బిగ్ బాస్‌లో షాకింగ్ సంఘటన: భోరున ఏడుస్తూ సొమ్మసిల్లిన మోనాల్‌.. భయంతో పరుగు పెట్టిన అరియానా

తెలుగులోనే సక్సెస్‌ఫుల్‌ షోగా రికార్డులకెక్కింది బిగ్ బాస్. ఇప్పటికే వరుసగా మూడు సీజన్లు పూర్తి చేసుకుని, నాలుగో దానిని కూడా అదే రీతిలో ప్రసారం చేస్తున్నారు నిర్వహకులు. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుండడంతో.. మరిన్ని ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు షో ఫినాలేకు చేరువ కావడంతో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బిగ్ బాస్ హౌస్‌లో ఓ షాకింగ్ సంఘటన జరిగింది. ఓ కంటెస్టెంట్‌ చేసిన పనికి మిగిలిన వారందరూ భయంతో పరుగులు పెట్టాల్సి వచ్చింది. అసలేం జరిగింది? పూర్తి వివరాలు మీకోసం!

ఆరుగురిలో ఐదుగురు నామినేట్

ఆరుగురిలో ఐదుగురు నామినేట్

ఫినాలేకు ఇంకో వారం రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న ఆరుగురిలో ఐదుగురిని బిగ్ బాసే నేరుగా నామినేట్ చేశాడు. అఖిల్ సార్థక్‌ రేస్ టు ఫినాలే మెడల్ సాధించడం ద్వారా అతడిని మినహాయించి... అభిజీత్, దేత్తడి హారిక, ఆరియానా గ్లోరీ, సయ్యద్ సోహెల్ రియాన్, మోనాల్‌ గజ్జర్‌లను నామినేషన్ ద్వారా ప్రేక్షకుల ముందు నిలబెట్టాడు పెద్ద బాస్.

టాస్కులతో ప్రేక్షకులను గెలిచేలా

టాస్కులతో ప్రేక్షకులను గెలిచేలా

ఈ వారం మొత్తం సరికొత్త టాస్కులు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ప్రతి టాస్కులో విజేతగా నిలిచిన వారు.. నేరుగా కన్‌ఫెషన్ రూమ్ నుంచి ప్రేక్షకులను ఓట్లు అభ్యర్థించవచ్చని బిగ్ బాస్ చెప్పాడు. అంతేకాదు, ఈ టాస్కులను ఎవరికి వారే.. ప్రాణం పెట్టి మరీ ఆడాలని సూచించాడు. టాప్ -5 చేరాలన్న పట్టుదలతో అందరు కంటెస్టెంట్లు కసిగా ఆడుతున్నారు.

ఆరియానాదే విజయం.. అడిగింది

ఆరియానాదే విజయం.. అడిగింది

మొదట జరిగిన ‘కింగ్ ఆర్ క్వీన్' టాస్కులో అందరూ తమదైన శైలిలో ఆకట్టుకున్నారు. ముందుగా సోహెల్.. ఆరియానాకు చుక్కలు చూపించగా.. ఆ తర్వాత హారిక సోహెల్‌ను ఓ ఆట ఆడుకుంది. అలాగే, మోనాల్.. అభిని అమ్మాయిగా మార్చేసింది. మొత్తానికి ఈ టాస్కులో అత్యుత్తమంగా రూల్ చేసిన కంటెస్టెంట్‌గా ఆరియానాను ఎంపిక చేయగా, ఆమె ప్రేక్షకులను ఓట్లు అడిగింది.

ఓపిక టాస్క్... వివాదాలమయం

ఓపిక టాస్క్... వివాదాలమయం

‘కింగ్ ఆర్ క్వీన్' టాస్క్ విజయవంతంగా పూర్తి కావడంతో, దాని తర్వాత రెండో రౌండ్‌లో భాగంగా ‘ఓపిక' టాస్కును ఇచ్చాడు బిగ్ బాస్. దీని ప్రకారం.. గార్డెన్ ఏరియాలో ఉన్న ఓ కుర్చీ మీద కంటెస్టెంట్లు ఒక్కొక్కరిగా రోబో మాదిరిగా కూర్చోవాలి. మిగిలిన వారంతా కుర్చీపై ఉన్న కంటెస్టెంట్‌తో హావభావాలు మార్పిస్తూ ఉండాలి. ఈ టాస్క్ మొత్తం గొడవలతో సాగింది.

ఆమె అలా చేస్తే.. ఇమె ఇలా చేసి

ఆమె అలా చేస్తే.. ఇమె ఇలా చేసి

ముందుగా ఈ టాస్కులో ఆరియానా గ్లోరీ కూర్చోగా.. సోహెల్, మోనాల్ గజ్జర్ ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. మరీ ముఖ్యంగా గుజరాతీ భామ ఆమెను సెంటిమెంట్‌తో కొట్టింది. ఆమెకు ఎంతో ఇష్టమైన బొమ్మను బయట పడేసేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత మోనాల్ కూర్చున్నప్పుడు కూడా ఆరియానా వ్యక్తిగతంగా టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే ఎన్నో కామెంట్లు చేసింది.

Recommended Video

Niharika Konidela wedding Saree Speciality
బిగ్ బాస్‌లో షాకింగ్ సంఘటన

బిగ్ బాస్‌లో షాకింగ్ సంఘటన

ఆరియానా పదే పదే తనను వ్యక్తిగతంగా విమర్శలు చేయడాన్ని మోనాల్ తట్టుకోలేకపోయింది. దీంతో లోపలికి వెళ్లి సోఫాపై గుక్కపెట్టి ఏడ్చింది. ఇది చూసిన ఆరియానా బయట ఉన్న వారందరికీ విషయాన్ని చెప్పింది. ఆమె ఏడుపు చూసి భయపడిపోయిన కంటెస్టెంట్లు కెమెరాల ద్వారా బిగ్ బాస్‌కు కంప్లైంట్ చేశారు. దీంతో ఆయన మోనాల్‌ను కన్‌ఫెషన్ రూమ్‌కు పిలిచి ధైర్యం చెప్పాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X