. దొరికిందే ఛాన్స్ అనుకున్న రుద్రాణి.. రాజ్ లాగే కల్యాణ్ కూడా ఏదో ఒక రోజు బిడ్డను తీసుకొస్తాడేమో అని వివాదాన్ని మరింత పెద్దది చేసేందుకు ట్రై చేస్తుంది.

ధాన్యలక్ష్మి కూడా ఈ ఇంటికి ఎవరూ రావొద్దు అంటూ కనకంను అంటుంది. అప్పుడు కనకంలో ఒక్కసారి ఫైర్ రగులుతుంది. ఈ ఇంటి గడప లోపల నా ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారి కోసం కచ్చితంగా ఇంటికొస్తా. ఓ కూతురు కడుపుతో ఉంది. ఇంకో కూతురు కష్టాల్లో ఉంది. వారి కోసం నేనుంటా. మీరేమైనా దుగ్గిరాల కుటుంబానికి మూలస్తంభాలా, రాజమాతలా శాసిస్తున్నారు స్థాపించినట్లు శాసనం వేస్తున్నారు. రోజులు పోయాయి. మీరేమన్నా కళ్ల నిండా నీళ్లు పెట్టుకునే రోజులు కాదు అంటూ రెచ్చిపోతుంది.
అప్పుడు ఇంటికి పెద్దవారైనా సీతారామయ్య, కల్యాణ్ కూడా కనకంను సపోర్ట్ చేస్తారు. దీంతో మిగతా వారు షాక్ అవుతారు. ఫైనల్గా నా కూతురు ఎప్పుడు తప్పు చేయదు. మా కుటుంబం తలెత్తుకునేలా చేస్తుంది అంటూ అప్పును తీసుకెళ్తుంది కనకం. అనంతరం కావ్య రాజ్ తెచ్చిన బిడ్డకు తల్లి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆ బిడ్డ తల్లి వెన్నెల పదేళ్ల క్రితమే ఇల్లు ఖాలీ చేసి వెళ్లిపోయిందని తెలుసుకుంటుంది. అదే సమయంలో బిడ్డను రెడీ చేసే సమయంలో నడుముపై పుట్టు మచ్చ ఉండటాన్ని రుద్రాణి చూస్తుంది. ఇలాంటి మచ్చే రాజ్‌కు కూడా ఉందని చెబుతుంది. దీంతో రాజ్ నడుము చూసేందుకు కావ్య ప్రయత్నిస్తుంది. అది చూసి రాజ్ షాక్ అవుతాడు. నువ్వు నా నడుము చూశావ్ అంటూ ఖుషి సినిమాలోని భూమిక డైలాగ్ను రీక్రియేట్ చేస్తాడు.


Click it and Unblock the Notifications











