Bigg Boss OTT లేటెస్ట్ అప్డేట్.. 'ఆ' రోజు నుంచే మొదలు.. సీజన్ 4 నుంచి 'ఆ' ఇద్దరు!

బిగ్ బాస్ షోకి తెలుగు లో ఎంత ఆదరణ దక్కుతుంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మిగతా అన్ని భాషల కంటే భిన్నంగా ఈ షో కి మంచి ఆదరణ లభిస్తుండడం తో షో నిర్వాహకులు కూడా సీజన్ జరిగిన వెంటనే మరో సీజన్ నిర్వహించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ ఫైవ్ ముగింపు వేడుకల్లో బిగ్ బాస్ ఓటీటీ కూడా నిర్వహిస్తున్నట్లు నాగార్జున స్వయంగా ప్రకటించారు. తాజాగా ఇప్పుడు ఈ సీజన్ కు సంబంధించిన కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆ వివరాలు

నాగార్జున హోస్ట్ గా

నాగార్జున హోస్ట్ గా

ఇప్పటికే బిగ్ బాస్ 5 ఫైనల్ స్టేజ్ మీద నుండే హోస్ట్ నాగార్జున అధికారికంగా ప్రకటించగా ఓటీటీకి కూడా ఆయనే హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ప్రముఖ బుల్లి తెర యాంకర్‌ ఓంకార్‌ కు చెందిన 'ఓక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌' సంస్థ ఈ ఓటీటీ షోను నిర్వహించనున్నట్లు చెబుతున్నారు. తాజా సమాచారం మేరకు ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ఈ షో మొదలు కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్లను ఖరారు చేసే పనిలో పడింది బిగ్ బాస్ యూనిట్.

ఫిబ్రవరి 15వ తేదీకి ఖరారు

ఫిబ్రవరి 15వ తేదీకి ఖరారు

ఫిబ్రవరి 15 నుంచే షోకి సంబంధించిన అందరూ కంటెస్టెంట్లను ఖరారు చేస్తారని, వారందరినీ ఆ రోజు నుంచే క్వారంటైన్ కూడా చేయబోతున్నారు అని తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు చాలామంది కంటెస్టెంట్ లను ఖరారు చేశారని పూర్తిస్థాయి లిస్ట్ ఫిబ్రవరి 15వ తేదీకి ఖరారు అయిపోవచ్చని తెలుస్తోంది. అయితే ఈసారి ఎక్కువ మంది మాజీ కంటెస్టెంట్లను తీసుకోబోతున్నట్లు కూడా చెబుతున్నారు.

ఏడుగురు మాజీ కంటెస్టెంట్ లు

ఏడుగురు మాజీ కంటెస్టెంట్ లు

దాదాపుగా ఏడుగురు మాజీ కంటెస్టెంట్ లు ఈసారి బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంటర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో బిగ్ బాస్ రన్నరప్ లుగా తేలిన అందరితో సంప్రదింపులు జరుపగా అందులో కొందరు షో మీద ఆసక్తి చూపించినట్లు సమాచారం.

బిగ్ బాస్ సీజన్ ఫోర్ రన్నరప్గా నిలిచిన అఖిల్ బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రదించగా షో కి ఎంట్రీ ఇచ్చేందుకు ఆయన ఒప్పుకున్నారు అని సమాచారం. అదే సీజన్ నుంచి అరియనా గ్లోరీ కూడా బిగ్ బాస్ ఓటీటీ ఎంట్రీ ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఢీ షో లో సుడిగాలి సుదీర్ ఎంట్రీ

ఢీ షో లో సుడిగాలి సుదీర్ ఎంట్రీ

నిజానికి బయటకు వచ్చాక కూడా చాలా కాలం పాటు ఖాళీగానే ఉన్న అఖిల్ సార్థక్ అడపాదడపా రియాలిటీ షోలలో మాత్రం కనిపిస్తే ఉండేవాడు. అయితే ఈ మధ్యనే అయిన సుడిగాలి సుదీర్ ప్లేస్లో ఢీ షో లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన బిగ్ బాస్ ఎంట్రీ ఖరారైన నేపథ్యంలో త్వరలో ఢీ షో లో సుడిగాలి సుదీర్ ఎంట్రీ కూడా ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే అఖిల్ సార్థక్ అగ్రిమెంట్ పూర్తయిందని తెలుస్తోంది.

Recommended Video

Bigg Boss Telugu 4 winner: Actor Abhijeet Duddala wins the trophy
ఈ నెల 27న

ఈ నెల 27న

మూలాల ప్రకారం బిగ్ బాస్ ఓటీటీ మొత్తం 12 వారాలు ఉంటుంది. చాలా మంది కంటెస్టెంట్లు మునుపటి సీజన్‌లకు చెందినవారని సీజన్ ఈ నెల 27న ప్రారంభమవుతుందని అంటున్నారు. క్వారంటైన్ 15వ తేదీ నుండి ప్రారంభమవుతుంది, జానీ ప్రతి పోటీదారునికి క్వారంటైన్ తేదీల మధ్య వ్యత్యాసం ఉండేలా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X