జీవితాంతం అవినాష్‌తో ఆ బంధం.. నాకు వేరే అతడితో రిలేషన్.. అఫైర్‌ను బయటపెట్టిన అరియానా
దసరా సందర్భంగా బిగ్‌బాస్ వేదికపైకి డిటెక్టివ్ పాత్రతో హైపర్ ఆది ఎంట్రీ ఇచ్చాడు. సమంతతో కలిసి వేదికపై నుంచి ఇంటి సభ్యులతో మాట్లాడారు. అందులో భాగంగా అరియానాతో జరిగిన సంభాషణ ఆసక్తి కరంగా మారింది. అవినాష్‌తో లింకు పెట్టడానికి ప్రయత్నించగా తన అఫైర్ గురించి బయటపెట్టి హైపర్ ఆదికి షాకిచ్చింది. హైపర్ ఆదితో తన బాయ్‌ఫ్రెండ్ గురించి అరియానా ఏం చెప్పారంటే..

అవినాష్ హర్ట్ అయ్యాడని
అరియానాతో హైపర్ ఆది మాట్లాడుతూ.. నన్ను కూడా పొగరు అంటావా? అని సోహైల్‌తో జరిగిన సంఘటనను గుర్తు చేశారు. నీపై అఖిల్ చేయి వేస్తే అవినాష్ తట్టుకోలేకపోయాడు. వెంటనే మోనాల్‌పై చేయి వేసి అవినాష్ అఖిల్ షాకిచ్చాడు. నీవంటే అంత ప్రేమనా అని అన్నాడు. ఔను అవినాష్ అలా చేశాడంటూ సిగ్గుపడిపోయింది అరియానా.

అవినాష్ రోజుకు ఒకరు పడుతారు
అరియానా నీకు అవినాష్ పడిపోయాడా? అని హైపర్ ఆది అంటే... లేదండి.. ఆయన రోజుకోకరికి పడిపోతాడు. ఒకరోజు ఒకరితో మరో రోజు ఒకరితో అంటూ అరియానా ఏదో చెప్పబోయింది. ఆమె మాటలను కట్ చేస్తూ నీవు అర్జీవినే పడేశావు.. అవినాష్ ఒక లెక్కనా అంటూ హైపర్ ఆది కౌంటర్ ఇచ్చాడు.

అద్దంలో ముఖం ఎప్పుడైనా
అరియానాను ఆటపట్టిస్తూ.. షూటింగు సమయంలో అవినాష్‌ను ఉద్దేశించి నీవు నాకు జోడి ఏంటి.. ఎప్పుడైనా అద్దంలో చూసుకొన్నావా. నీవు నా ముందు ఎంత అంటూ మనసులో మాట నిజం చెప్పావా అంటే.. లేదు లేదు అవినాష్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు అలాంటి అభిప్రాయం లేదు. అవినాష్‌తో మంచి రిలేషన్ ఉంది అంటూ అరియానా క్లారిటీ ఇచ్చింది. దాంతో అవినాష్‌కు ఏం తక్కువ అంటూ ఆదిని సమంత ప్రశ్నించింది.

వేరే పనులకు వేరే వాళ్లు ఉన్నారు
బిగ్‌బాస్ హౌస్‌లో నాతో గొడవ పడకపోతే అవినాష్ నాకు జీవితాంతం బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు అని అరియానా అంటే.. కేవలం ఫ్రెండేనా అంటూ ఆది ప్రశ్నను సాగదీశాడు. అందుకు అరియానా బదులు ఇస్తూ.. అలాంటి పనులకు బయట వేరే వాళ్లు ఉన్నారు. నాకు బయట అఫైర్ ఉంది అంటూ అరియానా క్లారిటీ ఇచ్చింది.

నేను అందంగా లేనా?
అరియానా ఇచ్చిన ఝలక్‌తో నీకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా? అంటే.. నాకు బాయ్‌ఫ్రెండ్ ఉండరా? నేను అందంగా లేనా? నన్ను ఇష్టపడే వాళ్లు ఉండరా అంటూ అంటూ అరియానా అనగానే.. అవును అరియానాకు ఏం తక్కువ అంటూ సమంత సపోర్ట్ చేసింది. దాంతో అరియానా హ్యాపీగా ఫీలైంది.


Click it and Unblock the Notifications











