Just In
- 2 min ago
పెళ్లి విషయం దాచిపెట్టడంపై కౌంటర్.. అందరి ముందు రవి పరువుదీసిన సుమ
- 52 min ago
పెళ్లికి ముందే బ్రేకప్.. బిగ్ బాస్ లో వచ్చిన డబ్బు అలా ఖర్చు చేశా: బిగ్ బాస్ 1 విన్నర్ శివ బాలాజీ
- 1 hr ago
బట్టలు వేసుకోవడం మానేసిన శ్రీరెడ్డి: మరో హాట్ సెల్ఫీతో రచ్చ.. అవి ధరించడం ఇష్టముండదు అంటూ!
- 1 hr ago
సీక్రెట్ ప్లేస్‌లో పవన్ టాటూ: అలా లేపి చూపించిన బిగ్ బాస్ బ్యూటీ.. అమ్మడి తీరుకు వాళ్లంతా షాక్!
Don't Miss!
- News
హైకోర్టు తీర్పుపై నిమ్మగడ్డ స్పందన- షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు- త్వరలో కీలక భేటీ
- Finance
10 నెలల్లో 100% లాభాలు, ఆరు నెలల్లో సెన్సెక్స్ 54,000!
- Sports
హైదరాబాద్ చేరుకున్న సిరాజ్.. శంషాబాద్‌లో ఘన స్వాగతం!!
- Lifestyle
మకరంలోకి శుక్రుడి సంచారం.. 12 రాశులపై ఎలాంటి ప్రభావం.. ఏ పరిహారాలు పాటిస్తే శుభఫలితాలొస్తాయంటే..!
- Automobiles
బైక్ మ్యూజియంలో అగ్నికి ఆహుతైన అరుదైన వాహనాలు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఆరియానా గ్లోరి బిగ్ బాస్ రెమ్యూనరేషన్ లీక్: అందరి కంటే తక్కువ.. అందులో మాత్రం ఎక్కువ!
ఏమాత్రం అంచనాలు లేకుండా బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించి.. భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న వారిలో ప్రముఖ యాంకర్ ఆరియానా గ్లోరీ ఒకరు. యూట్యూబ్ ఛానెళ్లలో యాంకర్‌గా పని చేస్తోన్న సమయంలో ఆమె సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంటర్వ్యూతో ఒక్కసారిగా ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అవకాశం దక్కించుకుంది. మంచి ఆటతో ఫినాలే వరకు చేరిన ఆరియానా.. బిగ్ బాస్ ద్వారా ఎంత సంపాదించిందో తెలిసిపోయింది. తాజాగా ఆమె రెమ్యూనరేషన్ వివరాలు లీక్ అయ్యారు. అది మీకోసం!

షోలోకి స్పెషల్‌గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ
యాంకర్‌గా సత్తా చాటి సోషల్ మీడియాలో ఎంతగానో ఫేమస్ అయింది ఆరియానా గ్లోరీ. ఆ సమయంలోనే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొనే అవకాశం దక్కించుకుంది. అయితే, ప్రారంభ ఎపిసోడ్‌లో అందరు కంటెస్టెంట్లలా కాకుండా.. సయ్యద్ సోహెల్ రియాన్‌తో కలిసి సీక్రెట్ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఆరియానా. ఆ తర్వాత రెండు రోజులకు హౌస్‌లో అడుగు పెట్టింది.

ప్రతి టాస్క్‌లోనూ శ్రమిస్తూ మంచి పేరు
బోల్డుగా ఉండడమంటే తనకు ఇష్టం అని చెబుతూ బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇచ్చింది ఆరియానా గ్లోరీ. అందుకు అనుగుణంగానే హౌస్‌లో దూకుడును ప్రదర్శించింది. ఈ క్రమంలోనే అన్ని టాస్కుల్లో వందకు వంద శాతం ఇచ్చి ఫైటర్ అనిపించుకుంది. అదే సమయంలో ముక్కుసూటిగా ఉంటూ పలు వివాదాల్లో చిక్కుకుంది. అయినప్పటికీ మంచి గేమర్ అనే పేరును దక్కించుకుంది.

అవినాష్‌తో లవ్ ట్రాక్.. యమ పాపులర్
బిగ్ బాస్ హౌస్‌లో ఆరియానా ఏం చేసినా సంచలనం అన్నట్లుగా పరిస్థితులు వచ్చేశాయి. అలాంటి సమయంలో జబర్ధస్త్ ఫేం ముక్కు అవినాష్ వచ్చినప్పటి నుంచి అతడితో క్లోజ్‌గా ఉందామె. ఆ సమయంలోనే వీళ్లిద్దరి మధ్య ట్రాక్ నడుస్తుందన్న టాక్ నడిచింది. దీంతో అమ్మడు బాగా హాట్ టాపిక్ అయిపోయింది. ఇలా కూడా ఆరియానా గ్లోరీ తెలుగు ప్రేక్షకులకు దగ్గరైందని చెప్పొచ్చు.

టైటిల్ ఫేవరెట్.. నిరాశ పరిచిన బోల్డ్ పాప
మొదట్లో ఆరియానాను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. దీంతో ఈమె కూడా సాదాసీదా కంటెస్టెంట్ అని అంతా అనుకున్నారు. కానీ ఊహించని విధంగా ఎన్నో సార్లు ఎలిమినేషన్ తప్పించుకుని ఆమె ఫినాలేకు చేరుకుంది. కానీ, చివర్లో ప్రేక్షకుల మద్దతును రప్పించుకోవడంలో విఫలమైందామె. దీంతో గ్రాండ్ ఫినాలేలో దేత్తడి హారిక తర్వాత ఎలిమినేటై నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.

ఆరియానా గ్లోరి బిగ్ బాస్ రెమ్యూనరేషన్
రూ. 500 కోసం కూడా కెరీర్ ఆరంభంలో పనులు చేశానని చెప్పిన ఆరియానా గ్లోరీ.. బిగ్ బాస్ షో ద్వారా ఎంత సంపాదించిందన్న దానిపై ఓ క్లారిటీ వచ్చింది. తాజాగా ఆమె రెమ్యూనరేషన్ వివరాలు లీక్ అయ్యాయి. ఆరియానా 105 రోజుల పాటు షోలో కొనసాగగా.. రోజుకు రూ. 20 వేలు చార్జ్ చేసినట్లు తెలిసింది. దీంతో మొత్తంగా షోలో ఉన్నందుకు రూ. 21 లక్షలు తీసుకుందట.

అందరి కంటే తక్కువ.. అందులో ఎక్కువ
బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి అడుగు పెట్టిన కంటెస్టెంట్లు 19 మంది. వీళ్లందరిలో డైలీ చార్జెస్ ప్రకారం.. ఆరియానా గ్లోరీ మాత్రమే తక్కువ రెమ్యూనరేషన్ (రూ. 20) అందుకుందట. అందుకే ఫినాలే వరకూ ఉన్నా.. రూ. 21 లక్షలతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని సమాచారం. డబ్బుల పరంగా తక్కువ సంపాదించినప్పటికీ.. మంచి ఆటతో ఎక్కువ గుర్తింపునే అందుకుందీ బోల్డ్ బ్యూటీ.