బిగ్ బాస్‌లో అనూహ్య పరిణామం: చివర్లో టెన్షన్ టెన్షన్.. షాక్‌లో కింద పడిపోయి కంటెస్టెంట్

తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లోని రికార్డులను బద్దలు కొడుతూ ప్రారంభం అయింది బిగ్ బాస్ నాలుగో సీజన్. ప్రీమియర్ ఎపిసోడ్‌కు 18 పైచిలుకు రేటింగ్ అందుకుని నేషనల్ రికార్డులను క్రియేట్ చేసింది. అంత గ్రాండ్‌గా మొదలైన ఈ సీజన్ చివరి దశకు చేరుకుంది. సోమవారం నుంచి ఫినాలే వీక్ ప్రారంభం కాబోతుంది. దీంతో విజేత ఎవరనేది మరో వారం రోజుల్లో తేలిపోనుంది. ఇలాంటి సమయంలో ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. ఈ క్రమంలోనే ఓ కంటెస్టెంట్ బిగ్ బాస్ ఇచ్చిన షాక్‌లో కింద పడిపోయింది. ఆ వివరాలు మీకోసం!

సందడి సందడిగా సండే ఎపిసోడ్

సందడి సందడిగా సండే ఎపిసోడ్

ఎప్పటి లాగే ఈ ఆదివారం కూడా ఎపిసోడ్ అంతా సందడి సందడిగా సాగింది. మాంచి మాస్ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన హోస్ట్ అక్కినేని నాగార్జున.. హౌస్‌మేట్స్‌లో జోష్‌ను నింపేలా గేమ్స్ ఆడించాడు. మొదట బ్లర్ చేసిన సినిమా ఫొటోలను కనుక్కోమని చెప్పిన ఆయన.. ఆ తర్వాత పాటలను గెస్ చేసే గేమ్ ఆడించాడు. వీటన్నింటిలోనూ అమ్మాయిల జట్టే విజయం సాధించింది.

వాళ్లిద్దరిని ఫినాలేకు పంపిన బాస్

వాళ్లిద్దరిని ఫినాలేకు పంపిన బాస్

గేమ్స్ ఆడిస్తూనే అఖిల్ సార్థక్, సయ్యద్ సోహెల్ రియాన్‌తో పాటు ఫినాలేకు చేరే కంటెస్టెంట్లను రివీల్ చేశాడు నాగ్. సెకెండ్ ఫైనలిస్ట్ అయిన సోహెల్‌తో మూడో కంటెస్టెంట్ ఎవరో చెప్పాలని కోరాడు. అతడు ఆరియానా కానీ, మోనాల్ కానీ ఉంటుందని చెప్పాడు. కానీ అందులో అభిజీత్ ఫొటో వచ్చింది. ఆ తర్వాత అభిజీత్‌ను అడగగా, హారిక పేరు చెప్పాడు. ఆమె ఫొటోనే వచ్చింది.

చివరి రౌండ్‌లో ఇద్దరు మిగిలారు

చివరి రౌండ్‌లో ఇద్దరు మిగిలారు

రేస్ టు ఫినాలే టాస్క్ ద్వారా అఖిల్ సార్థక్.. శనివారం ఎపిసోడ్‌లో సయ్యద్ సోహెల్ రియాన్ ఫినాలేకు చేరుకున్నారు. ఇక, ఆదివారం అభిజీత్, హారిక మొదట ఫినాలేలో అడుగు పెట్టారు. దీంతో ఆరియానా గ్లోరీ, మోనాల్ గజ్జర్ మాత్రం మిగిలారు. వీళ్లిద్దరిలో ఒకరు టాప్ -5లోకి వెళ్లి ఫినాలేకు చేరుతారని, మరొకరు ఎలిమినేట్ అయి తన దగ్గరకు వస్తారని నాగార్జున చెప్పాడు.

ఒకరు కాన్ఫిడెంట్‌.. బాధలో ఆమె

ఒకరు కాన్ఫిడెంట్‌.. బాధలో ఆమె

ఇన్ని వారాలు తనను సేవ్ చేసిన ప్రేక్షకులు.. ఫినాలేకు పంపుతారని అనుకుందో ఏమో.. ఆదివారం ఎపిసోడ్ మొత్తం మోనాల్ గజ్జర్ చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించింది. అదే సమయంలో గత వారం జరిగిన గొడవలు, ఉమెన్ కార్డు వాడడం వల్ల తాను బ్యాడ్ అయ్యానని ఫీల్ అయిందో ఏమో ఆరియానా గ్లోరీ చాలా బాధగా ఉంది. దీంతో చివరి రౌండ్‌పై మరింత ఉత్కంఠ నెలకొంది.

బిగ్ బాస్‌లో అనూహ్య పరిణామం

బిగ్ బాస్‌లో అనూహ్య పరిణామం

చివర్లో మిగిలిన ఇద్దరిలో ఒకరిని ఎలిమినేట్ చేయడం తనకు ఇష్టం లేదని చెప్పిన నాగార్జున.. ఆ కంటెస్టెంట్ ఎవరో బిగ్ బాస్‌నే చెప్పమన్నానని అన్నాడు. దీంతో స్టేజ్‌పై ఓ ప్రింటర్ తీసుకొచ్చి ఫినాలేకు తీసుకొచ్చే కంటెస్టెంట్ ఫొటో ఇందులో వస్తుందని చెప్పాడు. అందరూ అనుకున్నట్లు ప్రింటర్ నుంచి మోనాల్ ఫొటో కాకుండా... ఆరియానా పిక్ బయటకు వచ్చింది.

Recommended Video

Bigg Boss Telugu 4 : Vijay Devarakonda Supports His Life Is Beautiful Co Star Abhijeet
షాక్‌లో కింద పడిపోయి కంటెస్టెంట్

షాక్‌లో కింద పడిపోయి కంటెస్టెంట్


ప్రింటర్ నుంచి ఆరియానా ఫొటో రాగానే.. స్క్రీన్ వైపు చూపించిన బిగ్ బాస్.. ఆమెను ఫినాలేకు చేరినట్లు ప్రకటించాడు. దీంతో షాకైపోయిన ఆమె అమాంతం కింద పడిపోయింది. వెంటనే సోహెల్ వచ్చి ఆరియానాను పైకి లేపాడు. ఆ తర్వాత ఏడుస్తూ తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలు చేస్తున్నట్లు తెలిపింది. ఆ తర్వాత మోనాల్ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X