For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ‘ఆరియానా’ భారీ మోసం: అలాంటి ఫొటోలతో సెలెబ్రిటీలకు వల.. స్క్రీన్‌ షాట్లతో బండారం బట్టబయలు

  |

  సోషల్ మీడియా ద్వారా సెన్సేషన్‌గా మారి.. చాలా తక్కువ సమయంలోనే తెలుగు బుల్లితెరపై స్టార్‌గా ఎదిగిపోయింది బోల్డు బ్యూటీ ఆరియానా గ్లోరీ. అందం, అభినయం, వాక్చాతుర్యం, అదిరిపోయే ఆటతో బిగ్ బాస్ షోలో సత్తా చాటిన ఈ అమ్మడు.. దీని తర్వాత తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంది. ఫలితంగా వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ ముందుకు సాగుతోంది. ఇలా కొంత కాలంగా బుల్లితెరపై, వెండితెరపై తెగ సందడి చేసేస్తోంది. దీంతో ఈ అమ్మడి క్రేజ్ మరింతగా పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరియానా గురించి ఓ షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ఆ వివరాలు మీకోసం!

  అలా పరిచయం.. సెన్సేషన్

  అలా పరిచయం.. సెన్సేషన్

  యూట్యూబ్ యాంకర్‌గా బిజీగా గడుపుతోన్న సమయంలోనే ఆరియానా గ్లోరీ.. చాలా మంది సెలెబ్రిటీలతో చిట్ చాట్ చేసింది. అప్పుడే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసింది. ఇందులో ఆయనతో ఎంతో బోల్డుగా వ్యవహరించింది. ఇది బాగా వైరల్ అయిపోయింది. దీంతో ఆమె పేరు మారుమ్రోగడంతో పాటు సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది.

  జబర్ధస్త్ వర్ష సొగసుల జాతర: అతి చిన్న డ్రెస్‌లో ఆ పార్ట్ కనిపించేలా!

  బిగ్ బాస్ వల్ల క్రేజ్ రెట్టింపు

  బిగ్ బాస్ వల్ల క్రేజ్ రెట్టింపు

  సోషల్ మీడియాలో దక్కిన క్రేజ్ కారణంగా ఆరియానా గ్లోరీ బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో అవకాశం అందుకుంది. అందులోకి ఏమాత్రం అంచనాలు లేకుండానే ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. బోల్డ్‌నెస్‌తో పాటు అద్భుతమైన ఆటతీరుతో అలరించింది. మరీ ముఖ్యంగా ముక్కుసూటిగా ఉంటూ మనసులు దోచిన ఆరియానా ఏకంగా ఫినాలేలో సైతం అడుగు పెట్టి సత్తా చాటుకుంది.

  ఫుల్‌గా ఆఫర్లు.. తీరక లేదుగా

  ఫుల్‌గా ఆఫర్లు.. తీరక లేదుగా

  బిగ్ బాస్ షో పుణ్యమా అని ఆరియానా గ్లోరీకి అటు బుల్లితెరపై.. ఇటు వెండితెరపై వరుసగా ఆఫర్లు వెల్లువెత్తాయి. ఇందులో భాగంగానే చాలా కాలం పాటు పలు షోలు, ఈవెంట్లు, ఓపెనింగ్స్‌తో ఫుల్ బిజీగా గడిపింది. అలాగే రాజ్ తరుణ్, కల్యాణ్ దేవ్ హీరోలుగా చేసిన సినిమాల్లో కీలక పాత్రలు చేసింది. వీటితో పాటు మరికొన్ని ప్రాజెక్టుల్లోనూ భాగమై తనదైన రీతిలో దూసుకుపోతోంది.

  బీచ్‌లో తెలుగు పిల్ల అనన్య నాగళ్ల హాట్ షో: ఎద అందాలను అలా చూపిస్తూ!

   మళ్లీ బిగ్ బాస్ షోలోనే రచ్చ

  మళ్లీ బిగ్ బాస్ షోలోనే రచ్చ

  ఆరియానాను బిగ్ బాస్ అస్సలు వదలట్లేదు. నాలుగో సీజన్ తర్వాత బిగ్ బాస్ బజ్‌లో ఛాన్స్ అందుకున్న ఈ భామ.. గత ఏడాది వచ్చిన నాన్ స్టాప్ సీజన్‌లో పాల్గొంది. ఇందులో కూడా ఫినాలేకు చేరి రూ. 10 లక్షలు ఆఫర్‌కు ఓకే చెప్పేసింది. ఆరో సీజన్‌లో 'బీబీ కెఫే' అనే టాక్ షోను హోస్ట్ చేసింది. అలాగే, ఇప్పుడు 'బీబీ జోడీ' షోలో అవినాష్‌తో కలిసి తెగ సందడి చేసేస్తోంది.

  సోషల్ మీడియాలో సందడి

  సోషల్ మీడియాలో సందడి

  తెలుగు రాష్ట్రాల్లో ఆరియానా గ్లోరీ ఓ రేంజ్‌లో పాపులర్ అవడానికి సోషల్ మీడియానే కారణం అన్న విషయం అందరికీ తెలిసిందే. అందుకే ఇందులో ఈ అమ్మడు మరింత యాక్టివ్‌ అయిపోయింది. ఈ క్రమంలోనే తనకు, తన కెరీర్‌కు సంబంధించిన విషయాలను విశేషాలను ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంటోంది. తద్వారా తన క్రేజ్‌ను రెట్టింపు చేసుకుంటూ ముందుకు సాగిపోతోంది.

  సీతా రామం హీరోయిన్ అందాల విందు: క్లీవేజ్ షోతో టెంప్ట్ చేస్తోన్న బ్యూటీ

  ఆరియానా పేరుతో మోసం

  ఆరియానా పేరుతో మోసం

  ఒకవైపు షోలు, మరోవైపు సినిమాలు, ఇంకోవైపు స్పెషల్ ఈవెంట్లు చేసుకుంటూ కెరీర్ పరంగా ఫుల్ బిజీగా గడుపుతోన్న ఆరియానా గ్లోరీకి సైబర్ నేరగాళ్లు షాక్ ఇచ్చారు. ఆమె పేరిట ఓ వాట్సాప్ ఐడీని క్రియేట్ చేయడంతో పాటు తనతో టచ్‌లో ఉన్న సెలెబ్రిటీలతో ఆమెలా చాటింగ్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఆరియానా గ్లోరీ ఓ సెల్ఫీ వీడియో ద్వారా వెల్లడించింది.

  నీకు పనీ పాటా లేదారా అని

  నీకు పనీ పాటా లేదారా అని

  ఆరియానా గ్లోరీ తాజాగా షేర్ చేసిన వీడియోలో 'అరేయ్.. ఏమనుకుంటున్నారురా. నా పేరు మీద ఐడీ క్రియేట్ చేసి.. నేనెలా మెసేజ్‌లు చేస్తానో అచ్చం అలాగే చేస్తున్నారు. నాక్కూడా ఇలాంటివి ఇంట్రెస్టే. కానీ. మీలా నేను ఖాళీగా లేనురా. మర్యాదగా చెబుతున్నా.. ఇక్కడితో ఇది ఆపేయండి. ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటివి నమ్మకండి' అంటూ చెప్పుకొచ్చింది.

  English summary
  Bigg Boss Fame, TV anchor and Actor Ariyana Glory Very Active in Social Media. Now She Gives Clarity about Big Fraud on Her Name.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X