ఒక్క ఎపిసోడ్ మొత్తం మార్చేసింది: ఆ కంటెస్టెంట్ ఓటింగ్‌కు భారీగా గండి.. డేంజర్ జోన్‌లోకి!

బిగ్ బాస్ అంటేనే రియాలిటీ ఆధారంగా నడిచే షో. విభిన్న మనస్థత్వాలు ఉన్న పలువురు సెలెబ్రిటీలు.. ఒకే ఇంట్లో ఉంటూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశారన్న దానితో ఈ షో నడుస్తుంటుంది. అందుకే ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని గేమ్ ఆడాల్సి ఉంటుంది. ఒకవేళ కొంచెం తేడా వచ్చినా ఎలిమినేట్ అవ్వాల్సి వస్తుంది. ఇదే పరిస్థితి చివరి దశకు చేరుకున్న నాలుగో సీజన్‌లో ఎదురైంది. ఒకే ఒక్క ఎపిసోడ్‌తో ఓ కంటెస్టెంట్ ఓట్లకు భారీగా గండి పడుతోంది. అసలు ఎవరా కంటెస్టెంట్? వివరాల్లోకి వెళితే...

ఆసక్తికరంగా సాగుతోన్న నాలుగో సీజన్

ఆసక్తికరంగా సాగుతోన్న నాలుగో సీజన్

గత వాటితో పోలిస్తే బిగ్ బాస్ నాలుగో సీజన్‌లో పాల్గొంటున్న కంటెస్టెంట్లలో పెద్దగా ఫేమ్ ఉన్న వారు తక్కువ. అందులోనూ టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన కొందరు ముందే ఎలిమినేట్ అయిపోయారు. దీనికితోడు పాత సీజన్లతో పోలిస్తే ఈ సారి సరికొత్త టాస్కులు, కంటెస్టెంట్ల మధ్య గొడవలు, లవ్ ట్రాకులు సహా ఎన్నో అంశాలు కనిపిస్తున్నాయి. దీంతో షో ఆసక్తికరంగా సాగుతోంది.

ఒకరు ఎలిమినేట్... ఐదుగురు ఫైనల్‌కు

ఒకరు ఎలిమినేట్... ఐదుగురు ఫైనల్‌కు

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్‌లో ఆరుగురు సభ్యులు ఉన్నారు. అందులో ముగ్గురు అబ్బాయిలు (అఖిల్ సార్థక్, అభిజీత్, సయ్యద్ సోహెల్ రియాన్), ముగ్గురు అమ్మాయిలు (దేత్తడి హారిక, ఆరియానా గ్లోరీ, మోనాల్ గజ్జర్) ఉన్నారు. వీరిలో అఖిల్ ఇప్పటికే ఫినాలేకు వెళ్లిపోయాడు. దీంతో మిగిలిన ఐదుగురి నుంచి ఒకరు ఎలిమినేటై నలుగురు మాత్రమే చివరి వారానికి చేరుకుంటారు.

బిగ్ బాస్ భారీ ఆఫర్... నేరుగా అభ్యర్థన

బిగ్ బాస్ భారీ ఆఫర్... నేరుగా అభ్యర్థన

చివరి నామినేషన్ అంటూ అఖిల్‌ను మినహాయించి మిగిలిన అందరినీ నేరుగా నామినేట్ చేశాడు బిగ్ బాస్. ఈ ఎలిమినేషన్ తప్పించుకుని ఫినాలే వీక్‌లోకి అడుగు పెట్టేందుకు వీలుగా కంటెస్టెంట్లకు కొన్ని టాస్కులు ఇస్తున్నాడు. వాటిలో గెలిచిన ఒక సభ్యుడు లేదా సభ్యురాలు గోల్డెన్ మైక్ ద్వారా నేరుగా ప్రేక్షకులను ఓట్లు వేయమని అభ్యర్థించవచ్చని ఆఫర్ ఇచ్చాడు బిగ్ బాస్.

వాళ్లతో ఆడుకున్న బాస్.. శృతిమించింది

వాళ్లతో ఆడుకున్న బాస్.. శృతిమించింది

ఫైనాల్‌కు చేరాలన్న కసితో హౌస్‌లోని కంటెస్టెంట్లు అంతా పట్టుదలతో ఆడుతున్నారు. ఇందులో భాగంగానే బిగ్ బాస్ ఇచ్చిన టాస్కుల్లో వందకు వంద శాతం శ్రమిస్తున్నారు. కంటెస్టెంట్ల పరిస్థితిని క్యాష్ చేసుకుంటున్న నిర్వహకులు.. వాళ్ల సహనాన్ని పరీక్షించేలా టాస్కులు ఇస్తున్నారు. దీంతో షోలో ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి. అవి కాస్తా శృతి మించుతున్నాయి.

ఒకే ఒక్క ఎపిసోడ్ మొత్తం మార్చేసింది

ఒకే ఒక్క ఎపిసోడ్ మొత్తం మార్చేసింది

బిగ్ బాస్ షోలో ఎవరైనా హీరో అవ్వాలన్నా.. విలన్‌గా మారాలన్నా ఒకే ఒక్క సంఘటన చాలు. అందుకే ప్రతి క్షణం ఆచితూచి ఆడుతుంటారు కంటెస్టెంట్లు. కానీ, ఈ వారం జరుగుతోన్న టాస్కులు శృతి మించుతున్నాయి. ఫలితంగా తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఇలా జరిగిన ఒకే ఒక్క సంఘటన ఈ వారం ఓటింగ్ సరళిని మార్చేసినట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

Recommended Video

Nagarjuna Akkineni To Fans On Apple Products
ఆ కంటెస్టెంట్ ఓటింగ్‌కు భారీగా గండి

ఆ కంటెస్టెంట్ ఓటింగ్‌కు భారీగా గండి

గత ఎపిసోడ్‌లో ఆరియానాతో సోహెల్ గొడవ పడిన విషయం తెలిసిందే. ఇందులో తప్పెవరిది అన్నది పక్కన పెడితే.. అమ్మాయి మీదకు కొట్టేలా వెళ్లడం సోహెల్‌కు తలనొప్పిని తెచ్చి పెడుతోంది. అంతేకాదు, ఇది అతడి ఓటింగ్‌పైనా ప్రభావం చూపుతోంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఎపిసోడ్ తర్వాత ఓటింగ్‌లో అతడు మూడో స్థానానికి పడిపోగా, ఆరియానా సెకెండ్ ప్లేస్‌కు వెళ్లిందట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X