ఆ పరిస్థితుల్లో అలాంటి బెడ్రూంలో నా లైఫ్.. నేను అలాంటి దానినే.. అరియానా కంటతడి
బిగ్‌బాస్ ఇంటిలోకి అనామకురాలిగా ప్రవేశించిన అరియానా గ్లోరి 14 వారాల తర్వాత సెలబ్రిటీగా మారారు. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకొన్నారు. అందం, ఆటతీరుతో ఆకట్టుకొంటూ ఇంటిలో ఎన్నో అవరోధాలను ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో మరోసారి తన గోడును బిగ్‌బాస్‌కు చెప్పుకొంటూ ఎమోషనల్ అయ్యారు. అరియానా ఏమన్నారో ఆమె మాటల్లోనే..

నా మొదటి జీతం 4 వేలు
నా లైఫ్ చాలా చిన్నగా మొదలైంది. నా మొదటి జీతం రూ.4 వేలు. ఆ తర్వాత చాలా కష్టపడ్డాను. అలా కష్టపడటం వల్లే నేను బిగ్‌బాస్ షోకు రావడం జరిగింది. నేను ఎంత సంపాదించుకొన్నా దాంతో హ్యాపీగా ఉన్నాను. నేను ఎప్పుడూ పాపులారిటీ గురించి నేను ఆలోచించలేదు. ప్రామిస్. నాకు బిగ్‌బాస్ టైటిల్ కావాలంటే.. దాని కోసం ప్రయత్నిస్తున్నాను అని అన్నారు.

నన్ను ఎలా బోల్డ్ అనుకొన్నారో..
బిగ్‌బాస్ తెలుగు చరిత్రలో తొలి కంటెస్టెంట్ కావాలని కోరుకొన్నాను. అది జరుగుతుందో లేదో నేను ఆలోచించడం లేదు. మీరు నన్ను ఎలా బోల్డ్ అనుకొన్నారో.. ఎలా ఇండిపెండెట్ ఉమెన్ అనుకొన్నారో తెలియదు. కానీ నేనేంటో నాకు తెలుసు. నా గురించి తెలుసుకొని నన్ను నన్నుగా ప్రేక్షకులకు పరిచయం చేశారు. దానికి నిజంగా థ్యాంక్స్ అంటూ అరియానా చేతులు ఎత్తి దండం పెట్టింది.

నేను ఈ ఇంటికి అర్హురాలినేనా
బిగ్‌బాస్ ఇంటిలో ఉన్న తర్వాత అప్పుడు నాకే కొన్ని సందేహాలు వస్తుంటాయి. నేను ఈ ఇంటికి అర్హురాలినా అనే అనుమానం వస్తుంది. నా లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయిందో నాకు తెలుసు. నేను సింగిల్ బెడ్రూంలో ఎలాంటి పరిస్థితుల్లో జీవితాన్ని అనుభవించానో నాకు తెలుసు. కొన్నిసార్లు ఒక ప్రాంతానికి వెళ్లడం కోసం స్కూటి లేకపోవడం ఏం చేశానో నాకు తెలుసు అంటూ అరియానా కంటతడి పెట్టింది.

14 వారాలపాటు మహారాణిగా
నా జీవితంలో ఎన్నో కష్టాలు, అవమానాలకు గురైన ఇలాంటి పరిస్థితి నాకు ఎదురైంది. అలాంటి జీవితం నుంచి 14 వారాలపాటు ఈ ఇంటిలో ఉన్నానంటే నాకు నమ్మబుద్ది కావడం లేదు. మహారాణిగా ఇంట్లో ఉన్నాను. ఇలాంటి రాజభోగాలు అనుభవిస్తుండటం చూసి నేనేనా అనే ఫీలింగ్ కలుగుతుంది అని అరియానా ఎమోషనల్ అయ్యారు.
Recommended Video

రాజభవనంలో ఉండాలనే కోరికతో
నా జీవితంలో కష్టాలు పడే సమయంలో నేను రాజభవనంలో ఉండాలనే కోరిక కలిగేది. ఆ కోరిక నాకు బిగ్‌బాస్ ఇంటిలో ఉండటం ద్వారా కలిగింది. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ ఇంటి నుంచి ఎప్పుడు బయటకు వెళ్లినా నేను మీకు రుణపడి ఉంటాను అని అరియానా చేతుల జోడించి భావోద్వేగానికి లోనయ్యారు.


Click it and Unblock the Notifications











