అవినాష్‌పై బాటిల్ విసిరిన అరియానా.. సైకోగా మారకు అంటూ సీరియస్‌గా

బిగ్‌బాస్‌లో ఇంటి సభ్యులకు ప్రధానమైన సమస్య నిద్ర. పగటి పూట నిద్రలోకి జారుకోవడాన్ని బిగ్‌బాస్ తీవ్రంగా పరిగణిస్తున్నారు. అలా నిద్రపోతూ ఎన్నోసార్లు ఇంటి సభ్యులు పట్టుబడ్డారు. ఇంట్లో పగటిపూటట నిద్రపోతే కెప్టెన్‌దే బాధ్యత అంటూ వార్నింగ్ ఇచ్చారు. అయితే 54వ రోజు ఇంటిలో నిద్ర విషయంలో అరియానా, అవినాష్ మధ్య సరదా సన్నివేశం జరిగింది. అదేమిటంటే..

అవినాష్ నిద్రపోయేందుకు ప్రయత్నిస్తే..

అవినాష్ నిద్రపోయేందుకు ప్రయత్నిస్తే..

ఇంటిలో మధ్యాహ్నం కెప్టెన్ అరియానా ముందే అవినాష్ నిద్ర పోయేందుకు ప్రయత్నించాడు. బెడ్ వెనుక సందులో దూరి నిద్ర పోవడానికి చేసిన ప్రయత్నాలను అరియానా అడ్డుకొన్నది. అయితే బెడ్ వెనుక దిండు పడ్డది అందుకే తీయడానికి వెళ్తున్నాను అంటూ కవరింగ్ ఇచ్చాడు. అవినాష్ కవరింగ్ తట్టుకోలేని అరియానా చేతిలో ఉన్న బాటిల్‌తో విసిరి కొట్టింది.

అరియానా వెంటపడిన అవినాష్

అరియానా వెంటపడిన అవినాష్

అయితే అరియానా నిజంగా దిండు వెనుక పడింది అంటూ జోక్ చేస్తూ.. నన్ను బాటిల్‌తో కొడుతావా అంటూ అవినాష్ గుర్రుగా చూశాడు. దాంతో లేదు అవినాష్ బాటిల్ ఎత్తగానే అది జారిపోయి నీ మీద పడింది. నేను విసరలేదు అంటూ అబద్దం ఆడింది. తన వద్ద పడిన బాటిల్‌ను తీసుకొని అందులోని షాంపును అరియానా తలపై పోసేందుకు అవినాష్ ప్రయత్నించాడు.

కెమిస్ట్రీని ఎంజాయ్ చేస్తూ సోయల్, అఖిల్

కెమిస్ట్రీని ఎంజాయ్ చేస్తూ సోయల్, అఖిల్

బాటిలోని షాంపును తలపై పోయడానికి అవినాష్ ప్రయత్నించగా అరియానా తప్పించుకొనేందుకు చూసింది. జారిపోయిందా.. జారి పోయిందా అంటూ అవినాష్ వెంటపడ్డాడు. తలపై పోయకు.. ఇప్పుడే స్నానం చేశాను అంటూ రిక్వెస్ట్ చేసింది. అలా అరియానాను ఆటపట్టిస్తుంటే పక్కనే ఉన్న సోహైల్, అఖిల్ నవ్వుతూ కనిపించారు. వారిద్దరి మధ్య కెమిస్ట్రీని ఎంజాయ్ చేస్తూ కనిపించారు.

Recommended Video

Bigg Boss Telugu 4 : ఒక కామెడీ పీస్ అరిస్తే ఏడుస్తావా ? నాగార్జున స్ట్రాంగ్ కౌంటర్,ఏడ్చేసిన సోహైల్
నిద్రను తట్టుకోలేకపోతున్నాం

నిద్రను తట్టుకోలేకపోతున్నాం

ఇంట్లో ఉండటం చాలా ఇబ్బందిగా ఉంది. నిద్రను తట్టుకోలేకపోతున్నాం. తల బరువుగా మారుతున్నది. ఒక్కోసారి పిచ్చి లేస్తున్నది అంటూ అవినాష్ కెమెరా ముందుకు వచ్చి చెప్పాడు. పక్కనే ఉన్న సోహైల్ స్పందిస్తూ.. బతుకంతా చిత్తు బొత్తు అవుతున్నది అంటూ కామెంట్ చేశారు. అగ్గిపెట్ట తీసుకొని కాల్చుకో అంటూ.. నీవు సైకోలా మారే విషయాలు చెప్పకు అంటూ అవినాస్ పంచ్ విసిరాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X