అలాంటి ప్లేస్‌లో ఆరియానా.. అవినాష్ ఎంజాయ్: ఏకంగా అలా కనిపించడంతో అనుమానాలు మొదలు
తెలుగు బుల్లితెర చరిత్రలోనే బిగ్ బాస్ షోకు ప్రత్యేకమైన స్థానం ఉంది. అంతలా ఇది నాలుగేళ్లుగా టెలివిజన్ రంగంపై ప్రభావం చూపుతోంది. అందుకే ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్లు కూడా ఎనలేని గుర్తింపును, ఊహించని రీతిలో క్రేజ్‌ను అందుకుంటున్నారు. అయితే, కొందరు మాత్రం ఒంటరిగా కంటే జంటగానే ఎక్కువ ఫేమస్ అవుతున్నారు. అలాంటి వారిలో ఆరియానా గ్లోరీ, ముక్కు అవినాష్ జోడీ ఒకటి. నాలుగో సీజన్ కంటెస్టెంట్లైన వీళ్లిద్దరూ హౌస్‌లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ చోట కలిసి రచ్చ చేశారీ ఇద్దరు. ఆ వివరాలు మీకోసం!
లంగా ఓణిలో పాయల్ రాధాకృష్ణ.. యువ తార లవ్లీ ఫోటోషూట్...

ఆమె అలా.. అతడిలా ఫుల్ పాపులర్
యూట్యూబ్ యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది ఆరియానా గ్లోరీ. ఇక, రాంగోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో ఎనలేని క్రేజ్‌ను అందుకుంది. మరోవైపు, జబర్ధస్త్ షో ద్వారా భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నాడు ముక్కు అవినాష్. దాదాపు ఐదారేళ్లుగా అతడు తన మార్క్ చూపిస్తున్నాడు.

ఇద్దరికీ బిగ్ బాస్ ఆఫర్... రహస్యంగా
తమ తమ రంగాల్లో విశేషమైన గుర్తింపును అందుకుని ఫుల్ బిజీగా గడుపుతోన్న అవినాష్, ఆరియానాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. ఇందులో భాగంగానే వీళ్లిద్దరూ నాలుగో సీజన్ కంటెస్టెంట్లుగా ఎంపికయ్యారు. ప్రీమియర్ ఎపిసోడ్‌లో ఆరియానా.. సోహెల్‌తో కలిసి సీక్రెట్ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక, అవినాష్ కూడా ఓ వారం తర్వాత వైల్డ్ కార్డ్‌లా హౌస్‌లోకి ప్రవేశించి షాకిచ్చాడు.

హౌస్‌లో జంటగా రచ్చ... ట్రాక్ అంటూ
ఎన్నో అంచనాల నడుమ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చాడు జబర్ధస్త్ కమెడియన్ అవినాష్. హౌస్‌లో కాలు పెట్టిన సమయం నుంచే మిగిలిన వారందరినీ నవ్వించడం మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే తోటి కంటెస్టెంట్ ఆరియానా గ్లోరీతో క్లోజ్ అయ్యాడు. ఆమెతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ హల్‌చల్ చేశాడు. ఫలితంగా ఇద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందని ప్రచారం సాగింది.

వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారారు
బిగ్ బాస్ షో వల్ల ఎనలేని క్రేజ్‌తో పాటు బిగ్ సెలెబ్రిటీలుగా మారిపోయారు ఆరియానా, అవినాష్. అలాగే, రెమ్యూనరేషన్ పరంగానూ భారీ మొత్తాలను అందుకుని ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇలాంటి సమయంలోనే ఇద్దరికీ వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే అవినాష్ కొన్ని షోలలో సందడి చేస్తుండగా.. ఆరియానా మాత్రం షోలతో పాటు పలు సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా మారింది.

ఏమీ లేదంటూనే.. రొమాన్స్ చేయడం
బిగ్ బాస్ హౌస్‌లో జంటగా హల్‌చల్ చేసిన ఆరియానా.. అవినాష్.. బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఫ్లేట్ ఫిరాయించారు. ఈ క్రమంలోనే తమ మధ్య అలాంటి రిలేషన్ లేదని వెల్లడించారు. అంతేకాదు, తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చారు. కానీ, కొన్ని గేమ్ షోలలో పాల్గొన్న సమయంలో వీళ్లిద్దరి మధ్య ట్రాక్ ఉన్నట్లు కలరింగ్ ఇచ్చారు. ఉంగరాలు కూడా మార్చుకున్నారు.

మామిడి తోటలో ఎంజాయ్... వైరల్‌గా
వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోన్న ఆరియానా.. అవినాష్.. తాజాగా ఓ ఫాంహౌస్‌లో రచ్చ చేసినట్లు ఓ న్యూస్ బయటకు వచ్చింది. దీనికి కారణం వీళ్లిద్దరూ కలిసి మామిడి తోటలో దిగిన ఫొటో ఒకటి బయటకు రావడమే. దీంతో వీళ్లు అక్కడకు ఎందుకు వెళ్లారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక, ఈ జంట మార్చి 31న కూకట్‌పల్లిలో ఓ హోటల్‌ను ప్రారంభిస్తోంది.


Click it and Unblock the Notifications











