For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పెళ్లిపై ఆరియానా గ్లోరీ సంచలన ప్రకటన: అతడినే చేసుకుంటున్నా.. పేరు చెప్పమంటే అలా చెప్పేసింది

  |

  తెలుగు రాష్ట్రాల్లో కొద్ది నెలలుగా మారుమ్రోగిపోతోన్న పేర్లలో ఆరియానా గ్లోరీ ఒకటి. దీనికి కారణం ఆమె బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో చేసిన హడావిడే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంతలా ఈ బ్యూటీ అందులో రచ్చ రచ్చ చేసింది. ఇక, బయటకు వచ్చిన తర్వాత కూడా పలు ఇంటర్వ్యూలు, సినిమా ఆఫర్లు, షోలలో కనిపిస్తూ హల్‌చల్ చేస్తోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా తన పెళ్లి గురించి ఆరియానా గ్లోరీ సంచలన ప్రకటన చేసింది. అదే సమయంలో క్రష్ పేరు చెప్పమంటే మాత్రం సిగ్గుపడింది. ఆ సంగతులు మీకోసం!

  ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఆరియానా ఫేమస్

  ఆర్జీవీ ఇంటర్వ్యూతో ఆరియానా ఫేమస్

  పలు యూట్యూబ్ ఛానెళ్లలో యాంకర్‌గా పని చేస్తూ కెరీర్‌ను ఆరంభించింది ఆరియానా గ్లోరీ. ఇందులో భాగంగానే ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూలు చేసింది. ఈ క్రమంలోనే ఓ సారి రాంగోపాల్ వర్మతో చిట్‌చాట్ చేసింది. ఆ సమయంలో ఇద్దరి మధ్య బోల్డుగా చర్చలు జరిగాయి. దీంతో వర్మ ఎంతో ఇంప్రెస్ అయి ట్వీట్లు కూడా పెట్టడంతో ఆరియానా ఫేమస్ అయిపోయింది.

  అదిరిపోయిన ఆట.. గ్రాండ్‌గా ముగిసింది

  అదిరిపోయిన ఆట.. గ్రాండ్‌గా ముగిసింది

  రాంగోపాల్ వర్మను ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఆరియానా గ్లోరీ పేరు మారుమ్రోగిపోయింది. ఈ కారణంగానే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా పాల్గొనే ఛాన్స్‌ను పట్టేసింది. ఆరంభంలోనే సీక్రెట్‌ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. ఆ తర్వాత అదిరిపోయే ఆటతీరుతో ఆకట్టుకుంది. నిజాయితీగా ఉంటూ మంచి పేరు తెచ్చుకుని ఫినాలేలోకి సైతం అడుగు పెట్టి సత్తా చాటేసింది.

  అతడితో లవ్ ట్రాక్.. బాయ్‌ఫ్రెండ్ గురించి

  అతడితో లవ్ ట్రాక్.. బాయ్‌ఫ్రెండ్ గురించి

  బిగ్ బాస్ షోలో ఉన్న సమయంలో బోల్డుగా ఉంటూ తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చింది ఆరియానా గ్లోరీ. ఈ క్రమంలోనే ముక్కు అవినాష్‌తో చాలా క్లోజ్ అయింది. అప్పుడు వీళ్లిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడుస్తుందని అంతా అనుకున్నారు. అప్పుడు ఈ న్యూస్ హైలైట్ అయింది. ఈ క్రమంలోనే తనకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడంటూ అసలు విషయాన్ని బయట పెట్టి షాకిచ్చింది ఆరియానా గ్లోరీ.

  ఎక్కడ చూసినా బ్యూటీనే కనిపిస్తోందిగా

  ఎక్కడ చూసినా బ్యూటీనే కనిపిస్తోందిగా

  బిగ్ బాస్ షో వల్ల ఆరియానా గ్లోరీ లైఫ్ ఒక్కసారిగా మారిపోయింది. ఏమాత్రం అంచనాలు లేకుండానే వచ్చిన ఆమె.. నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే, క్రేజ్‌ను కూడా భారీగా సొంతం చేసుకుంది. వీటితో పాటు సినిమా ఆఫర్లను కూడా దక్కించుకుంటోంది. ఇప్పటికే రాజ్‌ తరుణ్‌, కల్యాణ్ దేవ్ సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ.. మరికొన్నింటిని ఓకే చేసింది. అలాగే షోలు కూడా చేస్తుంది.

  పెళ్లి గురించి అలాంటి కామెంట్.. హైలైట్

  పెళ్లి గురించి అలాంటి కామెంట్.. హైలైట్

  ఆరియానా గ్లోరీకి వైవాహిక జీవితంపై బోలెడు ఆశలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ఏడాదిన్నరలో పెళ్లి చేసుకుంటా. బిగ్ బాస్‌కు ముందే ఓ ఎన్నారై సంబంధం వచ్చింది. అది ఇంకా చర్చల దశలో ఉంది. నాకు ముగ్గురు పిల్లలను కనాలని ఉంది. తల్లిగా ఉండడం అంటే చాలా ఇష్టం' అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

  పెళ్లిపై ఆరియానా గ్లోరీ సంచలన ప్రకటన

  పెళ్లిపై ఆరియానా గ్లోరీ సంచలన ప్రకటన

  ఆరియానా గ్లోరీ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఓ నెటిజన్ ఆమెను ‘పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటావా? ప్రేమ వివాహం చేసుకుంటావా' అని ప్రశ్నించాడు. దీనికి ఆరియానా ‘కచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటా' అని చెప్పింది.

  Ek Mini Katha Funny Skit With Ariyana, Avinash, Santosh Sobhan
   అతడినే చేసుకుంటున్నా... పేరు మాత్రం

  అతడినే చేసుకుంటున్నా... పేరు మాత్రం

  ఈ సెషన్‌లోనే ఎంతో మంది ఆమెను రకరకాల ప్రశ్నలు అడిగారు. అన్నింటికీ సెల్ఫీ వీడియో ద్వారా ఆమె సమాధానాలు చెప్పింది. ఈ క్రమంలోనే మరో నెటిజన్ ‘మీ క్రష్ ఎవరు? ఐ లవ్ యూ అక్క' అంటూ అడిగాడు. దీనికి ఆరియానా ‘క్రష్ అంటే ఉన్నారు. కానీ పేరు చెప్పకూడదు కదా' అంటూ తెగ సిగ్గుపడిపోయింది. మొత్తానికి ఈ బ్యూటీ పెళ్లి విషయంలో క్లారిటీ ఇచ్చేసిందన్న మాట.

  English summary
  TV anchor and Actor Ariyana Glory is Famous after Bigg Boss Show. Now She Doing Few Movies and Show. Recently she Clarity about her Marriage.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X