అఖిల్ బాడీ చూసి సిగ్గుపడిన అరియానా.. పప్పు ప్రశ్నలతో చిరాకు తెప్పిస్తూ..

యాంకర్ గా అలా క్రేజ్ అందుకుందో లేదో అరియానా తనకు తాను ఒక బోల్డ్ గర్ల్ అంటూ బిరుదు ఇచ్చేసుకుంది. బిగ్ బాస్ 4వ సీజన్ ఎంట్రీతోనే ఘాటుగా కనిపించిన ఈ యంగ్ గర్ల్ హౌజ్ లో చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. రోజుకో కామెడీ టాస్క్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది గాని అనుకున్నంత రేంజ్ లో వర్కౌట్ కావడం లేదు. ఆమె వాయిస్ పై ఇప్పటికే చాలా సెటైర్లు వచ్చాయి.

అందులో బాగా రెచ్చిపోయింది

అందులో బాగా రెచ్చిపోయింది

అరియానా ఎంట్రీ ఎలా ఉన్నా కూడా బిగ్ బాస్ లో మాత్రం కాస్త డోస్ తగ్గించేందుకు ప్రయత్నం చేసింది. కానీ ఆమె కొన్నిసార్లు వాగ్వివాదానికి దిగుతున్నప్పుడు కొంత నెగిటివ్ కామెంట్స్ ని ఎదుర్కోవాల్సి వస్తోంది. హోటల్ టాస్క్ లో యువరాణిగా కనిపించి పరవాలేదు అనిపించిన అరియానా కొంటె రాక్షసుల టాస్క్ లో బాగా రెచ్చిపోయింది.

ప్రేమ మొదలైందా.. అంటూ..

ప్రేమ మొదలైందా.. అంటూ..

ఇక శనివారం ఎపిసోడ్ లో తన ఒరిజినల్ యాంకర్ అవతారంలోకి వచ్చేసింది. బిగ్ బాస్ హౌజ్ లో షూటింగ్ చేసి ఆ సినిమాకు ప్రేమ మొదలైంది అనే టైటిల్ సెట్ చేసిన హౌజ్ మెంట్స్ అందుకు సంబంధించిన ప్రీమియర్ షోను కూడా చూపించారు. అయితే ప్రీమియర్స్ కి వెళ్లేముందు అరియానా ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేసి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నం చేసింది.

లాస్యతో ఉప్పు పప్పు..

లాస్యతో ఉప్పు పప్పు..

మోనాల్ ప్రేమ వ్యవహారాలను బయటకు లాగేందుకు అరియానా బాగానే ప్రయత్నం చేసింది కానీ వర్కౌట్ కాలేదు. అవును ప్రేమ ప్రతి ఒక్కరి మీద మొదలైంది.. అంటూ అరియానాను మోనాల్ హగ్ చేసుకుంది. ఇక లాస్య పప్పు, ఉప్పు ప్రశ్నలతో కాస్త చిరాకు తెప్పించింది. లాస్య కూడా ఆ తరువాత ఏదో పప్పు ప్రశ్నలు అడుగుతోంది అని చిరాకు పడింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Ariyana Glory Glamour Show చీరకట్టులో అరియానా గ్లోరి అందాల ఆరబోత...!!
అఖిల్ బాడీ చూసి సిగ్గుపడిన అరియానా

అఖిల్ బాడీ చూసి సిగ్గుపడిన అరియానా

ఇక అందరిని ఇంటర్వ్యూ చేస్తున్న అరియానా అఖిల్ తో మాత్రం చాలా స్పెషల్ గా మాట్లాడింది. బాడీ చాలా బాగా పెంచావ్ అని సిగ్గు పడగా.. చూస్తారా అంటూ అఖిల్ తన కోట్ ను విప్పబోయాడు. అప్పుడు అరియానా తల తిప్పుకొని చాలా సిగ్గుపడింది. ఇక అతని మనసులో ఒకరు ఉన్నారని చెప్పగా.. అందుకు అఖిల్ అవును తన మనసులో ప్రతి ఒక్కరు ఉన్నారని ఆడియెన్స్ కూడా తనపై ప్రేమను చూపిస్తున్నారని చెబుతూ సైలెంట్ గా ఎస్కేప్ అయ్యాడు. ఏదేమైనా అరియానా అడిగిన ప్రశ్నలు కంటెస్టెంట్స్ కి చాలా చిరాకు తెప్పించాయని వాళ్ళ మాటలతో అర్ధమయ్యింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X