కెప్టెన్‌గా అరియానా.. ఇంట్లో చిచ్చు పెట్టిన మోనాల్.. హారిక, అమ్మా రాజశేఖర్ ఫైర్

బిగ్‌బాస్ తెలుగు షోలో 52వ రోజు ఇంటిలో జరిగిన కెప్టెన్సీ టాస్క్ గందరగోళం రేపింది. కెప్టెన్సీ టాస్క్‌లో జరిగిన డిస్కషన్ హారిక, మోనాల్ మధ్య గొడవకు దారి తీసింది. అలాగే ఇంటి సభ్యుల మద్య కెప్టెన్సీ చిచ్చు పెట్టగా.. మరోవైపు నోయల్ సీన్ అనారోగ్యంతో ఇంటి నుంచి బయటకు వెళ్లడం ఎపిసోడ్‌లో ప్రధాన అంశాలుగా మారాయి. ఇంకా ఏం జరిగిందంటే...

ఆడవాళ్ల కోసం మగ కంటెస్టెంట్లు

ఆడవాళ్ల కోసం మగ కంటెస్టెంట్లు

బిగ్‌బాస్ ఇంటిలో కెప్టెన్సీ ఆసక్తికరంగా సాగింది. ఆడవాళ్లకు మాత్రమే అంటూ ఇంటి సభ్యులకు టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ ప్రకారం మగ కంటెస్టెంట్స్ మాత్రమే పాల్గొనాలి. ఈ టాస్క్ గేమ్ రూల్ ప్రకారం.. ఒక టేబుల్ పెట్టి.. దానిపై తాళం చేయి పెట్టారు. మగ కంటెస్టెంట్లందరూ దాని చుట్టూ అందరూ నిలబడి.. బజర్ మోగగానే తాళం చెవిని చేజిక్కించుకోవాలి అని బిగ్‌బాస్ ఆదేశాలిచ్చారు.

తాళం చేవి చేజిక్కించుకొన్న అఖిల్

తాళం చేవి చేజిక్కించుకొన్న అఖిల్

బిగ్‌బాస్ చెప్పిన ప్రకారం ఇంటిలోని మగ సభ్యుల టేబుల్ చుట్టూ ఉండి బజర్ రాగానే తాళాన్ని పట్టుకొనేందుకు ట్రై చేశారు. మొదటి ప్రయత్నంలో అఖిల్‌కు తాళం లభిస్తే.. మెనాల్‌కు ఇచ్చాడు. మోనాల్ తాళం తీసుకొని చెట్టుపై ఉన్న హారిక బొమ్మతో యాపిల్‌ను కట్ చేసింది. దాంతో కెప్టెన్సీ రేసును నుంచి హారిక బయటకు వెళ్లింది.

అరియానాకు మెహబూబ్, అమ్మా రాజశేఖర్‌ తాళం

అరియానాకు మెహబూబ్, అమ్మా రాజశేఖర్‌ తాళం

ఆ తర్వాత రెండో ప్రయత్నంలో మెహబూబ్‌కు తాళం లభిస్తే.. అరియానాకు ఇవ్వగా.. చెట్టుపై ఉన్న లాస్య బొమ్మ యాపిల్‌ను ముక్కలు చేసింది. దాంతో లాస్య కెప్టెన్సీ టాస్క్ నుంచి బయటకు వెళ్లింది. ఆ తర్వాత మూడో ప్రయత్నంలో తాళం అమ్మా రాజశేఖర్‌ చేతికి రావడంతో మళ్లీ అరియానాకు ఇచ్చాడు. దాంతో మోనాల్ కెప్టెన్సీ రేసు నుంచి బయటకు వెళ్లింది.

కెప్టెన్‌గా అరియానా..రేషన్ మేనేజర్‌గా మోనాల్

కెప్టెన్‌గా అరియానా..రేషన్ మేనేజర్‌గా మోనాల్

ఆడవాళ్లకు మాత్రమే కెప్టెన్సీ టాస్క్‌లో అవినాష్, అమ్మా రాజశేఖర్ నుంచి రెండు ఓట్లు పడటంతో అరియానా కెప్టెన్‌గా ఎంపికైంది. రేషన్ మేనేజర్‌గా మోనాల్ నియమించుకోవడం వివాదంగా మారింది. మోనాల్‌ను వ్యతిరేకించి నీకు ఓటు వేస్తే నీవు ఆమెను రేషన్ మేనేజర్‌గా నియమిస్తావా అంటూ అరియానాపై అమ్మా రాజశేఖర్ ఫైర్ అయ్యారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : Ariyana Glory Glamour Show చీరకట్టులో అరియానా గ్లోరి అందాల ఆరబోత...!!
ఇంట్లో చిచ్చు రేపిన మోనాల్

ఇంట్లో చిచ్చు రేపిన మోనాల్

మోనాల్ గజ్జర్‌ను రేషన్ మేనేజర్‌గా నియమించడంపై ఇంట్లో గందరగోళం నెలకొన్నది. అమ్మా రాజశేఖర్ కోపంతో ఊగిపోవడంతో ఆయనను సముదాయించేందుకు అవినాష్, మెహబూబ్ ప్రయత్నించారు. ఆ విషయంలో అరియానా, మోనాల్ మధ్య, అలాగే అరియానా, అమ్మా రాజశేఖర్ మధ్య గొడవ జరిగింది. దాంతో అరియానా అలిగి బయటకు వెళ్లి కూర్చొని బాధ పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X