Sixth Sense 4 అరియానా గ్లోరితో సయ్యద్ సోహైల్ ర్యాన్ రొమాన్స్.. హరికతో మెహబూబ్ జోష్‌గా
యాంకర్, సినీ డైరెక్టర్ ఓంకార్ వరుస షోలతో తెలుగు బుల్లితెరపై హల్‌చల్ సృష్టిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే డ్యాన్సీ ప్లస్ షో ఫైనల్స్ ముగించిన ఆయన మరో షోతో ముందుకొచ్చారు. ఇప్పటికే సిక్త్ సెన్స్ మూడు సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసిన ఓంకార్ నాలుగో సీజన్‌తో సిద్దమయ్యారు.
Recommended Video

ఓంకార్ షోలో బిగ్‌బాస్ కంటెస్టెంట్లు
ఒక ఎపిసోడ్‌లో హైపర్ ఆది, అనసూయలతో హంగామా చేసిన ఈ టాప్ యాంకర్.. ఇప్పుడు బిగ్‌బాస్ తెలుగు 4 టీమ్‌తో సందడి చేసేందుకు సిద్దమయ్యారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో ఆకట్టుకొంటున్నది. తాజా ఎపిసోడ్‌లో సయ్యద్ సోహైల్, మెహబూబ్, అరియానా గ్లోరీ, దేత్తడి హారిక పాల్గొన్నారు.

అల్లు అర్జున్, పూజా హెగ్డే పాటకు
ఇక ఈ షోలో ఎంట్రీ సాంగ్‌తోనే ఈ నలుగురు అదరగొట్టినట్టు కనిపించింది. అల్లు అర్జున్, పూజా హెగ్డే రొమాంటిక్ సాంగ్.. సామజవరగమన పాటకు మరింత రొమాంటిక్ స్టెప్పులు వేశారు. అరియాతో సోహైల్, హారికతో మెహబూబ్ డ్యాన్స్ చేసి ఆకట్టుకొన్నారు. ఈ నలుగురి హంగామా హై రేంజ్‌లో ఉన్నట్టు కనిపించింది.

చికెన్ మటన్ అంటూ స్టెప్పులు
సోహైల్, మెహబూబ్ జోడి ఎప్పటిలానే చికెన్ చికెన్.. మటన్ అంటూ సిగ్నేచర్ స్టెప్పులను వేశారు. ఈ గేమ్‌లో డబ్బులు గెలుచుకొనే క్రమంలో అరియానా, హారిక కంగారు పడినట్టు కనిపించింది. అంతేకాకుండా అరియానాను సోహైల్ టీజింగ్ చేసినట్టు కనిపిస్తున్నది. ఇలా క్రేజీ కాంబినేషన్‌తో సిక్త్ సెన్స్‌ను మరో లెవెల్‌కు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
నాలుగో సీజన్‌కు రెడీ..
ఓంకార్ హోస్ట్‌గా సిక్త్ సెన్స్ సీజన్లు ఇప్పటికే మూడు పూర్తయ్యాయి. నాలుగో సీజన్ జూన్ 12వ తేదీన ప్రారంభం కానున్నది. ఇందు కోసం ఆరంభ సీజన్‌లో భారీగా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఈ సీజన్‌కు చెందిన ప్రోమోలు వైరల్‌గా మారాయి. కరోనావైరస్ సమయంలో ఈ షో మరింత వినోదాన్ని పంచుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.


Click it and Unblock the Notifications











