ఓ అబ్బాయి నాపైకి దూసుకొచ్చి దాడి.. నేను ఏం తప్పు చేశాను.. సోహెల్, మోనాల్‌పై బిగ్‌బాస్‌కు ఫిర్యాదు

బిగ్‌బాస్ ఇంటిలో సోహెల్, అరియానా గ్లోరి మధ్య భారీగా గొడవ జరిగింది. దాంతో ఇంటి వాతావరణం గంభీరంగా సాగింది. ఇక వైపు ఇంటి సభ్యులు రోబో టాస్క్ ఆడుతూనే.. మరో పక్క ఇద్దరి గొడవను ఆపేందుకు ప్రయత్నించారు. ఇలాంటి నేపథ్యంలో అరియానా తన బాధను బిగ్‌బాస్‌కు చెప్పుకొంటూ..

ఇలాంటి మాటలు ఎలా పడాలి అంటూ

ఇలాంటి మాటలు ఎలా పడాలి అంటూ

బిగ్‌బాస్ నేను తప్పు చేశానా? మీరు ఆట ఆడమంటారు. ఇలాంటి మాటలు ఎలా పడాలి. ఆ అమ్మాయి బిహేవియర్ తట్టుకోలేకపోతున్నాను. టాస్క్ ఆడకపోతే ఆడలేదంటారు. టాస్క్ ఆడితే దారుణంగా ఇలాంటి కామెంట్లు చేస్తారు. బెస్ట్‌గా పెర్ఫార్మ్ చేయడానికి ప్రయత్నించాను. అది నేను చేసిన తప్పా అంటూ అరియానా మండిపడ్డారు.

నేను టాస్క్ ఆడితే సమస్యగా

నేను టాస్క్ ఆడితే సమస్యగా

నేను కెప్టెన్సీ చేస్తే వీళ్లకు ప్రాబ్లెం. నేను టాస్క్ ఆడితే ప్రాబ్లం. ప్రతీ సారి నీకు హృదయం లేదు లేదు అంటూ నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఇలాగైతే నేను ఎలా ఆడను బిగ్‌బాస్. నేను ఏది చేసినా సమస్యగా మారుస్తున్నారు. ఇక అబ్బాయి నాపైకి, మీదకు వచ్చి దాడి చేసేంతగా ప్రవర్తిస్తున్నాడు. ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడే.. ఇలాంటి విషయాలు ఎలా భరించాలి. ఎలా చెప్పాలి అంటూ అరియానా కంటతడి పెట్టుకొన్నది.

సోహెల్, మోనాల్ అగ్రెసివ్ బిహేవియర్‌తో

సోహెల్, మోనాల్ అగ్రెసివ్ బిహేవియర్‌తో

సోహెల్ నుంచి వస్తున్న అగ్రెసివ్ బిహేవియర్‌ను తీసుకోలేకపోతున్నా బిగ్‌బాస్. నా బొమ్మ అంటూ నన్ను టార్గెట్ చేస్తున్నాడు. నా ఎమోషన్స్‌తో ఆడుకొంటున్నాడు. టాస్కులు మీరు ఇచ్చారు. నేను ఆడాను. నాకు బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ వచ్చాయి. ఇందులో తప్పేముంది. ఇంకా ఎలా ఆడాలి బిగ్‌బాస్ అంటూ అరియానా తన ఆవేదనను బిగ్‌బాస్‌కు వ్యక్తం చేసింది.

ఏడుపు ఆపుకోలేక నేలపైన పడి

ఏడుపు ఆపుకోలేక నేలపైన పడి

అరియానా ఏడుస్తూ బిగ్‌బాస్‌తో చెప్పుకొంటుంటే.. అభిజిత్ వచ్చి ఊరడించే ప్రయత్నం చేశాడు. దాంతో ఏమీ ఏడుపు ఆపుకోలేక నేల మీద పడిపోయింది. ఆ తర్వాత అభిజిత్‌ ఆమెను లేపేందుకు, సముదాయించేందుకు ప్రయత్నించాడు. అలానే కిందపడి కాసేపు ఏడుస్తూ తన బాధను చెప్పుకొన్నది.

Recommended Video

Nagarjuna Akkineni To Fans On Apple Products
అభిజిత్.. నా వల్ల కావడం లేదు అంటూ

అభిజిత్.. నా వల్ల కావడం లేదు అంటూ

అభిజిత్ సముదాయిస్తుంటే.. నా వల్ల కావడం లేదు అభిజిత్.. నేను ఈ ఆటను ఆడలేకపోతున్నాను. నేను బాధను భరించలేను. నేను ఏమన్నా దానిని సమస్య చేస్తున్నారు. నీ మీద పడిపోతున్నారు. నేను చాలా సార్లు బిగ్‌బాస్‌కు నా బాధ చెప్పుకొన్నాను. నా ఎమోషన్స్‌తో ఎందుకు ఇలా ఆడుకొంటున్నారు అని అభిజిత్‌తో అరియానా అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X