twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Bigg Boss OTT: షోలోకి ఫైర్ బ్రాండ్ రీఎంట్రీ.. ట్రోఫీ అప్పుడు మిస్సైనా ఇప్పుడు వదలకుండా ప్లాన్

    |

    తెలుగు బుల్లితెరపై ఎన్నో రకాల షోలు వస్తుంటాయి.. పోతుంటాయి. కానీ, కొన్ని మాత్రమే భారీ స్థాయిలో ప్రేక్షకాదరణను అందుకుని సూపర్ డూపర్ హిట్లుగా నిలుస్తుంటాయి. అలాంటి వాటిలో సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తోన్న బిగ్ బాస్ ఒకటి. రియాలిటీ ఆధారంగా నడిచే ఈ షోకు మన ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఫలితంగా దేశంలోనే నెంబర్ వన్ షోగా మార్చేశారు. దీంతో నిర్వహకులు రెట్టించిన ఉత్సాహంతో సీజన్ల మీద సీజన్లను పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను తీసుకు రాబోతున్నారు. కొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతున్న ఈ సీజన్‌లోకి ఫైర్ బ్రాండ్ అయిన మాజీ కంటెస్టెంట్ రాబోతుందట. ఆ సంగతులేంటో చూద్దాం పదండి!

     ఐదు సూపర్ హిట్.. ఓటీటీ వెర్షన్

    ఐదు సూపర్ హిట్.. ఓటీటీ వెర్షన్

    దేశంలోని చాలా భాషల్లో ప్రసారం అవుతోన్న తెలుగులో వచ్చే బిగ్ బాస్ షోకు మాత్రమే భారీ స్థాయిలో గుర్తింపు దక్కింది. అందుకే ఇది వరుసగా ఐదు సీజన్లను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు సరికొత్తగా ఓటీటీ వెర్షన్‌ను మొదలు పెట్టబోతున్నారు. ఈ విషయాన్ని నిర్వహకులు తెలిపారు. దీన్ని కూడా అక్కినేని నాగార్జున హోస్టింగ్ చేయనున్నాడు.

    బాడీ పార్టులన్నీ చూపిస్తూ అనన్య నాగళ్ల అరాచకం: తెలుగమ్మాయిని ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!బాడీ పార్టులన్నీ చూపిస్తూ అనన్య నాగళ్ల అరాచకం: తెలుగమ్మాయిని ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసుండరు!

    24గంటలు ఆ ఓటీటీలో ప్రసారం

    24గంటలు ఆ ఓటీటీలో ప్రసారం

    బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్‌ను 2021లో హిందీ నిర్వహకులు ప్రసారం చేశారు. అక్కడ ఇది సూపర్ హిట్ అయింది. దీంతో ఇప్పుడు తెలుగులోకి కూడా తీసుకుని వస్తున్నారు. అయితే, దీన్ని బిగ్ బాస్ సీజన్ మాదిరిగా టీవీలో చూపించరు. కేవలం ప్రముఖ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోనే ప్రసారం చేస్తారు. అంతేకాదు, దీన్ని 24 గంటల పాటు ఈ షోను స్ట్రీమింగ్ చేయబోతున్నారని తెలిసిందే.

    ఈ సీజన్ పనుల ప్రోగ్రెస్ ఇలానే

    ఈ సీజన్ పనుల ప్రోగ్రెస్ ఇలానే

    బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ ఫిబ్రవరి చివరి వారం నుంచి ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా రోజుల క్రితమే దీనికి సంబంధించిన అన్ని పనులనూ ప్రారంభించారు. సెట్ వర్క్‌ను దాదాపుగా కంప్లీట్ చేసేశారని అంటున్నారు. ఐదో సీజన్ హౌస్‌కు కొన్ని మార్పులు చేసి దీన్ని నిర్మిస్తున్నారట. అలాగే, కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా చివరి దశకు చేరినట్లు సమాచారం.

    మరోసారి రెచ్చిపోయిన దిశా పటానీ: ఈ సారి అలా పడుకుని మామూలు రచ్చ కాదుగా!మరోసారి రెచ్చిపోయిన దిశా పటానీ: ఈ సారి అలా పడుకుని మామూలు రచ్చ కాదుగా!

     డేట్, కంటెస్టెంట్లు, రోజులు ఇలా

    డేట్, కంటెస్టెంట్లు, రోజులు ఇలా

    ఇప్పటి వరకూ అందుతోన్న సమాచారం ప్రకారం.. బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్ ఫిబ్రవరి 20వ తేదీ నుంచి ఎంతో వైభవంగా మొదలు అవుతుందట. ఇది మొత్తం 82 రోజుల పాటు సాగనుందని తెలుస్తోంది. ఇక, ఇందులో 15 మంది కంటెస్టెంట్లు ఎంట్రీ ఇవ్వబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే కంటెస్టెంట్లకు సంబంధించిన షార్ట్ లిస్ట్ కూడా రెడీ అయిందని తెలిసింది.

     అప్పటి వాళ్లు కూడా వస్తున్నారు

    అప్పటి వాళ్లు కూడా వస్తున్నారు

    మరికొద్ది రోజుల్లోనే ప్రారంభం కాబోతున్న బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో ఇందులో పాల్గొనబోయే కంటెస్టెంట్ల గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఇక, ఇందులో ముగ్గురు లేదా నలుగురు మాజీ కంటెస్టెంట్లు పాల్గొనే అవకాశాలు ఉన్నాయట. ఇందుకోసం పాత కంటెస్టెంట్లతో మంతనాలు చేస్తున్నారని టాక్.

    ఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్, అల్లు అర్జున్: స్టార్ డైరెక్టర్ సూపర్ డూపర్ ప్లాన్.. ముహూర్తం కూడా ఫిక్స్!ఒకే ఫ్రేమ్‌లో ఎన్టీఆర్, అల్లు అర్జున్: స్టార్ డైరెక్టర్ సూపర్ డూపర్ ప్లాన్.. ముహూర్తం కూడా ఫిక్స్!

    షోలోకి ఫైర్ బ్రాండ్ రీఎంట్రీ అని

    షోలోకి ఫైర్ బ్రాండ్ రీఎంట్రీ అని


    ఎంతో ప్రయోగాత్మకంగా ప్రసారం కాబోతున్న బిగ్ బాస్ తెలుగు ఓటీటీ మొదటి సీజన్‌పై అంచనాలు నెలకొన్నాయి. అందుకు అనుగుణంగానే నిర్వహకులు సరికొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే గత సీజన్లలో బాగా హైలైట్ అయిన కంటెస్టెంట్లను తీసుకు రాబోతున్నారు. ఇందులో భాగంగానే ఫైర్ బ్రాండ్‌గా పేరొందిన అరియానా గ్లోరీ రీఎంట్రీ ఇస్తుందట.

     అప్పుడు మిస్సైనా.. ఇప్పుడు కాదు

    అప్పుడు మిస్సైనా.. ఇప్పుడు కాదు


    యూట్యూబ్ యాంకర్‌గా పరిచయం అయిన అరియానా గ్లోరీ నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది. అందులో అద్భుతమైన ఆటతీరుతో మంచి పేరును సంపాదించుకోవడంతో పాటు ఫినాలేకు చేరుకుంది. కానీ, ట్రోఫీని అందుకోవడంలో మాత్రం విఫలమైంది. ఇక, ఇప్పుడు ఎలాగైనా విజేతగా నిలవాలన్న ప్లాన్‌తో ఆమె ఓటీటీలోకి అడుగు పెట్టబోతుందనే టాక్ వినిపిస్తోంది.

    English summary
    Bigg Boss Show Completed Five Seasons Successfully. Now Makers Planing for OTT Season. Recently BB Team Approached Ariyana Glory
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X