ముద్దు పెట్టుకొన్నాడంటూ అరియానా లొల్లి.. అవినాష్‌ చెంప పగలగొట్టిన అఖిల్

తెలుగు బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ టాస్క్‌ వినోదాత్మకంగా మొదలైంది. బీబీ హోటల్ టాస్క్‌లో రెండు జట్ల మధ్య సరదా సన్నివేశాలు ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా అవినాష్, అరియానా మధ్య సీన్లు నవ్వు పుట్టించాయి. ఇక హారిక హంగామా, అమ్మా రాజశేఖర్ కామెడీతో 30వ రోజు ఎపిసోడ్ సరదాగా సాగిపోయింది. అరియానాను అవినాష్ ఆటపట్టించిన తీరు ఎలా ఉందంటే...

 అవినాష్‌కు సీక్రెట్ టాస్క్

అవినాష్‌కు సీక్రెట్ టాస్క్

బీబీ హోటల్ టాస్క్‌లో యువరాణిగా అరియానా గ్లోరి, ఆమె తల్లిగా గంగవ్వ నటించారు. హోటల్‌కు అతిథిగా వచ్చిన అరియానా, గంగవ్వను హోటల్ సిబ్బంది సంతృప్తి పరిచి వారి నుంచి టిప్స్, స్టార్స్ సంపాదించుకోవాలి. ఈ టాస్క్‌లో మేనేజర్‌గా వ్యవహరిస్తున్న అవినాష్‌కు బిగ్‌బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. సీక్రెట్ టాస్క్ ప్రకారం హోటల్ సిబ్బంది చేసే పనులకు, అలాగే అతిథులకు ఇబ్బంది కలిగించేలా అవినాష్ ప్రవర్తించాలి అని బిగ్‌బాస్ సూచించాడు.

 అరియానాను అవినాష్ చికాకుపెడుతూ

అరియానాను అవినాష్ చికాకుపెడుతూ

బీబీ హోటల్‌లోకి అతిథులుగా వచ్చిన సోహైల్, మెహబూబ్, హారిక, గంగవ్వ, అరియానాను అవినాష్‌తోపాటు హోటల్ సిబ్బంది కూడా చికాకు పెట్టడం మొదలుపెట్టారు. ఆర్డర్ ఇస్తుంటూ పట్టించుకోకుండా అరియానా కోసం వెళ్లడంపై అవినాష్‌పై హారిక భగ్గుమన్నది. హారికను అవినాష్ తన మాటలతో ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టాడు.

అరియానాతో అవినాష్ చిలిపి చేష్టలు

అరియానాతో అవినాష్ చిలిపి చేష్టలు

హోటల్‌కు వచ్చిన యువరాణి అరియానాను అవినాష్ చిలిపి చేష్టలతో ఆటపట్టించారు. యువరాణి మీరు చాలా అందంగా ఉన్నారంటూ వెంటపడ్డారు. యువరాణితో హోటల్ మేనేజర్ ప్రవర్తించే విధానం ఇదేనా అంటూ అరియానా కంప్లైంట్ చేసింది. మరోసారి చేయిపట్టుకోవడంతో అరియానా ఫిర్యాదు చేసింది. ఇలా అరియానాను అవినాష్ పలు విధాలుగా విసిగించే ప్రయత్నాలు చేశాడు.

అవినాష్‌ను ఆడుకొన్న అరియానా

అవినాష్‌ను ఆడుకొన్న అరియానా

అవినాష్‌ను కూడా అరియానా గ్లోరి అదే విధంగా ఆడుకొన్నది. ఓ బకెట్ తెప్పించి స్విమ్మింగ్ పూల్‌లోని నీళ్లను చెంచాతో నింపాలని అవినాష్‌కు యువరాణి అరియానా ఆదేశించింది. దాంతో తప్పక చెంచాతో బకెట్‌లో నీళ్లు నింపే కార్యక్రమాన్ని పెట్టుకొన్నాడు. అంతేకాకుండా అతిథుల కోసం మిమిక్రీ చేస్తూ కనిపించాడు.

Recommended Video

Kajal Aggarwal Fiance Gautam Kitchlu's Full Details
చెంప పగలకొట్టిన అఖిల్ సార్థక్

చెంప పగలకొట్టిన అఖిల్ సార్థక్

ఇక అవినాష్ చేష్టలతో భరించలేకపోయిన అరియానా.. తనను ముద్దు పెట్టుకోమని అంటున్నాడు అని ఫిర్యాదు చేసింది. హోటల్‌లో చాలా గొడవ చేసింది. దాంతో సెక్యూరిటీ అఖిల్ వచ్చి గొడవను సద్దుమణిగేలా చేయడానికి ప్రయత్నించాడు. అయినా అరియానా గొడవ అలానే కొనసాగించడంతో ఆమెను సంతృప్తి పరచడానికి అవినాష్‌ను అఖిల్ చెంప కొట్టినట్టు నటించాడు. దాంతో అరియానా కాస్త శాంతించింది. ఇలా బిగ్‌బాస్ టాస్క్‌ సరదాగా సాగిపోయింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X