కింద మీద ఊపు.. అరియానా తోపు.. బోల్డ్ బేబీకి స్వాగతం.. పార్టీలో స్పెషల్ గెస్టుగా అవినాష్
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4లో విజయవంతంగా తన ప్రయాణాన్ని ముగించుకొని బయటకు వచ్చిన అరియానా గ్లోరికి తన స్నేహితులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, అభిమానులు ఘనంగా స్వాగతం తెలిపారు. డిసెంబర్ 20వ తేదీన గ్రాండ్ ఫినాలే ముగిసిన తర్వాత ఇంటికి చేరుకొన్న అరియానాకు ఊహించని స్పందన వ్యక్తమైంది. ఈ క్రమంలో అరియానాకు ఎలాంటి స్వాగతం లభించిందంటే..

మూడున్నర నెలల తర్వాత ఇంటికి
బిగ్‌బాస్ ఆఫర్ లభించిన తర్వాత దాదాపు మూడున్నర నెలల తర్వాత అరియానా ఇంటికి చేరుకొన్నది. తన ఫ్లాట్‌కు అరియానా చేరుకోగానే అందరూ తీన్మార్ డ్యాన్సులతో స్వాగతం పలికారు. ఇంటిని దీపాలతో అందంగా అలకరించి వెల్‌కమ్ తెలిపారు. ఈ సందర్బంగా అరుపులు, కేరింతలు ఓ రేంజ్‌లో వినిపించాయి.

అరియానా తోపు అంటూ
ఇక అరియానా ఇంటికి రాగానే కింద మీద ఊపు.. అరియానా తోపు.. అరియానాకు జై భోలో.. గుంతలకడిడి గుల గుల.. ఊ..హా ఊ.హా, అరియానా అరియానా నీతో పెట్టుకొంటే.. అందరికి తందాన అంటూ నినాదాలు చేశారు. తనకు గ్రాండ్‌గా స్వాగతం చెప్పినందుకు ఆనందంలో మునిగిపోయారు.

అవినాష్ సపోర్టు మాటల్లో చెప్పలేను
ఇంటికి చేరుకోగానే అరియానా ఎమోషనల్ అయ్యింది. ఇంటి సభ్యులందరూ నామినేట్ చేయడంతో నేను ఇంటిలో ఒత్తిడికి గురయ్యాను. ఆ సమయంలో నాకు అవినాష్ చాలా సపోర్ట్ చేశాడు. ఈ సందర్భంగా అవినాష్‌ను పార్టీకి గెస్టుగా పిలిచారు. ఈ వేడుకల్లో అవినాష్‌తో ఆమె స్నేహితులు పాల్గొన్నారు.
Recommended Video

అవినాష్ చేతుల మీదుగా కేక్ కటింగ్
అరియానా ఇంటికి చేరుకొన్న సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో కేక్ కట్ చేశారు. అవినాష్ చేతుల మీదుగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అరియానా సో కూల్ అంటూ అవినాష్ అనగానే... సీరియస్లీ అంటూ అరియానా కామెంట్ చేయగానే అందరూ కేరింతలతో ఆనందంలో మునిగిపోయారు.


Click it and Unblock the Notifications











