డబుల్ గేమ్ ఆడకు.. అలా వెన్నుపోటా? మెహబూబ్, అఖిల్‌ను దుమ్మ దులిపిన అరియానా
బిగ్‌బాస్ ఇంటిలో ఎనిమిదో వారానికి నామినేషన్ల ప్రక్రియ గరం గరంగా సాగింది. ఇంటి సభ్యుల ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకొంటూ కనిపించారు. గతవారం నామినేషన్ ప్రక్రియ, టాస్కుల విషయాల ఆధారంగా ఒకరిపై మరొకరు కత్తులు దూసుకొన్నారు. ఈ క్రమంలో నామినేషన్ ప్రక్రియతో ఇంటి వాతావరణం వేడెక్కింది. నామినేషన్ ప్రక్రియ సందర్భంగా తనను నామినేట్ చేసిన మెహబూబ్‌ను రఫ్ ఆడిస్తూ మాటలతో దాడి చేసింది. మెహబూబ్ తీరును అరియానా ఎండగడుతూ ఏమన్నారంటే..

మన మధ్య సమస్యలు పరిష్కరించుకొవాలంటూ
మెహబూబ్.. నన్ను నామినేట్ చేస్తూ సారీ చెప్పావు బాగానే ఉంది. కానీ మన మధ్య విభేదాలను పరిష్కరించుకోవాలనుకొనే వాడిని నామినేట్ చేసి బయటకు పంపించేలా చేస్తావా? లేక ఇంట్లోనే ఉంటూ మన మధ్య ఉన్న ఇష్యూస్‌ను సాల్వ్ చేసుకొందామనుకొంటారా? ప్రపంచంలో ఇలా ఎక్కడైనా జరుగుతుందా? అని మెహబూబ్‌ను ఘాటుగా అరియానా నిలదీసింది.

నీ హెల్ప్ ఎందుకు తీసుకోనంటే
అంతటితో అరియానా ఆగకుండా.. నేను లాస్ట్ టైమ్ నామినేట్ అయ్యాను సరే. ఫర్వాలేదు. నాకు కెప్టెన్సీ టాస్క్ వచ్చింది. నీ హెల్ప్ వద్దని అన్నాను. దానికి ఒకటే కారణం. ఇప్పుడు నేను ప్రాబ్లెంలో ఉంటే హెల్ప్ చేయలేదు. ఇక ముందు నీ సహాయం ఎందుకు అనే కారణంతోనే నీ హెల్స్ తీసుకోలేదు. దానిలో ఎలాంటి ప్రాబ్లెం లేదు అని అన్నారు.

అవినాష్ స్ట్రాంగ్ అంటూనే
నామినేషన్ ప్రక్రియ తర్వా త కెప్టెన్సీ టాస్క్ వచ్చింది. అందులో అవినాష్ స్ట్రాంగ్ అని ఇంటి సభ్యుడితో చెప్పి నాకు ఎందుకు హెల్ప్ చేశావు. నేను స్ట్రాంగ్‌గా ఉన్నావు అంటూనే వేరే వ్యక్తితో నన్ను పోల్చుతావా? నీవు నమ్మావు అని చెబుతూ మనసులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకలా ప్రవర్తిస్తూ చేసే హెల్ప్ ఒకటేనా? అంటూ అరియానా ప్రశ్నల వర్షం కురిపించింది.

నేను కెప్టెన్ కావాలని అనుకొన్నప్పుడు
అవినాష్ నా కంటే బెటర్ క్యాండిడేట్ అనుకొని.. కంపారిజన్ చేయడం ఎందుకు? నేను కెప్టెన్ కావాలనుకొన్నప్పుడు నా గురించి మరొకరితో ముడిపెడుతూ డిస్కషన్ చేయడం సరైనదా? ఇలా అక్కడో మాట.. ఇక్కడో మాట చెబుతూ హెల్ప్ పేరుతో నాటకం ఆడుతున్నావు అనే విధంగా అరియానా ఫైర్ అయ్యారు. ఇలా అరియానా మాట్లాడుతున్న సేపు మెహబూబ్ బిక్కముఖం వేసుకొని నిలుచుకొన్నారు.

నేను ఎన్నిసార్లు కాంప్రమైజ్ కావాలి చెప్పు..
ఎన్ని విషయాల్లో నీతో నేను కాంప్రమైజ్ కావాలి? క్లియర్ కావాలి అంటూ ప్రతీసారి నీవు నామినేట్ చేస్తూ బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నావు? ఇట్లానే క్లారిటీ ఇవ్వాలని అంటూ.. సారీ చెప్పు.. నామినేట్ చేయి. కానీ ఇలాంటి ప్రవర్తన కారణంగా నాకు నీవు డబుల్ గేమ్ ఆడుతున్నావు అనిపిస్తుంది. తప్పుకుండా అది డబుల్ గేమ్ అంటూ మెహబూబ్‌పై విరుచుకుపడింది.
Recommended Video

నీకు అంత ఆవేశం ఎందుకు
ఇక నామినేషన్ ప్రక్రియలో అఖిల్‌ను నామినేట్ చేస్తూ.. నీవు అనవసరంగా కోపం తెచ్చుకొంటున్నావు? అది కంట్రోల్ చేసుకొంటే మంచిది. గతంలో పలుమార్లు గొంతు చించుకొని అరిచావు. ఇప్పుడు అమ్మా రాజశేఖర్‌తో మాట్లాడుతున్నప్పుడు లైన్ దాటి ఆవేశంతో ముందుకొచ్చావు. ఇలాంటివి ఇంట్లో మానుకో. అలా చేస్తే చాలా బాగుంటుంది అని అరియానా అన్నారు. ఆ తర్వాత అఖిల్‌ను నామినేట్ చేసింది.


Click it and Unblock the Notifications











