Just In
- 8 hrs ago
అందుకే ఆ టైటిల్ పెట్టాం.. ‘చెప్పినా ఎవరూ నమ్మరు’పై హీరో కమ్ డైరెక్టర్ కామెంట్స్
- 8 hrs ago
పబ్లిక్ ప్లేస్‌లో ఘాటు ముద్దులు.. లిప్ కిస్‌తో భర్తతో శ్రియ రచ్చ
- 9 hrs ago
మళ్లీ రాజకీయాల్లోకి చిరంజీవి.. పవన్ కల్యాణ్‌కు అండగా మెగాస్టార్.. జనసేన నేత సంచలన ప్రకటన!
- 9 hrs ago
శ్రీను వైట్ల ఓ శాడిస్ట్.. మంచు విష్ణు సెన్సేషనల్ కామెంట్స్
Don't Miss!
- News
మెజార్టీ ఉంటే ప్రజలను చంపాలని కాదు.. మోదీపై దీదీ గుస్సా..
- Finance
ఆల్ టైమ్ గరిష్టంతో రూ.7300 తక్కువకు బంగారం, ఫెడ్ పాలసీకి ముందు రూ.49,000 దిగువకు
- Sports
ఆ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.. కమిన్స్‌ను మూడు ఫార్మాట్లకు కెప్టెన్‌ను చేయండి: క్లార్క్
- Automobiles
స్విఫ్ట్, బాలెనో, ఐ20 వంటి మోడళ్లకు వణుకు పుట్టిస్తున్న టాటా ఆల్ట్రోజ్
- Lifestyle
Study : గాలి కాలుష్యం వల్ల అబార్షన్లు పెరిగే ప్రమాదముందట...! బీకేర్ ఫుల్ లేడీస్...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వాళ్ల దెబ్బకు తట్టుకోలేకపోయిన ఆరియానా: బిగ్ బాస్ హౌస్‌లో తొలిసారి అలా కనిపించింది
యాంకర్‌గా కెరీర్‌ను ఆరంభించి చాలా తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో పాపులారిటీని సొంతం చేసుకుంది బోల్డ్ బ్యూటీ ఆరియానా గ్లోరీ. సోషల్ మీడియా ద్వారా దక్కిన గుర్తింపుతో బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అసాధారణ ఆట తీరుతో ఔరా అనిపిస్తోంది. ప్రతి టాస్కులో మగవారితో పోటీగా నిలుస్తూ సత్తా చాటుతోంది. దీంతో ఆమె ఫైనల్స్‌కు చేరడం ఖాయమన్న టాక్ బాగా వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ హౌస్‌లో ఇద్దరు కంటెస్టెంట్ల నుంచి ఆరియానా గ్లోరికి ఊహించని అనుభవం ఎదురైంది. ఆ సంగతులు మీకోసం!

యూట్యూబ్ స్టార్... వర్మ ట్వీట్‌తో క్రేజ్
యూట్యూబ్ ఛానెల్ యాంకర్‌గా వెలుగులోకి వచ్చింది ఆరియనా గ్లోరీ. తన కెరీర్‌లో ఎంతో మంది సినీ ప్రముఖులను ఇంటర్వ్యూలు చేసింది. తద్వారా సోషల్ మీడియాలో ఫేమస్ అయింది. ఈ క్రమంలోనే సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మతో చిట్ చాట్ చేసింది. అప్పుడు ఆరియానా అందాన్ని ఉద్దేశించి ఆయన చేసిన కామెంట్స్, ట్వీట్‌తో ఒక్కసారిగా సంచలనం అయింది.

బిగ్ బాస్‌లోకి సీక్రెట్‌గా ఎంట్రీ ఇచ్చింది
కొద్ది రోజుల క్రితం ప్రారంభం అయిన బిగ్ బాస్ నాలుగో సీజన్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చింది ఆరియానా. ఎంతో గ్రాండ్‌గా జరిగిన ప్రీమియర్ ఎపిసోడ్‌లోనే హౌస్‌లోకి వెళ్లినప్పటికీ... కంటెస్టెంట్లలా కాకుండా సయ్యద్ సోహెల్ రియాన్‌తో కలిసి సీక్రెట్ రూమ్‌లోకి ప్రవేశించింది. ఆ తర్వాత కొద్ది రోజులకు హౌస్‌లోకి వెళ్లింది. ఆ సమయంలో హౌస్‌మేట్ల నుంచి కొంత వివక్షకు గురైంది.

అవినాష్‌తో లవ్ ట్రాకుతో పాపులారిటీ
బిగ్ బాస్ హౌస్‌లో ఆరియానా ఒంటరిగా కనిపిస్తుండేది. ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఆమెను ఎవరూ అంతగా పట్టించుకునే వారు కాదు. అయితే, వైల్డ్ కార్డ్ ద్వారా అవినాష్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. అప్పటి నుంచి అతడితో కలిసి ఉంటోంది ఆరియానా. ఈ క్రమంలోనే వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందన్న ప్రచారం జోరందుకున్న విషయం తెలిసిందే.

గేమ్ విషయంలో తగ్గేదే లేదు అనేలా
ఆరియానా ప్రవర్తన ఎలా ఉన్నా.. గేమ్ విషయంలో మాత్రం ఆమె పర్‌ఫెక్ట్‌గా ఉంటోంది. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న తపన ఆమె ఆటలో కనిపిస్తోంది. ప్రతి టాస్కులోనూ వందకు వంద శాతం ఎఫర్ట్ పెడుతూ సత్తా చాటుతోంది. ప్రతి విషయంలో క్లారిటీగా ఉండడంతో పాటు నిజాయితీగా ఆడడం ఆమెకు మరింత బలం అవుతోంది.

వాళ్ల దెబ్బకు తట్టుకోలేకపోయిన గ్లోరీ
ఆరియానా ఆడుతోన్న గేమ్‌కు తెలుగు ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీలు సైతం ఫిదా అవుతున్నారు. నాగార్జున కూడా ఆమెను బాగా ప్రోత్సహిస్తున్నారు. దీంతో ఆమె కచ్చితంగా టాప్ -5లో ఉంటుందని అంతా అనుకుంటున్నారు. అందుకు అనుగుణంగానే ఆరియానాకు ఓట్లు కూడా పోలవుతున్నాయి. ఇలాంటి సయమంలో ఆమెకు బిగ్ బాస్‌లో ఊహించని అనుభవం ఎదురైంది.

బిగ్ బాస్‌లో తొలిసారి అలా కనిపించింది
మంగళవారం ఎపిసోడ్‌లో జరిగిన రేస్ టు ఫినాలే టాస్క్ మొదటి రౌండ్‌లో అఖిల్, సోహెల్ ధాటికి తట్టుకోలేక ఆరియానా ఓడిపోయింది. దీంతో బాగా బాధపడిపోయిన ఆమె.. లోపలికి వెళ్లి వెక్కి వెక్కి ఏడ్చేసింది. ‘షో నుంచి వెళ్లిపోతానేమో.. నాకు ఈ గేమ్ బాగా అవసరం' అంటూ అవినాష్‌ను పట్టుకుని విలపించింది. ఈ సీజన్‌లో తొలిసారి ఆమె అలా కనిపించడం గమనార్హం.