ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్ చెప్పిన ఆరియానా గ్లోరీ: వీడియోతో పర్సనల్ మేటర్ రివీల్ చేసిన బోల్డ్ లేడీ

ఆరియానా గ్లోరీ.. కొంత కాలంగా తెలుగు రాష్ట్రాల్లో మారుమ్రోగుతూనే ఉన్న పేరిది. దీనికి కారణం ఈ అమ్మడు బిగ్ బాస్ షోలో చేసిన అల్లరే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏమాత్రం అంచనాలు లేకుండానే బిగ్ బాస్ హౌస్‌లోకి వెళ్లిన ఈ బ్యూటీ.. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ఫలితంగా ఎనలేని గుర్తింపును అందుకుంది. బయటకు వచ్చాక ఫుల్ బిజీ అయిపోయిన బోల్డ్ లేడీ.. వరుసగా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోతోంది. ఇలాంటి సమయంలో ఓ వీడియోను పోస్ట్ చేసి మరీ తన పర్సనల్ మేటర్ రివీల్ చేసేసింది. ఆ వివరాలేంటో చూద్దాం పదండి!

కెరీర్ మొదలైందలా.. ఆయన వల్ల పాపులర్

కెరీర్ మొదలైందలా.. ఆయన వల్ల పాపులర్

యూట్యూబ్ ఛానెళ్లలో యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించింది ఆరియానా గ్లోరీ. ఈ క్రమంలోనే ఎంతో మంది సినీ ప్రముఖులతో ఇంటర్వ్యూలు చేసి పేరు సంపాదించుకుంది. ఇలా కెరీర్ సాఫీగా సాగిపోతోన్న సమయంలో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో చేసిన చిట్‌ చాట్‌తో విపరీతంగా ఫేమస్ అయింది. అతడి వల్లే తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిపోయిందీ బోల్డ్ బ్యూటీ.

మినీ స్కర్ట్‌లో రకుల్ ప్రీత్ అందాల ఆరబోత.. కొంచెం నాటీ.. మరికొంచెం ఘాటుగా

బిగ్ బాస్‌లోకి ఎంట్రీ... ఆరంభంలోనే అదుర్స్

బిగ్ బాస్‌లోకి ఎంట్రీ... ఆరంభంలోనే అదుర్స్

రాంగోపాల్ వర్మ.. ఆరియానా గురించి ట్వీట్లు చేయడంతో ఈ యాంకర్‌కు ఎనలేని క్రేజ్ వచ్చేసింది. తద్వారా బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే అవకాశం వచ్చింది. దీంతో గత ఏడాది ప్రసారం అయిన నాలుగో సీజన్‌లో సోహెల్‌తో కలిసి ఆరియానా సీక్రెట్ రూమ్ ద్వారా హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నుంచే తన మార్క్ చూపిస్తూ అందరి దృష్టిలో పడిపోయింది.

ఫైటర్‌గా పేరు వచ్చినా.. అలా సరిపెట్టుకుంది

ఫైటర్‌గా పేరు వచ్చినా.. అలా సరిపెట్టుకుంది

'నేను బోల్డ్ అమ్మాయిని. దేన్నైనా సాధించాలంటే వంద శాతం శ్రమిస్తా' అంటూ షోలోకి ఎంట్రీ ఇచ్చే సమయంలో చెప్పింది ఆరియానా. అందుకు అనుగుణంగానే టాస్కుల్లో గెలవడం కోసం ఎంతటి పనైనా చేసేది. ఇక అద్భుతమైన ఆటతీరుతో ఎన్నోసార్లు నామినేషన్‌లో ఉన్నా ఎలిమినేషన్స్ తప్పించుకని ఫినాలేకు చేరింది. కానీ, చివర్లో ఊహించని విధంగా నాలుగో స్థానంతోనే సరిపెట్టుకుంది.

బాగానే వెనకేసిన భామ.. ఫాలోయింగ్ కూడా

బాగానే వెనకేసిన భామ.. ఫాలోయింగ్ కూడా

బిగ్ బాస్ షోలోకి ఎంట్రీ ఇవ్వడం వల్ల ఆరియానా గ్లోరీ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. ఇక, షోలో ఉన్నందుకు గానూ పేరుతో పాటు రూ. 25 లక్షల వరకూ రెమ్యూనరేషన్ వచ్చింది. అదే సమయంలో వరుసగా ఆఫర్లు కూడా అందుకుంటోంది. సోషల్ మీడియాలో సైతం ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో కొత్త యూట్యూబ్ చానెల్ కూడా ప్రారంభించింది.

వరుసగా రెండు సినిమాలు.. ఆ గెటప్‌తో షాక్

వరుసగా రెండు సినిమాలు.. ఆ గెటప్‌తో షాక్

బిగ్ బాస్ షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆరియానా గ్లోరీ వరుస ఆఫర్లను అందుకుంటోంది. ఇప్పటికే పలు షోలతో పాటు రాజ్ తరుణ్ సినిమాలో కూడా నటించింది. ఇక, ఇప్పుడు మెగా అల్లుడు కల్యాణ్ దేవ్ నటిస్తోన్న సినిమాలోనూ అవకాశం దక్కించుకుంది. ఈ సినిమా షూటింగ్ స్పాట్‌లో అతడితో పాటు యూనిట్ మొత్తంతో దిగిన ఫొటోను కూడా ఇటీవల షేర్ చేసిందామె.

ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్ చెప్పిన ఆరియానా గ్లోరీ

ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్ చెప్పిన ఆరియానా గ్లోరీ

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే ఆరియానా.. కొద్ది రోజులుగా కనిపించడం లేదు. దీంతో ఆమెకు అనారోగ్య సమస్య వచ్చిందని అంతా అనుకున్నారు. ఇలాంటి సమయంలో తన ఆరోగ్యం గురించి వెల్లడిస్తూ గుడ్ న్యూస్ చెప్పింది. 'నాకు జ్వరం వచ్చి పోయింది. నా కోసం ఆలోచించిన.. నా ఆరోగ్యం గురించి ప్రార్థించిన అందరికి థ్యాంక్స్' అంటూ వీడియోతో అసలు మేటర్ రివీల్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X