అభిజిత్ కోసం దారుణమైన త్యాగానికి సిద్ధపడిన అరియానా.. సీజన్ మొత్తానికి కఠినమైన నిర్ణయం
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కోసం తీవ్రంగా ప్రయత్నించిన అరియానా గ్లోరి చివరకు రేషన్ మేనేజర్ పదవితో సంతృప్తి పడాల్సి వచ్చింది. అయితే రేషన్ మేనేజర్‌గా నియమితులైన గంట్లోనే అరియానాకు బిగ్‌బాస్ గట్టి షాక్ ఇచ్చారు. వారం రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులు, సరుకుల విషయంలో అరియానా కఠినమైన నిర్ణయం తీసుకొనేందుకు ప్రయత్నించారు. కానీ అరియానా త్యాగానికి బిగ్ బాస్ ఎలాంటి బ్రేక్ వేశారంటే..

అభిజిత్ బట్టల సూట్‌కేసును
గతవారం టాస్క్ సందర్భంగా అభిజిత్ ఇంటి సభ్యుల కోసం కఠిన నిర్ణయం తీసుకొన్నారు. తనకు సంబంధించిన బట్టలన్నింటిని బిగ్‌బాస్‌కు ఇచ్చేశారు. అప్పటి నుంచి ఒకటే డ్రస్‌తో ఇంటిలో కొనసాగుతుంటే.. తొటి కంటెస్టెంట్ల డ్రస్సులతో కాలం వెళ్లదీస్తున్నాడు. అప్పుడప్పుడు తన సూట్‌కేసును తిరిగి పంపించండి అంటూ వేడుకొంటున్నారు.

రేషన్ మేనేజర్‌గా అరియానాకు షాక్
ఈ క్రమంలో అవినాష్ కెప్టెన్సీగా ఎన్నిక కావడంతో తనకు సహాయంగా ఉండటానికి అరియానాను రేషన్ మేనేజర్‌గా నియమించుకొన్నాడు. రేషన్ మేనేజర్ ఎంపికపై అరియానాను ఇంటి సభ్యులు అభినందించారు. ఆ తర్వాత వెంటనే స్టోర్ రూమ్‌లోకి పిలిచి రేషన్‌తోపాటు బట్టల ఉన్న అభిజిత్ సూట్‌కేసును ఆమె ముందు పెట్టారు.

సీజన్ మొత్తానికి నేను అలా చేస్తానంటూ అరియానా
అరియానా ముందు రేషన్, అభిజిత్ బట్టల సూట్‌కేస్ పెట్టడంతో ఆమె ఓ నిర్ణయానికి వచ్చారు. బిగ్‌బాస్ అభిజిత్‌కు బట్టలు తిరిగి ఇచ్చేయండి. అందుకు ప్రతిఫలంగా సీజన్ మొత్తానికి తన బట్టలు మీకు ఇచ్చేస్తాను అంటూ అరియానా ఓ ప్రపోజల్ పెట్టారు. అయితే తాను ఇచ్చిన ఆదేశాల్లో ఒకటి అనుసరించాలని బిగ్‌బాస్ షాక్ ఇచ్చాడు.

అరియానా నిర్ణయంపై హర్షం
అయితే ఇంటి సభ్యులు మాత్రం అరియానా త్యాగానికి సిద్దపడటంపై హర్షం వ్యక్తం చేశారు. కఠినమైన నిర్ణయానికి సిద్దపడటంపై పలువురు ప్రశంసిస్తే.. కొందరు నిత్యావసర వస్తువులు లేకుండా ఎలా బతుకుతాం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితిలు మధ్య అరియానా మనసు మార్చుకొని అభిజిత్‌కు సహాయం చేయలేకపోతున్నానే బాధను వ్యక్తం చేసింది.
Recommended Video

బిగ్‌బాస్ ఒప్పుకోకపోవడంతో అరియానా యూటర్న్
అభిజిత్ బట్టలు లేకున్నా పెద్దగా ఇబ్బంది కాదు. ఇంటి సభ్యులకు నిత్యావసర వస్తువులు, సరుకుల అవసరం కాబట్టి.. రేషన్‌ను తీసుకొంటానని బిగ్‌బాస్‌కు చెప్పింది. ఆ తర్వాత రేషన్ తీసుకొని ఇంటిలోకి వచ్చారు. అయితే అరియానా చేసిన ప్రయత్నాన్ని అందరూ స్వాగతించారు. అలా అరియానా ఇంటి సభ్యులు ప్రేమను పొందేందుకు ప్రయత్నించడం కూడా ఎపిసోడ్‌లో ఫీల్‌గుడ్ ఫ్యాక్టర్‌గా మారింది.


Click it and Unblock the Notifications











