Don't Miss!
- News తండ్రైన ముఖ్యమంత్రి: తొలి నేతగా రికార్డ్
- Technology 6.67 అంగుళాల డిస్ప్లే, ట్రిపుల్ కెమెరాతో వివో కొత్త ఫోన్... లాంచ్, స్పెసిఫికేషన్ల వివరాలు..!
- Sports IPL 2024: రెండుగా చీలిన ముంబై ఇండియన్స్.. హార్దిక్ మాట వినని రోహిత్ గ్రూప్!
- Automobiles నితిన్ గడ్కరీ కీలక ప్రకటన.. వాహనదారులు తప్పక తెలుసుకోవాల్సిందే!
- Lifestyle First Surya Grahan: ఏప్రిల్ నెలలో మొదటి సూర్య గ్రహణం ఎప్పుడు? సూతక కాలం
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్‌లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
మీ డ్రెస్ క్లాత్ చిరిగిపోయే అవకాశం ఉంది.. అందుకే అలా చేయలేదు.. అరియానాకు బిగ్‌బాస్ లెటర్
బిగ్ బాస్ హౌజ్ లో అందరి కంటే కాస్త డిఫరెంట్ గా క్రేజ్ అందుకున్న కంటెస్టెంట్ ఎవరంటే అరియానా అనే చెప్పాలి. చాలా వరకు తన బోల్డ్ నెస్ తోనే అమ్మడు ఓ వర్గం వారిని బాగా ఎట్రాక్ట్ చేసింది. అయితే హౌజ్ లో అరియనా బిగ్ బాస్ మధ్య జరిగిన కొన్ని సంభాషణలు కూడా ఆడియెన్స్ ను ఎంతగానో ఎట్రాక్ట్ చేశాయి. ఇటీవల అరియనా బిగ్ బాస్ నుంచి వచ్చిన ఒక స్పెషల్ లేఖను సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది.
అసలు స్వరూపాన్ని బయట పెట్టుకొని
బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న కంటెస్టెంట్ లో అరియనాకు మొదట్లో అంతగా క్రేజ్ ఏమి లేదు. రామ్ గోపాల్ వర్మను ఒక ఒక ఇంటర్వ్యూ చేసి ఆయన పొగడ్తల ద్వారా హైప్ క్రియేట్ చేసుకున్న అరియానా హౌజ్ లోకి వెళ్లిన తరువాత తన అసలు స్వరూపాన్ని బయట పెట్టుకొని స్వేచ్ఛగా కనిపించింది. గొడవలు ఎన్ని జరిగినా కూడా ఆమె ఏ మాత్రం వెనుకడుగు వేయలేదు. అదే బాగా ప్లస్ అయ్యింది.
అతను ఫ్రెండ్ మాత్రమే..
ఇక ఆమె బిగ్ బాస్ హౌజ్ లో ఉన్నన్ని రోజులు కూడా అవినాష్ తో కెమిస్ట్రీ ఏ రేంజ్ లో నడిపిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హౌజ్ నుంచి బయటకు వచ్చిన తరువాత ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారు అనే రేంజ్ లో రూమర్స్ వచ్చేలా వారి రిలేషన్ ని నడిపించారు. ఇక ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో అవినాష్ తనకు కేవలం ఒక ఫ్రెండ్ మాత్రమే అంటూ.. క్లారిటీ ఇచ్చేసింది.
మీ డ్రస్ క్లాత్ చిరిగిపోయే అవకాశం ఉంది..
అంతే కాకుండా బిగ్ బాస్ ఇచ్చిన ఒక లేఖను అరియానా ఎంతో ఇష్టంగా దాచుకుంది. ఫైనల్స్ లో ఆమె వేసుకున్న డ్రెస్ కోసం రిక్వెస్ట్ చేయగా ఒక లెటర్ అందిందట. అందులో బిగ్ బాస్ ఈ విధంగా వివరణ ఇచ్చారు. "అరియానా మీరు చెప్పిన విధంగా ముందు నెట్ క్లాత్ వేయబడింది. కానీ వెనక నెట్ వేస్తే డ్రస్ అందం తగ్గడం వలన అది చేయలేదు. మీకు కావాల్సిన వి కట్ చేస్తే మీ డ్రస్ క్లాత్ చిరిగిపోయే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితులను అడ్డుకోవడానికి ఇప్పుడు ఆ కట్ చేయలేదు. మీరు ఈ డ్రస్‌లో చాలా అందంగా ఉన్నారు. గుడ్ లక్ బిగ్‌బాస్ అని ఉంది."
కాబోయే వాడు అలానే ఉండాలి
బిగ్ బాస్ అందంగా ఉన్నాను అంటూ మెచ్చుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని చెప్పిన అరియానా ఇది తన ఫేవరేట్ అంటూ ఎప్పటికి మరచిపోలేనని కూడా తెలిపింది. ఇక కాబోయే వాడి గురించి ఇటీవల ఒక వివరణ ఇచ్చిన అరియానాఅతను చాలా సైలెంట్ అయ్యి ఉండాలి. నేను అల్లరిగా ఉంటాను కాబట్టి వచ్చేవాడు తక్కువ మాట్లాడే వాడు అయ్యి ఉండాలని తెలిపింది.
పెళ్లి తరువాత..
ఇక పెళ్లి తరువాత జాబ్ చేస్తాను కాబట్టి. షూటింగ్ అయిపోయిన టారువత ఎక్కడ ఉన్నావ్? ఎప్పుడు వచ్చి పికప్ చేసుకోవాలి అనేలా ఉండాలి కానీ.. ఎప్పుడొస్తావ్ ఇంటికి.. ఇంత టైమ్ వరకు ఏం చేస్తున్నావ్.. అనేలా ఉండకూడదు అని అరియానా వివరణ ఇచ్చింది. ఇక హీరోయిన్ గా అవకాశం వస్తే తప్పకుండా చేస్తానని కూడా చెప్పిన అరియానా తనకు ఇంతగా క్రేజ్ రావడానికి మొదటి కారణమైన రామ్ గోపాల్ వర్మ కూడా కలవమని చెప్పినట్లు తెలిపింది. అయితే ఆయన ఏ రోల్ ఇస్తే ఆ రోల్ లో చేయనని చెప్పిన ఈ బోల్డ్ గోర్ల్ వీలైనంత వరకు తనకు సెట్టయ్యే మంచి పాత్రల్లోనే నటిస్తానని తెలిపింది.
.