అరియానాతో అవినాష్ పెళ్లి!.. ఆ బంధాన్ని బాగానే వాడేసుకుంటున్నారు
బిగ్ బాస్ షో నాల్గో సీజన్‌లో ఎన్నో బంధాలు ఏర్పడ్డాయి. ఎంతో మంది ప్రాణ స్నేహితులుగా మారారు. ఇంకెంతో మంది స్నేహితుల కంటే ఎక్కువగా మారిపోయారు. ఇంకొందరి మధ్య తగ్గించలేని దూరం కూడా పెరిగింది. అందరూ ఎలా ఉన్నా అరియానా అవినాష్ ట్రాక్ మాత్రం ఎప్పుడూ ప్రత్యేకమే. వారు బిగ్ బాస్ ఇంట్లో ఉన్నా అదే రచ్చ.. బయటకు వచ్చాక కూడా అదే రచ్చ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ జంట గురించే ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతోంది.

ప్రతీ రోజూ అలానే..
అవినాష్ బిగ్ బాస్ ఇంట్లో పులిహోర ఏ రేంజ్‌లో కలిపాడే అందరికీ తెలిసిందే. ఏ కంటెస్టెంట్‌ను కూడా వదల్లేదు.కానీ చివరకు అరియానా అవినాష్ బంధమే గట్టిగా నిలబడింది. బిగ్ బాస్ టీం, నాగార్జున కూడా ఈ ఇద్దరి మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. అయితే అవినాష్ కూడా ఎప్పుడూ అరియానాను ఫ్లర్ట్ చేసేందుకు ట్రై చేస్తున్నట్టుగానే కనిపించేవాడు.

బయటకు వచ్చాక..
బిగ్ బాస్ షో ముగిసి బయటకు వచ్చాక అరియానా అవినాష్ ఇంకా క్లోజ్ అయ్యారు. జనాలు వారి కాంబోను ఇష్టపడుతున్నారని తెలిశాక ఈ ఇద్దరూ కలిసి రచ్చ చేస్తున్నారు. సపరేట్ షోలను ప్లాన్ చేశారు.. సోషల్ మీడియాలో ఇద్దరూ కలిసి డ్యాన్సులు చేస్తూ వీడియోలతో దుమ్ములేపుతున్నారు.

గోవాలో సందడి..
అరియానా అవినాష్‌లు గత వారం గోవాలో సందడి చేసిన సంగతి తెలిసిందే. శ్రీముఖి, విష్ణుప్రియ గ్యాంగ్‌తో కలిసి అరియానా అవినాస్ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. గోవా బీచ్‌లో అందరూ కలిసి దుమ్ములేపారు. అలా వీకెండ్ మొత్తాన్ని బాగానే ఎంజాయ్ చేశారు. తెర వెనకు ఇలా రచ్చ చేస్తుంటే తెర మీద మాత్రం మరో లెవెల్‌లో రెచ్చిపోతోన్నారు.

కామెడీ స్టార్స్..
కామెడీ స్టార్స్ షోను అవినాష్ బాగానే వాడేసుకుంటున్నాడు. ఇందులో తన బిగ్ బాస్ కంటెస్టెంట్లను తీసుకొచ్చి స్కిట్లను వేస్తున్నాడు. అయితే అరియానాను మాత్రం ప్రతీ వారం వాడేస్తున్నాడు. ఆస్కిట్లు కూడా అరియానా అవినాష్ మధ్య ఉండే కెమిస్ట్రీ చుట్టే తిరుగుతుంటాయి. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నట్టు, ప్రేమికుల్లా, భార్యా భర్తలుగా ఉన్నట్టు స్కిట్లు వేస్తుంటారు.

తాజాగా అలా..
తాజాగా అవినాష్ ఓ స్కిట్ వేశాడు. అందులో అరియానాను తాను పెళ్లి చేసుకున్నట్టు చెప్పుకొచ్చాడు. అరియానాను పెళ్లి చేసుకున్న తరువాత పరిస్థితి ఎలా ఉండో చూపించాడు. గయ్యాళి పెళ్లాంగా అరియానా చేస్తోన్న గొడవలను చూపించాడు. మొత్తానికి తమ మధ్య ఉన్న కెమిస్ట్రీని ఇలా భలేగా వాడేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











