అరియానా గ్లోరి అందాల ఆరబోత.. బిగ్‌బాస్ బ్యూటీ రెమ్యునరేషన్ ఎంతంటే!
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 షోలో గ్లామర్‌తో ఆకట్టుకొంటున్న సెలబ్రిటీ అరియానా గ్లోరి. ప్రతీ వారానికి తన రేంజ్‌ను పెంచుకొంటూ ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంట్లో అరియానా గ్లోరి వేస్తున్న అడుగులు, రియాక్ట్ అవుతున్న తీరు ఇప్పుడు బిగ్‌బాస్ షో అభిమానుల్లో చర్చకు దారి తీస్తున్నది. అయితే ఈ క్రమంలో అరియానా గ్లోరి రెమ్యునరేషన్ విషయం లీక్ కావడంతో మరింత ఆసక్తి పెరిగింది. బిగ్‌బాస్ షోలో పాల్గొన్నందుకు అరియానాకు ఎంత వస్తుందంటే..
Recommended Video

అరియానా మెచ్చురిటీతో గేమ్ ప్లాన్
బిగ్‌బాస్ హౌస్‌లో అరియానా గ్లోరి మాట్లాడే తీరు చిన్న పిల్లలా అనిపించినప్పటికి.. తన తోటి కంటెస్టెంట్ దేవీ నాగవళ్లితో టైటిల్ గురించి చర్చించిన తర్వాత ఆమెలో మెచ్యురిటీ స్పష్టంగా కనిపించింది. సీజన్ 4లో టైటిల్ ఉమెన్ కంటెస్టెంట్‌కే దక్కాలి. అది నీకైనా లేదా నాకైనా రావాలి అంటూ అరియానా గ్లోరి చెప్పడం ఆమె స్ట్రాటజీని బయటపెట్టింది.

పొట్టి దుస్తులతో ఆకట్టుకొంటూ
ఇక అరియానా గ్లోరి వేసుకొనే దుస్తులు, అనుసరించే ఫ్యాషన్ ఇంటి సభ్యుల్లోనూ చర్చకు దారి తీస్తున్నదనే విషయం స్పష్టమైంది. ఆమె ధరించే కురుచ దుస్తులు, కనిపించే విధానంపై ఆమెకు స్పష్టమైన అవగాహన ఉందనే విషయం దేవీ ఇటీవల చెప్పారు. అరియానా ఒకరి కోసం తన ప్రవర్తనను మార్చుకోదు. తనకు నచ్చినట్టు ఉండటమే ఆమె విధానం అని దేవీ పేర్కొన్నడం తెలిసిందే.

నాలుగో వారంలో స్ట్రాటీజ్ మార్చి
గత మూడు వారాల్లో తన గేమ్‌ను లో ప్రొఫైల్‌లో ఆడిన అరియానా నాలుగో వారంలో విభిన్నంగా కనిపిస్తున్నది. నాలుగో వారంలో సేఫ్ జోన్‌లో ఉండటంతో ఆమె తన గేమ్ స్ట్రాటెజీని కొత్తగా ప్లాన్ చేసుకొనే విషయం స్పష్టంగా కనిపించింది. ఇంట్లో మోనాల్, అఖిల్ లవ్ గేమ్‌కు ధీటుగా మరో లవ్ ట్రాక్‌ను రెడీ చేస్తున్నట్టు కనిపిస్తున్నది.

అవినాష్‌తో లవ్ ట్రాక్
ఇంటిలో చాలా హుషారుగా కనిపించే అవినాష్‌ను అరియానా లవ్ ట్రాక్‌లోకి దింపేందుకు ప్రయత్నిస్తున్నది. పలుమార్లు తనను ఫ్లర్ట్ చేసేందుకు చిలిపిగా అస్త్రాలను విసురుతున్నది. అయితే అవినాష్ మాత్రం చాలా ఆచితూచీ వ్యవహరిస్తున్నాడు. ఇలా అరియానా తన గేమ్‌ను డిఫరెంట్‌గా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజా ఎపిసోడ్‌లో అవినాష్ గేమ్ ప్లాన్‌ను సెట్ చేసేందుకు ప్రయత్నించడం ఆమె పరిణతికి అద్దం పట్టింది.

ఫ్యాషన్‌లో అందాల అరబోత
ఇక శుక్రవారం జరిగిన 26 రోజు ఎపిసోడ్‌లో చీరకట్టుతో అరియానా ఆకట్టుకొన్నారు. ఫ్యాషన్ షోలో ఆమె తన అందాలను ఆరబోశారు. విభిన్నమైన హావభావాలతో ఆకట్టుకొన్నారు. ముఖ్యంగా అవినాష్‌తో చేసిన చిలిపి పనులు ప్రేక్షకులను ఆకర్షించే విధంగా కనిపించాయి. ఇలా అందం, అభినయంతో తన గేమ్‌ప్లాన్ రెడీ చేసినట్టు కనిపిస్తున్నది.

బిగ్‌బాస్‌లో రెమ్యునరేషన్ ఇదే
ఇక బిగ్‌బాస్‌లో అరియానా గ్లోరి పాల్గొనందుకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సీజన్ 4లో పాల్గొన్నందుకు అరియానాకు వారానికి చొప్పున పారితోషికాన్ని ఫిక్స్ చేసినట్టు తెలింది. వారానికి లక్షకుపైగానే రెమ్యునరేషన్ అందుకొంటున్నట్టు స్పష్టమైంది. అయితే అరియానా ఆదాయం వారానికి లక్షకుపైనే ఉంటుందనే ఓ అంచనాకు వచ్చింది.


Click it and Unblock the Notifications











