వాళ్లతో నీ రిలేషన్ పేరేంటీ.. సోనియాపై యష్మీ నిందలు, రివర్స్‌లో తగులుకున్న ఆర్జీవీ హీరోయిన్
బిగ్‌బాస్ తెలుగు 8 విజయవంతంగా నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. 14 మందితో ప్రారంభమైన ఈ సీజన్‌లో ప్రస్తుతం 11 మంది మిగిలారు. తొలివారం బెజవాడ బేబక్క, సెకండ్ వీక్ ఆర్జే శేఖర్ భాషా, థర్డ్ వీక్ అభయ్ నవీన్‌లు హౌస్‌ను వీడారు. ఫోర్త్ వీక్ గేమ్‌లో వేగం పెరిగింది.. నామినేషన్స్‌లోనూ సిల్లీ రీజన్స్ కాకుండా పాయింట్‌లు మాట్లాడారు కంటెస్టెంట్స్. ఈ క్రమంలో మంగళవారం నాటి ఎపిసోడ్‌కు సంబంధించి స్టార్ మా ప్రోమోను రిలీజ్ చేసింది. ఈ వివరాల్లోకి వెళితే..
ఈ వారం నామినేషన్స్‌లోకి ఏడుగురు కంటెస్టెంట్స్ వచ్చారు. పృథ్వీ, ఆదిత్య, నాగ మణికంఠ, సోనియా, నైనిక, నబీల్, ప్రేరణ కంభం. ఇక్కడే నిఖిల్ గేమ్‌ని మలుపు తిప్పాడు. చీఫ్ అయిన నిఖిల్‌కు బిగ్‌బాస్ ఓ సూపర్ పవర్ ఇచ్చాడు. అంతా తమ ఫ్రెండ్స్ అయిన పృథ్వీ, సోనియాలను నామినేషన్స్ నుంచి సేవ్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అందరికీ షాకిస్తూ నైనికను సేవ్ చేశాడు నిఖిల్. దీనికి సాలీడ్ రీజన్ చెప్పి అందరి నోళ్లు మూయించాడు. నామినేషన్ సందర్భంగా నైనికను నామినేట్ చేయడానికి సరైన రీజన్ చెప్పలేదని అందుకే ఆమెను సేవ్ చేసినట్లు నిఖిల్ చెప్పాడు.

ఇదిలాఉండగా.. ఈ వారం చీఫ్ అండ్ రేషన్ టాస్క్‌లలో భాగంగా కిరాక్ సీత కొత్త చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించింది. రెండు జట్లుగా విడిపోయిన బిగ్‌బాస్ హౌస్‌లో ఇకపై నిఖిల్ వర్సెస్ సీత టీం అన్నట్లుగా పోటీ ఉండనుంది. సీత టీమ్‌లో సీత, ప్రేరణ, నబీల్, ఆదిత్య ఓం, విష్ణుప్రియ, నైనిక ఉండగా.. నిఖిల్ టీమ్‌లో నిఖిల్ , సోనియా, పృథ్వీ, మణికంఠ, యాష్మీగౌడ ఉన్నారు. తన ప్రత్యర్ధి మణికంఠ ఉన్న టీమ్‌లో యష్మీ ఉండటంతో ఇద్దరూ ఎలా నెగ్గుకొస్తారో చూడాలి.
మంగళవారం నాటి ఎపిసోడ్‌కు సంబంధించి స్టార్ మా ప్రోమో రిలీజ్ చేసింది. మదర్ , సిస్టర్ అంటూ నిఖిల్, పృథ్వీలను వాడుకుంటున్న సోనియా వ్యవహారంపై యష్మీ చిందులు తొక్కింది. నువ్వు ఇండిపెండెంట్‌గా గేమ్ ఆడట్లేదని సోనియాను ఇప్పటికే ఆమె నామినేట్ చేసిన యష్మీ.. మంగళవారం కూడా ఆమెను వదల్లేదని అర్ధమవుతోంది. నువ్వు మీ రిలేషన్‌కు ఏదేదో పేరు పెట్టి దానికి ఏదైనా అటాచ్‌మెంట్ యాడ్ చేయొద్దని యష్మి సీరియస్ అయ్యింది.
దీంతో సోనియా కూడా ఘాటుగానే రియాక్ట్ అయ్యింది. నేను మొత్తం క్లియర్‌గానే క్లారిఫై చేశానని.. అయినా తనను అంటే బాగోదని చెప్పింది. నేను గేమ్‌లో భాగంగా చూశానని.. నువ్వు మాత్రం దానికి ఓ అటాచ్‌మెంట్‌ని పెట్టి వాళ్లని వాడుకుంటున్నావని యష్మీ రివర్స్ అయ్యింది. ఆ ముగ్గురికి ఇస్తున్న ఇంపార్టెన్స్ క్లాన్‌లో ఎవ్వరికీ ఇవ్వడం లేదు నాన్సెన్స్ అంటూ బెడ్ రూమ్‌లోకి వెళ్లిపోయింది. అప్పుడే వదలడం ఇష్టం లేదో ఏమో కానీ మళ్లీ అక్కడా ఎమోషనల్ డ్రామా మొదలుపెట్టింది. తనే అరిచి , తానే ఎడవటం మొదలుపెట్టింది. ప్రతిసారి ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్లు మాట్లాడుతోందని ట్యాప్ తప్పేయడంతో సీత, నిఖిల్‌లు ఆమెను ఓదారుస్తారు. మరి మంగళవారం నాటి ఎపిసోడ్‌లో ఏం జరిగిందో తెలియాలంటే కొద్దిగంటల వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











