For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సోహెల్ అరియానాకు ముందే పరిచయం.. అలా అనుకునే వచ్చారట!

    |

    బిగ్ బాస్ షోలో అరియానా సోహెల్ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. ముందుగా ఈ ఇద్దరినే సీక్రెట్ రూంలోకి పంపించారు. నైబర్ రూంలో అంటూ ఓ రెండు రోజులున్నారు. సరిగ్గా ఫుడ్ రాకపోవడంతో కడుపు మండి బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చారు. అందరితో గొడవలుపెట్టుకున్నారు. అప్పటి వరకు నైబర్ రూంలో ఇద్దరూ మంచి స్నేహితుల్లా మారిపోయారు. కానీ బిగ్ బాస్ ఇంట్లోకి రావడంతో బేధాభిప్రాయాలు మొదలయ్యాయి.

    ఇద్దరూ అలా..

    ఇద్దరూ అలా..

    బిగ్ బాస్ షోలో ప్రతీ ఎపిసోడ్‌లో సోహెల్ అరియానా ట్రాక్ ఉండాల్సిందే. సోహెల్ అరియానా గొడవలు పడటమో లేదా ప్రేమగా ఉండటమో ఏదో ఒకటి జరుగుతూ వచ్చేది. ఎన్ని గొడవలు పెట్టుకున్నారో.. అంతే ప్రేమగా కూడా ఉండేవారు. కానీ చివరకు మాత్రం ఆ గొడవలు తారాస్థాయికి చేరిపోయాయి.

    చివరి వారాల్లో..

    చివరి వారాల్లో..

    సోహెల్ అరియానా మధ్య టామ్ అండ్ జెర్రీల ఉండేది వ్యవహారం. అలా సోషల్ మీడియాలో ఈ ఇద్దరి గొడవలు, స్నేహానికి ఫ్యాన్స్ కూడా ఉండేవారు. చివరి వారాల్లో ఈ ఇద్దరి మధ్య జరిగిన గొడవతో వ్యవహారం మొత్తం వేడెక్కింది. ఒకరిపైకి ఇంకొకరు వెళ్లడం, మాటల్లో హద్దులు దాటడంతో రచ్చ రచ్చగా మారింది.

    బయటకు వచ్చాక..

    బయటకు వచ్చాక..

    అయితే లోపల ఎన్ని గొడవలు జరిగినా కూడా వాటిని అక్కడే విడిచిపెట్టేశారు. బయటకు వచ్చాక మళ్లీ అంతే స్నేహంగా ఉంటున్నారు. సోహెల్ అరియానా కాస్తా.. సోహియానాగా మారిపోయారు. అయితే తాజాగా ఓ విషయం అరియానా బయటపెట్టేసింది.

     ముందే తెలుసుట..

    ముందే తెలుసుట..

    సోహెల్ అరియానాది బిగ్ బాస్ కలిపిన బంధం కాదని తెలుస్తోంది. ఈ ఇద్దరికీ ముందే పరిచయం ఉందట. ఇదే విషయాన్ని అరియానా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అమర్ దీప్ తమ ఇద్దరినీ కలిపాడట. బిగ్ బాస్ షోకు వెళ్లే ముందు కలిశారట కూడా.

    Bigg Boss Telugu 4 : Abhijeet క్రేజ్ నిలుపుకుంటాడా? బిగ్ బాస్ వల్ల ఆ విజేతలకు ఒరిగింది ఏమిటి ?
    సపోర్ట్ చేసుకుందాం..

    సపోర్ట్ చేసుకుందాం..

    అమర్ దీప్ వల్ల మా ఇద్దరికీ పరిచయం.. ఇద్దరం బిగ్ బాస్ షోకు వెళ్తున్నామని తెలిసింది.. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుందామని అనుకున్నాం.. కానీ ఏం జరిగిందో ఎంత బాగా సపోర్ట్ చేసుకున్నామో అందరికీ తెలిసిందే అంటూ అరియానా చెప్పుకొచ్చింది.

    English summary
    Ariyana And Sohel Pre Plan Because Of Amar Deep..
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X