అరియానాను వెంటాడిన దురదృష్టం.. టాప్ 4తో సరిపెట్టుకొన్న బోల్డ్ బ్యూటీ
బిగ్‌బాస్ తెలుగు 4 గ్రాండ్ ఫినాలే ఎలిమినేషన్ ప్రక్రియను వినూత్నంగా చేపట్టారు. ఇంటి సభ్యులను ప్రలోభాలకు పెట్టి వారి సామర్థ్యాన్ని పరీక్షించారు. టాప్ 4 కంటెస్టెంట్ ఎలిమినేసన్ ప్రక్రియ సందర్భంగా నలుగురు కంటెస్టెంట్లకు అగ్ని పరీక్ష పెట్టారు. ఇంటి నుంచి అరియానా బయటకు ఎలా వెళ్లిపోయారు.. ఎలిమినేట్ ఎలా అయ్యారంటే..

టాప్ 4 కంటెస్టెంట్ ఎలిమినేషన్
బిగ్‌బాస్ తెలుగు 4 సీజన్‌లోని టాప్ 5 కంటెస్టెంట్లలో నాలుగవ కంటెస్టెంట్ ఎలిమినేషన్‌ను లక్ష్మిరాయ్, ప్రణీత చేతిలో పెట్టారు. డబ్బులతో ఉన్న సూట్‌కేస్‌తో ప్రణీత ఇంటిలోకి వెళ్లింది. ఆ తర్వాత అందులో 10 లక్షలు ఉన్నాయి. దానిని తీసుకొని మీరు ఎలిమినేట్ కావొచ్చు అని ప్రణిత సూచించింది.

10 లక్షల రూపాయల ఆఫర్
అయితే బిగ్‌బాస్ ఇచ్చిన 10 లక్షల రూపాయల ఆఫర్‌ను నలుగురు తిరస్కరించారు. దాంతో ప్రణిత ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇంటిలోకి లక్ష్మీరాయ్‌ను పంపించి ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించారు.

లక్ష్మీరాయ్ చేతుల మీదుగా ఎలిమినేషన్
నలుగురు సభ్యులు ఆఫర్ తిరస్కరించడంతో ఎలిమినేషన్ ప్రక్రియను లక్ష్మీరాయ్ ప్రారంభించారు. ట్రాఫిక్ సిగ్నల్ లైట్ ద్వారా ఎలిమినేషన్ ప్రక్రియను మొదలుపెట్టారు. రెడ్ సిగ్నల్ వెలిగితే.. సేఫ్.. గ్రీన్ సిగ్నల్ వెలిగితే ఎలిమినేషన్ అంటూ గేమ్ రూల్ చెప్పారు.

ఫస్ట్ రౌండ్‌లో అభిజిత్; అఖిల్
లక్ష్మీరాయ్‌తో ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. బజర్ లైట్‌ను నొక్కిన తర్వాత ఇంటి సభ్యులు ఓ టేబుల్‌పై నిలుచోవాలి. తొలుత అభిజిత్ టేబుల్ పైకి రాగా రెడ్ లైట్ వచ్చింది. ఆ తర్వాత అఖిల్ వచ్చి టేబుల్ పై నిలచుకోగా రెడ్ లైట్ వెలగడంతో సేఫ్ అయ్యారు.

అరియానా గ్లోరి ఎలిమినేషన్ ఇలా
అభిజిత్, అఖిల్ సేఫ్ అయిన తర్వాత అరియానా టేబుల్‌పైకి వచ్చింది. ఆమె నిలుచున్న తర్వాత లక్ష్మీరాయ్ బజర్ నొక్కగానే గ్రీన్ లైట్ వెలిగింది. దాంతో ఆమె ఎలిమినేట్ అయినట్టు నాగార్జున ప్రకటించారు. దాంతో బిగ్‌బాస్‌లో అరియానా గ్లోరి ప్రయాణం ముగిసింది.
Recommended Video

దురదృష్టం వెంటాడిందనే కామెంట్
ఇక అరియానా గ్లోరి టాప్ 3లో ఉంటారనే ప్రచారం జరిగింది. ఒక దశలో రన్నరప్ అనే టాక్ కూడా సోషల్ మీడియాలో వినిపించింది. అయితే పది లక్షల రూపాయలు తీసుకొని ఉంటే అదృష్టం దక్కేదనే మాట కూడా వినిపించింది. టాప్ 2లో లేకపోవడం అరియానాను దురదృష్టం వెంటాడిందనే మాట వినిపించింది.


Click it and Unblock the Notifications











